2020 కొత్త సంవత్సరం మొదటి రోజు డబ్బింగ్ సినిమాలతో మొదలుకానుంది. న్యూఇయర్ రోజున తెలుగు సినిమాలు చాలా అరుదుగా రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాదిలో డైరెక్ట్ తెలుగు సినిమాలేవీ విడుదల కావడం లేదు. అన్నీ కూడా సంక్రాంతికే రాబోతున్నాయి.

కానీ డబ్బింగ్ సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. తమిళ హీరో ధనుష్, మలయాళ హీరో మమ్ముట్టిల సినిమాలు రేపు తెలుగులో విడుదల కాబోతున్నాయి. ఇది వరకే మలయాళంలో విడుదలై సక్సెస్ అయిన ముమ్ముట్టి సినిమా 'రాజా నరసింహ' పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు.

2019 ట్రోలింగ్.. టాప్ ప్లేస్ లో రామ్ చరణ్!

ఈ సినిమాలో జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. 'మన్యంపులి' చిత్ర దర్శకుడు ఈ సినిమాని రూపొందించాడు. ఇక ధనుష్-గౌతమ్ మీనన్ కాంబోలో రూపొందిన ఒక సినిమా 'తూటా' పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది.

ఫైనల్ గా రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. గౌతమ్ మీనన్ సినిమాలకు తెలుగులో స్పెషల్ క్రేజ్ ఉండేది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆయన సినిమాలకు మార్కెట్ కూడా బాగా తగ్గింది. అయితే ధనుష్ కి తెలుగునాట ఫ్యాన్స్ ఉండడంతో ఈ సినిమా ఎలా ఉంటుందోననే ఇంటరెస్ట్ పెరిగింది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ దక్కించుకుంటుందో చూడాలి!