కార్తీక దీపం సీరియల్ రోజు రోజుకీ ఆసక్తిగా మారుతుంది. అందుకే ప్రేక్షకులు ఈ సీరియల్ కి బ్రహ్మరథం పడుతున్నారు. ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్.. ఈరోజు ఏపిసోడ్ మీ కోసం ముందుగానే...

నేటి ఎపిసోడ్ లో... సౌందర్య, కార్తీక్ తో మాట్లాడుతూ ఉంటుంది. దీప, శౌర్యల పరిస్థితిని తన ఫోన్ లోని వీడియో చూపిస్తుంది. ఎందుకు ఇలాంటి వీడియోలు చూపిస్తావు మమ్మీ... అని అడుగుతాడు.  దీంతో సౌందర్య... సమాజం దృష్టిలో  నువ్వు ఒక దేశోద్దారకుడివని... అత్తగా మారకముందు అమ్మలా మాట్లాడుతున్నానని చెబుతుంది. నీలో లేని కాఠిన్యాన్ని అరువుతెచ్చుకోకు... నీకు పరిచయంలేని కాఠిన్యాన్ని ఆపాదించుకోకు, ఆదర్శ వివాహం చేసుకున్న ఉత్తమ భర్త ఏమైపోయాడు..  రంగు, రూపు చూడకుండా ఆత్మ సౌందర్యాన్ని మాత్రమే చూడగల మానవతా మూర్తి ఎక్కడ ఉన్నాడు..? ఏ అనుమానపు బీజం వల్ల మబ్బు పట్టిన చందమామలా అయిపోయావని.. చందమామ వెన్నలే  కురిపించాలని.. నిప్పులు కాదంటూ మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తుంది.

దీనికి వెంటనే కార్తీక్.. నువ్వు సైకాలజీ బాగా  స్టడీ చేశావు మమ్మీ.. ముందు నా వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తేసి.. తర్వాత నా ప్రవర్తనను పాతాళానికి తోసేశావు. అంటూ తల్లికి కౌంటర్ ఇస్తాడు. తాను దేవుడినీ కాదని.. అలా అని రాక్షసుడిని కాదని కార్తీక్ చెబుతాడు. తాను కూడా అందరిలాగే మనిషినని సౌందర్యతో అంటాడు. ఇలా కాసేపు తల్లీ కొడుకులు మాటల యుద్ధం చేసుకుంటారు.

భార్య కన్నీరు ఇంటికి మంచిది కాదని కార్తీక్ కి సౌందర్య చెబుతుంది. నీకు ఒక కూతురు ఉంది.. రేపో మాపో మీ తమ్ముడికి కూడా వంశోద్ధారకం రాబోతున్నాడని... ఇలాంటి సమయంలో.. దీప, శౌర్యల ఉసురు మన ఇంటికి తగులుతుందంటూ సౌందర్య బాధపడుతుంది. ఆ మాటలకు కార్తీక్ కి కోపం వస్తుంది.  నిజంగా మన ఇంటికి ఉసురు తగలకుండా ఉండాలంటే... దీప, శౌర్యల నీడ కూడా తన ఇంట్లో పడకూడదని.. వాళ్లిద్దరూ తన కంట పడకూడదటూ  ఆవేశంగా మాట్లాడతాడు. దీంతో కోపం వచ్చిన సౌందర్య కార్తీక్ చెంప మీద లాగి ఒక్కటిస్తుంది. 

సౌందర్య.. కార్తీక్ ని కొట్టడాన్ని హిమ చూస్తుంది. వెంటనే అక్కడికి వచ్చి తన తండ్రి  చెయ్యి పట్టుకొని.. మా డాడీని కొట్టావా నానమ్మ.. అని ప్రశ్నిస్తుంది. ఎంకెప్పటికీ మా నాన్న నీకు నచ్చడా? ఎప్పుడు మా నాన్నని ఏదో ఒకటి అంటావా అని ప్రశ్నిస్తుంది.  నువ్వు తాగి వస్తావని నానమ్మకి తెలుసు డాడీ... అందుకే ఏం జరుగుతోందనని నిద్ర పోకుండా ఉన్నాను అంటూ... హిమ.. కార్తీక్ తో చెబుతుంది. హిమ మాత్రం నానమ్మ సౌందర్య వైపు కోపంగా చూసుకుంటూ లోపలికి వెళ్తుంది.

