కూటి కోసం కూలి కోసం తెరాసలో బ్రతుకుదామని

ఎవరి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన జంప్ జిలానీకి 

ఎంత కష్టం .... యెంత కష్టం

మూడు రోజులు ఒక్క తీరుగా అడుగుతున్నా దిక్కు తెలియక

నడిసముద్రపు నావ రీతిగా సంచరిస్తూ సంచలిస్తూ

ప్లీనరీలు ముంచుకొస్తే

తిట్ల సీనరీలు గుర్తుకొస్తే

దిగులు బడుతూ దీనుడౌతూ తిరుగుతుంటే ...

కల్వకుంట్లకు లక్షలల్లో కూలివస్తే

తమకు మాత్రం

అరకొర కూలీగిట్టి నీరసిస్తే ఆవులిస్తే

భయం వేస్తే ప్రలాపిస్తే ...

మబ్బు పట్టి గాలి కొట్టి ...

వాన వస్తే ... వరద వస్తే...

చిమ్మ చీకటి కమ్ముకొస్తే...

దారి తప్పిన జిలానీకి

ఎంత కష్టం ... యెంత కష్టం!!

కళ్ళు వాకిట నిలిపి చూసే ... ప్రగతి భవన్ పెద్దాయన యేమని కలవరిస్తాడో

అణాకానీ కూలి వస్తే ... ఫార్మ్ హౌస్ కి పిలిచి ఏమి గొడవ పెడతాడో

కూటి కోసం కూలి కోసం తెరాసలో బ్రతుకుదామని

ఎవరి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన జంప్ జిలానీకి 

ఎంత కష్టం .... యెంత కష్టం

*

(నా వీరంగానికి మాటలిచ్చిన శ్రీరంగానికి కృతజ్ఞతలతో)

- శ్రీశైల్ రెడ్డి వేములఘాట్