తన ప్రాజెక్టు కు క్రేజ్ తేవటం కోసం రకరకాల ఎత్తులు వేస్తూంటారు చిన్న సినిమాల దర్శక,నిర్మాతలు. తమ సినిమాకు ఏదో ఒక హైలెట్ చూపెట్టకపోతే జనం ఎట్రాక్ట్ కారు. అందుకే పెద్ద హీరోలను గెస్ట్ రోల్ లో అడుగుతూంటారు.

ఆ దర్శకుడుకి లేక ఆ నిర్మాతకు ఉన్న పరిచయాలతో స్టార్స్ సరేనని కొద్ది సేపు ఈ చిన్న సినిమాల్లో మెరుస్తూంటారు. గతంలోనూ దాదాపు అందరు హీరో లు వేరే వాళ్ల సినిమాల్లో గెస్ట్ గా కనిపించారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన రామ్ సైతం ఓ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించటానికి ఓకే చేసారు. ఆ మేరకు షూటింగ్ చేసినట్లు సమాచారం.

పాత బంగారం: 'సంసారం'లో పడ్డాకే అక్కినేని మోతాదు పెంచేశారు!

రామ్ కు ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా ‘రొమాంటిక్’.  నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో  హీరో రామ్ అతిథి పాత్ర పోషించాడని తెలుస్తోంది. ఇప్పటికే గోవాలో రామ్ కనిపించే సీన్ ను కూడా  షూట్ చేసినట్లు సమాచారం. పూరి నిర్మాణంలో  ఈ సినిమా తెరకెక్కుతోంది.  

ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో  సాగే ఓ లవ్ స్టోరీగా తెరకెక్కనుందట. ఈ సినిమాతో  ఆకాష్ పూరికి హిట్ వస్తుందని ఎదురుచూస్తున్నారు.  పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరో ప్రక్క రామ్ తనకు నేనూ శైలజా వంటి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.