తెలుగులో ఓ ఫేమస్ సామెత ఒకటుంది. ''ప్రతీ మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది'' అని.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా గెలిచిన రాహుల్ విజయం వెనుక అయితే ఇద్దరు స్త్రీలు ఉన్నారనే చెప్పాలి. ఒకరు పునర్నవి భూపాలం కాగా మరొకరు శ్రీముఖి.

అసలు హౌస్ లో రాహుల్ అనే ఒక వ్యక్తి ఉన్నారని గుర్తింపు రావడానికి కారణం పునర్నవితో అతడు చేసిన ఫ్లర్టింగ్ అనే చెప్పారు. పునర్నవి, రాహుల్ ల మధ్య ట్రాక్ కి యూత్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రాహుల్ కి అంత అటెన్షన్ రావడానికి కారణం పునర్నవినే. వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలను బిగ్ బాస్ బాగా హైలైట్ చేసిన చూపించారు.

Bigg Boss3: బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. శ్రీముఖి ఆశలు గల్లంతు!

ఇది ఇలా ఉండగా.. రాహుల్ తో శ్రీముఖి గొడవ పడడం కూడా రాహుల్ కి కలిసొచ్చింది. శ్రీముఖి పదే పదే రాహుల్ ని టార్గెట్ చేయడం, అతడితో గొడవ పడడం.. తనకు ఛాన్స్ వచ్చిన ప్రతీసారి రాహుల్ ని నామినేట్ చేస్తానని చెప్పడంతో రాహుల్ కి ఆడియన్స్ లో సింపతీ పెరిగింది. బయట పరిస్థితులు తెలియక శ్రీముఖి తన కోల్డ్ వార్ ని కంటిన్యూ  చేయడంతో రాహుల్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి.

మొత్తం 14 నామినేషన్స్ జరగగా.. అందులో రాహుల్ 11 సార్లు నామినేట్ అయ్యాడు. ప్రతీసారి అతడు సేవ్ అవుతూనే వచ్చాయి. దీంతో అతడు స్ట్రాంగ్ కంటెస్టంట్ గా మారాడు. ఇలా అన్ని విషయాలు రాహుల్ కి కలిసొచ్చి బిగ్ బాస్ టైటిల్ తన్నుకుపోయాడు. అలా రాహుల్ విజయం వెనుక ఇద్దరు ఆడవాళ్లు నిలిచారు.