డాక్టర్ మోదీ వైద్యం వికటించింది

What Modi refuses to listen

మోడీ నిర్ణయం వల్ల ప్రయోజనాలు లేవని ఎవరూ అనడం లేదు. దానిని అమలు చేసే విధానం చెత్తగా తయారయి కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక పోయిన చందంగా తయారైంది. అదెట్లా అంటే:

 

1.అధికార  పక్షానికి చెందిన నాయకుల వద్దనే కోట్లకొద్దీ రూపాయలు జమ అయినట్లు వార్తలొస్తున్నాయి. గాలి జనార్దన రెడ్డి, నితిన్ గడ్కరీ వగైరా నాయకుల ఇళ్ళలో జరిగిన పెళ్ళిళ్ళలో వందల కొద్దీ కోట్లు ఖర్చయినట్లుగా వార్తలు వచ్చాయి.అటువంటి విమర్శలకు దీటయిన సమాధానం ఇచ్చి అందరి నోళ్ళు మూయించకుండా మీడియాను తిట్టిపోస్తే ప్రజలు తృప్తి పడతారా?

 

2.రెండు రోజులు మాత్రమే ఏటీఎంలు పనిచెయ్యవని మొదట ప్రకటించారు. 35 రోజుల తరువాత కూడా కనీసం తొంభై శాతం ఏటీఎంలు పనిచెయ్యడం లేదు. ఇది ప్రజలను దగా చెయ్యడం కాదా? దీనిలో ప్రణాళికా వైఫల్యం, ప్రభుత్వ అసమర్థత స్పష్టం కావడం లేదా?

 

3.₹500 ల నోట్లు కనిపించడం లేదు. వంద రూపాయల నోట్లు బ్యాంకులు ఇవ్వడం ఎప్పుడో మానేశాయి. రెండువేల రూపాయల నోటు మార్చడం అత్యంత క్లిష్టతరంగా ఉంటోంది.ఇది కూడా ప్రభుత్వ అసమర్థత కాదా?

 

4. కొత్త నోట్లు బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా మార్పిడి చేస్తున్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. అనేక చోట్ల పెద్దమనుషుల వద్ద కోట్ల కొద్దీ నోట్లు పట్టు బడుతున్నాయి. ఈ లీకేజీకి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేక బ్యాంకుల మీదకు నెపం వేసి చేతులు దులుపుకుంటుందా?

 

5. గుంటూరు బస్సు డిపో అధికార్ల మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడి తెచ్చి ఒక మంత్రిగారి తనయుడు మూడుకోట్ల రూపాయల పాతనోట్లు మార్పించుకున్నాడట.ఇది కూడా మీడియా సృష్టే అయితే ప్రభుత్వం ఎందుకు మిన్నకుంది?

 

అన్నిటికంటె ధారుణం. రామాుజాచార్య, అన్నమయ్య, శ్కీకృష్ణదేవరాయ, తరిగొండ వెంగమాంబ వారసత్వం పుచ్చుకున్న తి.తి.దె. పరిపాలక మండలి సభ్యులు శ్రీమాన్ శేఖర రెడ్డిగారి దగ్గర దొరకిన సొమ్ము, వివరాలు అందరికి తెలుసు. వారిని నియమించినప్పుడు వారి గుణ గణాలగురించి తెలుసుకో లేదా? వారు సభ్యులయ్యాక మారారా? బ్యాంక్ ఉద్యోగులకు శ్రీరంగ నీతులు భోదించె శ్రీమాన్ చంద్రబాబు నాయుడుగారు రెడ్డిగారి గురించి నోరు తెరువక పోవడం, అంతరార్థం?  నాయుడుగారు  రెడ్డిగారిని ఒకటంటే,  రెడ్డి గారు   నాయుడిని రెండనే ప్రమాదమదయినా  ఉందా. లేకపోతే , నాయుడిగారికి ఇంత మౌనమెందుకు?

 

 మోదిగారి దృష్టికి పోవలసిన ముఖ్య అంశం ఒకటి. బ్యాంక్ ల దగ్గర క్యూలొ నిల్చుకొన్న అమాయక ప్రజల సహనం, ఓర్పు, మోదిగారి పై వారికున్న మెప్పు అసామాన్యమైనది. "పాపం మోది గారు ఏదో మంచి చెయ్యదలచుకొన్నారు. మనం ఇంతైనా సహకరించకపోతే ఎలా ?" అనేది వారి మాట.  కాని, బిజెపి  కార్యకర్తలు వారికి మంచి నీళ్ళైనా ఇచ్చె సాహసం చేశారా? కర్నూలులొ పోలీసులు, సద్గురు దత్త సంస్థ ఈ కరుణ చూపించారు.

