1941 నుంచి రాజశేఖర రెడ్డి వరకు ... పోలవరం చరిత్ర

ysr name cant be separated from Polavarm says analyst



పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1941లోనే తొలిసారిగా అంకురార్పణ జరిగింది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ కి చెందిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క చీఫ్ ఇంజినీర్ వెంకటకృష్ణ అయ్యర్ నేతృత్వంలో 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు,40 మెగా వ్వాట్ల విద్యుత్తును ఉత్పత్తిచేసే హైడ్రల్ విద్యుత్ కేంద్రం నెలకొల్పేందుకు ప్రతిపాదన జరిగింది. నాడు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 6 కోట్లుగా ఉంది.

ఆ తరువాత 1946 లో హైడ్రల్ ప్రాజెక్ట్ కెపాసిటీని 40 మెగావాట్ల నుంచి 150 మెగ్వాట్లకు పెంచారు. అంచనా వ్యయం సైతం 12 కోట్లకు పెరిగింది. ప్రస్తుతమున్న ప్రాజెక్టు డిజైన్, పోలవరం కుడి కాలువను బ్యారేజీ వరకు విస్తరించడం ఈ అంచనాలను నాగార్జున సాగర్ డిజైన్ ను అందించిన శ్రీ కె ఎల్ రావు గారు రూపొందించారు.

ఏళ్ళు గడుస్తున్నప్పటికి,ఎంతో మంది ముఖ్యమంత్రులు మారుతున్నప్పటికీ 30ఏళ్లపాటు కార్యరూపం దాల్చని ప్రాజెక్టుకు తొలి సారిగా 1980లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.

కాంగ్రెస్ లో అయన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు మారడం,ఆ తరువాత ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం రావడంతో ప్రాజెక్టు పూర్తిగా మరుగున పడిపోయింది.1989లో కాంగ్రెస్ మరొకసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ టర్మ్ లో ముగ్గురు ముఖ్యమంత్రులతో ఏ ముఖ్యమంత్రీ చొరవ చూపకపోవడంతో ప్రాజెక్టు ఊసే లేకుండా పోయింది.1994లో తిరిగి టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ,ఎన్టీఆర్ ను గద్దెదించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనబడలేదు.కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రాజెక్టును పట్టుకుంటే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ కే పోతుందన్న ఉద్దేశమో ఏమో చంద్రబాబు పోలవరం అనే పదాన్ని సైతం తాను 9ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో కనీసం ఉచ్ఛరించలేదు.

2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చీ రావడంతోనే తెలుగుప్రజలకు దశాబ్దాల కలల ప్రాజెక్టుకు 25ఏళ్ళ తరువాత మరొక సారి శంకుస్థాపన చేసి వెనువెంటనే కాలువపనులను మొదలుపెట్టించారు.ఆ విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తొలిసారిగా పనులు ప్రారంభమయ్యాయి.అప్పటికి ప్రాజెక్టును నిర్మించేందుకు రాష్ట్రానికి ఎటువంటి అనుమతి లేదు.ఏ క్లీరెన్సు లేదు అయినప్పటికీ రాజశేఖర రెడ్డిగారు ప్రాజెక్టు నిర్మాణంలో చూపిన చొరవ మెచ్చుకోదగినది.ప్రాజెక్టు పనులు మొదలైన వెంటనే ఒక్కొక్క అనుమతులను సాధించుకుంటూ వచ్చారు.ఆయన మరణం నాటికి 10,000 కోట్లు అంచనా ఉన్న ప్రాజెక్టుకు దాదాపుగా 2,500 కోట్లు ఖర్చు చేశారు.ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాణమైన కాలువ పనులను పూర్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు టీడీపీ ఏ విధంగా విశ్వప్రయత్నాలు చేసింది,పేరులో తెలుగు పెట్టుకొని ప్రాజెక్టు విషయంలో తెలుగుప్రజల ద్రోహిగా ఎలా వ్యవహరించిందన్న విషయాలు తర్వాతి భాగంలో ...