సినిమా హిట్ ,ఫ్లాప్ అనేది చాలా సార్లు రిలీజ్ డేట్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ గా ఏ ఎగ్జామ్స్ డేట్ లోనే సినిమా రిలీజ్ అయితే అందరూ ఆ హడావిడిలో ఉండి, సినిమా ట్రైలర్ చూడటానికి కూడా ఆసక్తి చూపించరు. ఖాలీగా ఉన్న టైమ్ లో ఎంత ఎలాంటి సినిమా అయినా నడిచిపోతుంది. జనాల ఈ సైకాలిజీ గురించి సీనియర్ నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే పండుగల రోజుల్లో, శెలవలు ఉన్నప్పుడు ,ఎగ్జామ్స్ అయ్యిపోయాక తమ సినిమా రిలీజ్ లు పెట్టుకుంటూంటారు. దాంతో ఆ టైమ్ లో రిలీజ్ అయ్యే సినిమాలు చాలా ఉంటాయి. ఆ సినిమాల మధ్య పోటీ కూడా ఉంటుంది.

సురేష్ బాబు, దిల్ రాజు , అల్లు అరవింద్ వంటి స్టార్స్ ప్రొడ్యూసర్స్ చేతిలో థియోటర్స్ కూడా ఉంటాయి కాబట్టి రిలీజ్ డేట్స్ ని కూడా వాళ్లే ఫిక్స్ చేస్తూంటారు. తమ సినిమాలకు ప్రోపర్ రిలీజ్ ఉండేలా చూసుకుంటారు. దాంతో మిగతా సినిమావాళ్ళు ఈ నిర్మాతల రిలీజ్ డేట్స్ చూసుకుని తమ సినిమాలు ప్లాన్ చేసుకుంటూంటారు. అక్కడే మైండ్ గేమ్ స్టార్టవుతుంది. రిలీజ్ డేట్ ప్రకటించకుండా నాన్చుతూ మిగతా వాళ్లను కన్ఫూజన్ లో పడేస్తూంటారు  సదరు ప్రొడ్యూసర్స్. సురేష్ బాబు కూడా గత నెల రోజులుగా ఇలాంటి మైండ్ గేమ్ నే ఆడుతున్నారని సినిమా జనం అంటున్నారు.

విక్టరీ హీరో వెంకటేష్‌, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ఫన్ ఎంటర్‌టైనర్‌ వెంకీ మామ. తొలిసారిగా నిజ జీవిత  మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

కార్తీక దీపం( నవంబర్ 27) దీప, కార్తీక్ లను కలిపేందుకు హిమ, శౌర్య ప్లాన్

ఎన్టీఆర్ తో లవకుశ వంటి చిత్రం తీసి హిట్ కొట్టిన బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట అక్టోబర్‌ 4న రిలీజ్ చేయాలని భావించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని ఫిక్స్‌ అయ్యారు.అయితే  సైరా లాంటి భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్న  సినిమాతో పోటి పడే కన్నా సినిమాను కాస్త వాయిదా వేయటం బెటర్ అని భావించి ప్రక్కకు వెళ్లారు. ఆ తర్వాత  దీపావళి కానుకగా అక్టోబర్ 25 న విడుదల చేయాలని నిర్ణయించారని వార్తలు వచ్చాయి. అదీ జరగలేదు. ఇక మిగిలింది క్రిస్మస్, సంక్రాంతి.

అయితే డిసెంబర్ 13న రిలీజ్ చేస్తారని అన్నారు. అయితే సురేష్ బాబు ఓ టీజర్ వదిలారు కానీ రిలీజ్ డేట్ ఖరారు చేయలేదు. అంటే డిసెంబర్ 25 న వస్తుందని కొందరంటున్నారు. అదేం లేదు క్రితం సంక్రాంతికి వెంకటేష్ నటించిన ఎఫ్ 2 సినిమా హిట్టైంది కాబట్టి ఈ సారి కూడా సంక్రాంతికే వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో సురేష్ బాబు ఉన్నారని ట్రేడ్ అంటోంది. ఈ సినిమా రిలీజ్ ని బట్టి మిగతావాళ్లు తమ సినిమా రిలీజ్ డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటారు. ఈ విషయం తెలిసినా సురేష్ బాబు సైలెంట్ గా ఉండి వెయిట్ మోడ్ లో పెట్టారు . ఏ రోజు రిలీజ్ అనేది... త్వరలోనే ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుందని సంభందిత వర్గాలు అంటున్నాయి.

సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ ని .. భాగవతంలోని కంసుడు, చిన్ని కృష్ణుడు పాత్రల నేపధ్యాలను తీసుకుని ఈ కథను అల్లినట్లు సమాచారం.

తన మేనల్లుడు చేతిలో తనకు మరణం ఉందని జాతకాలతో  పుట్టినప్పుడే తెలుసుకుని విడిపోయి...మళ్లీ పెద్దయ్యాక కలిసిన మామా-అల్లుడు కథ అని తెలుస్తోంది. జనార్దన మహర్షి చేసిన ఈ కథను కోన వెంకట్, దర్శకుడు బాబి కలిసి డవలప్ చేసారట.