 

ఆర్థిక అత్యవసర పరిస్థితిగురించి తర్జన భర్జన జరుగుతున్నది. ఒకమారు 1960 - 1970 దశకాల చరిత్ర తిరుగి చూడండి. ఇందిరా గాంధిగారు రాజభరణం రద్దు, బ్యాంక్ ల జాతీయం వంటి చర్యలవల్ల సంతోషంతొ ప్రజ ఆమెకు బ్రహ్మరథం పట్టింది. ‘నాకేమి వచ్చింది లేదు. ఔతలవాడి నష్టం నాకు ఆనందం.’

 

 బంగ్లా దేశం యుద్ధంతొ ఇందిరా గారి జనానురాగం హిమాలయ శిెఖరాన్ని అందుకొన్నది. "I have unshakeable faith in the power of the people." అంటూ గర్జించి   లోకసభను విసర్జించి, 1971 మద్యంతర ఎన్నికలొ కీర్తి పతాకాన్ని ఎగర వేశారు. తనకు సానుకూలంగా లేని  న్యాయాంగంపై దుమారం లేపి తనకు అనుకూలంగా మార్చుకొన్నారు. ప్రజాస్వామ్యమలొ అందరికి తెలిసిన ఒక చీకటి అధ్యాయం ఇది.   అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రభుత్వ యంత్రాగం ఆనంద సాగరములొ ఓలలాడింది. అల్లరి లేదు. బందులు లేవు. పిల్లల బడులు సక్రమంగా నడిచినయి. బస్స్ లు ట్రైనులు సకాలానికి ప్రయాణించాయి. జయప్రకాశ్ నారాయణ్, మొరార్జి, వాజపాయి, అద్వాని వంటి మహానాయకులు జైలు పాలయ్యారు.

 

అంతవరకు బాగుండింది. ప్రభుత్వోద్యోగులను "సకాలానికి కార్యాలయానికి రండి. మీరు ప్రజాసేవకులని గుర్తించుకొండి,’ అన్నారు. ఈ మాట రుచించని  ప్రభుత్వ యంత్రాగం, కొట్టకుండ, తిట్టకుండ, ప్రజలను పీడీంచి అత్యవసర పరిస్థితి దుష్పలితాలను ప్రజలకు కనిపించేలా చేసింది. ప్రజల దృష్టిలొ అధికారులు అమాయకులు. "ప్రభువుల ఆదేశాలను అమలు పరచేవాళ్ళు. పాపం వాళ్ళ చేతిలొ ఏమున్నది. " ఫలితం 1977  ఎన్నికలొ కాంగ్రెస్ పార్టియే కాదు,  స్వయూన ఇందిరా గాంధి ఒక అనామకుడు రాజ నారాయణ్ చేతిలో పరాజయం పాలయ్యారు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకొనడం కంటే అమలు చేసే యంత్రాంగ సహకారం అవసరం.

 

నోట్ల రద్దు వ్యహారమలొ బడా వ్యాపారస్థులు, పారిశ్రామిక వెత్తలు, రాజకీయ నాయకులు బతికి బయట పడడానికి పలు మార్గాలున్నాయి. "A thief is more intelligent than the police." "A Criminal is a step ahead of law."  అయితె అవినీతి పరులైన ప్రభుత్వ ఉద్యోగుల సంగతి: హర హర మహదేవ!

 

అందుకే మోదిగారి, బా.జ.ప. ప్రభుత్వ విధి విధానాలను  నీతి నియమాలను అమలు పర్చె యంత్రాంగం కఠిణమైన, కఠోరమైన, క్రూరమైన, పదజాలంతొ చిన్న వ్యాపార వర్గాలను హింసిస్తున్నది.

 

ఈ మద్య ఒక అధికారి మధ్యాహ్నం 12 గం.కు వచ్చి "ఈరోజు సాయంకాలానికి మీరు బ్యాంక్ లొ కర్రెంట్ ఖాతా తెరచి స్వైపింగ్ మెశ్శిన్ పెట్టుకోక పోతే రెపు మీరు శిక్షకు గురి అవుతారు. తస్మాత్ జాగృత".  అని హెచ్చరించి వెళ్లారు. నా దృష్టిలొ ఇది మోదిగారి హుకుమత్.

 

ఆయన ప్రభత్వం 30 నెలలు సాగింది. ఇక 30 నెలలే మిగిలింది. చలి తరరువాత వసంతం కచ్చితమ్. వోట్ల  పెట్టెలొ నా బలం చూపిస్తాను. మిత్రుడు నీతో విభేదిస్తాడు. శత్రువు ఏకీభవిస్తాడు. మోదిగారు వింటున్నారా?

 

*రచయిత తెలుగు నాట స్థిరపడిన కన్నడ పండితుడు. ఆం.ప్ర హోటల్ యజమాన్యాల సంఘానికి  అధ్యక్షుడిగా పనిచేశారు.