బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఓ జర్నలిస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీపికా 'ఛపాక్' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. పలు రియాలిటీ షోలు, కార్యక్రమాలకు హాజరవుతూ అభిమానులతో సినిమా సంగతులు షేర్ చేసుకుంటుంది.

ఈ సందర్భంగా ఆదివారం నాడు ఓ ఈవెంట్ లో పాల్గొంది. ఇందులో విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పింది. ఈ క్రమంలో ఓ విలేకరి 'మీరు గర్భవతట కదా' అని ప్రశ్నించాడు. దీనికి దీపికా.. 'నేను ప్రెగ్నెంట్‌లా కనిపిస్తున్నానా..? నేనెప్పుడు తల్లి కావాలో మీరే చెప్పండి. మీరు అనుమతిస్తేనే మేం పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ నిజంగా గర్భవతిని అయితే దాచాల్సింది ఏముంటుంది.. అందరికీ కనపడుతుంది కదా' అని కౌంటర్ ఇచ్చింది.

ఎన్టీఆర్ అభిమానులకు మెగా హీరో స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చేశారంటే!

చాలా రోజులుగా దీపికా గర్భవతి అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఖండించిన దీపికా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన 'ఛపాక్'సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలానే షకున్ బాత్రా దర్శకత్వంలో ఓ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. 2021 ఫిబ్రవరి 12న సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.