మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో యువ హీరో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ మేనల్లుడు గుంటూరు పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా వెండితెర ఎంట్రీకి సిద్దమైన విషయం తెలిసిందే.  `భ‌లే మంచి రోజు`, `శ‌మంత‌క మ‌ణి`, `దేవ‌దాస్` వంటి డిఫరెంట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అశోక్ మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక సినిమా ఇటీవల అఫీషియల్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారు. గతకొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ కి ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. సినిమాలో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అశోక్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోందట. ఇక నిధి అగర్వాల్ ఈ హీరోకి పర్ఫెక్ట్ జోడి అని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.  అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామానాయుడు స్టూడియోలో న‌వంబ‌ర్ 10న  ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించనున్నారు. సినీ ప్ర‌ముఖులు అలాగే పలువురు రాజకీయనాయకులు హాజ‌రవుతున్నారు. త‌న‌దైన స్టైల్లో డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.