Asianet News TeluguAsianet News Telugu

టీవీ సీరిస్ గా మారుతున్న ‘పారసైట్‌’ ఫిల్మ్!

ఈ చిత్ర దర్శకుడు బాంగ్‌ జూన్‌ హో ...అమెరికన్ దర్శకుడు మరియు నిర్మాత అయిన ఆడమ్ మెకే తో కలిసి ఈ సీరిస్ ని రూపొందించనున్నారు. హెబీఓ ఛానెల్ కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది. 

'Parasite' the TV series is coming
Author
Hyderabad, First Published Feb 27, 2020, 3:46 PM IST

ప్రపంచ సినీరంగం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ అవార్డుల పంక్షన్ రీసెంట్ గానే జరిగింది.  అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సారి దక్షిణ కొరియా సినిమా ‘పారసైట్‌’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 92 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో ఒక ఆంగ్లేతర చిత్రానికి ఈ అవార్డ్‌ రావడం ఇదే తొలిసారి. అంతేకాదు మరో మూడు విభాగాల్లో కూడా ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాల వల్ల సమాజంలో నెలకొంటున్న కఠిన పరిస్థితులను వినోదాన్ని జోడించి వివరిస్తూ కొరియన్‌ దర్శకుడు బాంగ్‌ జూన్‌ హో ఈ చిత్రాన్ని రూపొందించారు.  ఇప్పుడీ చిత్రాన్ని టీవి సీరిస్ గా మారుస్తున్నారు. ఎక్కువ లాగకుండా లిమిటెడ్ సీరిస్ గా దీన్ని రూపొందించనున్నారు.

ఈ చిత్ర దర్శకుడు బాంగ్‌ జూన్‌ హో ...అమెరికన్ దర్శకుడు మరియు నిర్మాత అయిన ఆడమ్ మెకే తో కలిసి ఈ సీరిస్ ని రూపొందించనున్నారు. హెబీఓ ఛానెల్ కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది. సినిమాలో లేని అనేక సన్నివేశాలు ఈ సీరిస్ లో కనిపించబోతున్నాయి. ఇది ఇంకా ప్రాధమిక స్టేజీలోనే ఉందని, అత్యుత్తమ క్వాలిటీతో ఈ సీరిస్ ని నిర్మిస్తున్నామని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. టీవిలో చేసే ఆర్టిస్ట్ లు వేరని అన్నారు. ఈ సినిమాలో డ్రామా ఉండటం వలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ బీ ఓ ప్రతినిధులు చెప్తున్నారు. ఈ సీరిస్ టీవి ప్రేక్షకులుకు బాగా నచ్చుతుంనదని చెప్తున్నారు.

‘పారాసైట్‌’కి 4 ఆస్కార్‌ లు, దేశంలో తొలి ఆస్కార్!
 
‘పారాసైట్‌’ కథేమిటంటే...జీవితం కష్టంగా ఉన్న ఓ పేద కుటుంబంలో నలుగురు వ్యక్తులు.. ఉద్యోగాల కోసం ఓ ధనిక కుటుంబంలో ఉద్యోగాల్లో చేరతారు. తామంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులన్న విషయం ఓనర్స్ దగ్గర దాచిపెడతారు. వాళ్ల కన్నా ముందు ఆ ఉద్యోగాల్లో ఉన్న వారిని మోసగించి, ఆ ఇంటి నుంచి వెళ్లగొడతారు. యజమాని కుటుంబం విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి సౌకర్యాలను ఉపయోగించుకుంటూ గడుపుతుంటారు. అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వారికి వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసిపోతుంది.

ఈలోపే విహారయాత్రకు వెళ్లిన యజమానులు తిరిగి వస్తున్నారనే వార్త ఆ కుటుంబీకుల చెవిన పడుతుంది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని యజమానికి తెలిస్తే.. వాళ్ల ఉద్యోగాల పోతాయన్న భయంతో వారేం చేశారు? అన్నదే సినిమా.

కాన్స్‌(2019) చలన చిత్రోత్సవాల్లో పురస్కారం అందుకొన్న తొలి దక్షిణ కొరియా  సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తమ విదేశీ చిత్రంగా 77వ ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు కూడా అందుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ పురస్కారం దక్కించుకొని చరిత్ర సృష్టించింది.

Follow Us:
Download App:
  • android
  • ios