మరో వైపు.. ఇంట్లో శౌర్య నిద్రపోతూ ఉంటుంది.  సడెన్ గా నిద్రలేచి... దీప, కార్తీక్ లు మాట్లాడుకున్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. తన తండ్రి డాక్టర్ బాబు అనే విషయం చెప్పకుండా తన తల్లి తనను మోసం చేసిందని శౌర్య ఫీలౌతుంది. డాక్టర్ బాబుకి.. తన తల్లిమీదకంటే... తన మీదే కోపం ఎక్కువగా ఉందని... అందుకే తాను వస్తానంటే.. ఆయన వెళ్లిపోతాను అంటున్నారని అనుకుంటుంది.

నా మీద ఎందుకు అంత కోపం అని ఆలోచిస్తుంది. తర్వాత గతంలోయ కార్తీక్ తనతో ప్రేమగా మాట్లాడిన సందర్భాలు గుర్తు తెచ్చుకుంటుంది. రౌడీ అంటూ ప్రేమగా పిలుస్తారని భావిస్తుంది. అదే సమయంలో దీప గదిలోకి రావడంతో.. శౌర్య నిద్రపోయినట్లు నటిస్తుంది.

తర్వాత దీప పడుకుందని నిశ్చయించుకున్నాక.. మళ్లీ తల్లిదండ్రి గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. డాక్టర్ బాబుకి అమ్మ మీద ఎందుకు కోపం..? అమ్మ మంచిది కదా... డాక్టర్ బాబు కూడా మంచివాడు కదా అని అనుకుంటుంది. ముందు వీళ్లద్దరినీ కలపాలని నిర్ణయం తీసుకొని నిద్రపోతుంది.

మరోవైపు .. హిమ.. తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన తండ్రిని ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదని బాధపడుతుంది.  మరోసారి వంటలక్క గురించి హిమ ఆలోచిస్తుంది. వంటలక్క.. తన తండ్రిని పెళ్లిచేసుకుంటే బాగుంటుందని ఫీలౌతుంది. కార్తీక్, దీపలు తనను , శౌర్య అంతా కలిసి ఉంటే బాగుంటుందని నిర్ణయించుకుంటుంది. ఈసారి వంటలక్కనే డైరెక్ట్ గా అడగాలని నిర్ణయం తీసుకుంటుంది.

మరోవైపు...దీప ఇంటి యజమాని సరోజక్క కి తెలిసిన వారికి గుండె నొప్పి వస్తుంది. దీంతో డబ్బు అవసరమై.. దీప వద్దకు వస్తుంది. డబ్బు ఎవరినైనా అడ్వాన్స్ అడిగి తీసుకువస్తాను అని దీప అంటుంది. అది విన్న.. శౌర్య.. నానమ్మ ఉంది కదా..  ఆనందరావు తాత, ఆదిత్య బాబాయి లు నువ్వు ఎంతడిగితే అంత డబ్బు ఇస్తారు కదా అమ్మ అని అడుగుతుంది.

అంతెందుకు డాక్టర్ బాబు ఉచితంగా వైద్యం చేస్తారు కదా... అని చెప్పి సరోజక్కకిచెబుతుంది. వారనాసి ఆటోలో వెళ్లి... హాస్పటిల్ కి తీసుకువెళ్లమని.. తాను వేరే ఆటోలో కార్తీక్ బాబు హాస్పిటల్ కి వస్తామని చెబుతుంది.
 

రేపటి ఎపిసోడ్ లో... కార్తీక్ దీపతో మాట్లాడుతూ ఉంటాడు. నేనే తండ్రినని శౌర్యతో చెప్పావా అని దీపని నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు శౌర్య చాటుగా వింటూ ఉంటుంది.