అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రస్దానం  'సీతారామ జననం , (1-12-1944)తో మొదలైంది. ఆ సినిమా తర్వాత ఆయన చేసినవన్ని పౌరాణికాలు, జానపదాలే. ముఖ్యంగా  'కీలు గుర్రం' విజయంతో ఆయన జానపద హీరోగా సెటిల్ అయ్యిపోయారు. అయితే అదే సమయంలో సాంఘిక చిత్రాలకు పనికిరారు అనే టాక్ మొదలైంది. దాంతో ఎవరూ ఆయనతో సోషల్ సినిమాలు చేయటానికి ఆసక్తి చూపించేవారు కాదు.

ఏం చేయాలి..ఇలా కంటిన్యూగా జానపదాలే చేసుకుంటూ వెళ్లాలా..అలా చేస్తే తన కెరీర్ ఉంటుందా అని అక్కినేని మధన పడుతూండేవారట. ఈ విషయం ఎల్వి ప్రసాద్ కు చేరింది. ఆయన అప్పుడే  'సంసారం' చిత్రం ప్లానింగ్ లో ఉన్నారు. దాంతో అక్కినేనిని ఈ సోషల్ సినిమాలో తీసుకుని ట్రాక్ మార్చాలనుకున్నారు. నాగేశ్వరరావు ఎగిరి గంతేసి ఒప్పుకున్నారు.

కానీ ఇండస్ట్రీలో చాలా మంది నాగేశ్వరరావుని సోషల్ సినిమాలో చూడలేం. చక్కగా జానపదాలు చేసుకోమనక..ఎందుకీ ప్రయోగాలు అని మొహం మీదే అనటం మొదలెట్టారు. ఎల్వీ ప్రసాద్ ని ఈ విషయంలో ఆయన సన్నిహితులు హెచ్చరించారట. అయితే ఎల్వీ ప్రసాద్ తాను నమ్మిన విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తి. దాంతో అక్కినేని ని ఎట్టి పరిస్దితుల్లోనూ ఈ సినిమానుంచి బయిటకు వెళ్లకుండా చూసుకోవాలని త్వరలోనే ప్రాజెక్టు మొదలెట్టేసారు.

చీరలో సెక్సీ ఫోజులు.. యాంకర్ రష్మి హాట్ ఫోటోలు!

అయితే ప్రారంభంలో జానపదానికి అలవాటు పడ్డ అక్కినేని అదే ధోరణిలో నటించటం చూసి ఎల్వీ ప్రసాద్ కంగారుపడ్డారు. అప్పుడు నాగేశ్వరరావు ని కూర్చోపెట్టి ఆయన చేస్తున్న వేణు అనే పాత్ర గురించి వివరించాడట. అమాయకత్వం, మొరటు తనం, ఫన్ ఈ మూడు ఈ పాత్రలో కనపడాలని ఆదేశించారట. అంతేకాదు చాలా సీన్స్ తాను చేసి చూపించేవారట. మెల్లిగా ఆ క్యారక్టర్ నాగేశ్వరరావు కు ఎక్కేసింది. ఆయనే ఇంప్రవైజేషన్స్ చేయటం మొదలెట్టారు.  

అంతేకాదు  ఆ పల్లెటూరి కుర్రాడి పాత్రకు 'తస్సాదియ్యా' అనే మేనరిజాన్ని కూడా కలిపారట. తన ఎక్సపెక్టేషన్స్  మేరకు ఏయన్నార్ నటిస్తుంటే ఎల్వీ ప్రసాద్ చాలా ఆనందపడిపోయారట. నాగేశ్వరరావుని మెచ్చుకుంటూ, “తస్సాదియ్యా... కాస్త మోతాదు పెంచవయ్యా" అంటూ ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లారట.

ఆ తర్వాత 'సంసారం'లో వేణు' క్యారక్టర్ ఏయన్నార్ కి మంచి పేరు తెచ్చింది. ఆయన సాంఘీకాలకు సరిపోడనే అపోహను ఈ సినిమా తీసేసింది. ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించిన తొలి సాంఘిక చిత్రం 'సంసారం' (29-12-1950).