టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ కాస్త నెమ్మదించింది. ఈ ఏడాది రకుల్ నటించిన చిత్రాలు సరైన సక్సెస్ సాధించలేదు. తెలుగులో మన్మథుడు 2 చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కడంతో రకుల్ బాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించింది. 

అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు బాలీవుడ్ లో మరో ఎదురు దెబ్బ తగిలింది. ఐదేళ్ల క్రితం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో సిమ్లా మిర్చి అనే చిత్రంలో నటించింది. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటించింది. 

రమేష్ షిప్పి ఈ చిత్రానికి దర్శకుడు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్రం ఇంతవరకు రిలీజ్ కాలేదు. అనేక కారణాల వల్ల ఈ చిత్ర విడుదల వాయిదా పడుతూనే ఉంది. దర్శకుడు తన బాధ్యతగా  సినిమాని పూర్తి చేసి నిర్మాత చేతుల్లో పెట్టాడు. కానీ వారి సమస్యల వల్ల సినిమా విడుదల కాలేదు. 

ఈ చిత్రం ఎప్పటికైనా విడుదల కాకపోతుందా అనే ఆశలో నటీనటులు, చిత్ర యూనిట్ ఉన్నారు. కానీ తాజాగా నిర్మాతలు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 3న నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సినిమా థియేటర్స్ లో విడుదలైనప్పుడే నటీనటుల శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆన్ లైన్ లో విడుదల చేస్తే రీచ్ తక్కువగా ఉంటుంది. దీనితో రకుల్ ప్రీత్ సింగ్ నిరాశచెందింది. 

ఎన్ని ఇబ్బందులు ఉన్నా సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని, ఇలా ఆన్ లైన్ లో విడుదల చేయడం ఏంటని నిర్మాతలపై రకుల్ మండిపడుతోంది.