నంద్యాలను ఇలా గబ్బు పట్టించి పోయారు

This ruling party destroyed the peaceful nandyala town in the name of election campaign

1

ఉప ఎన్నికలు..సాధారణంగా ఎందుకు వస్తాయి?ఒకటి.. అక్కడి ప్రజాప్రతినిధి రాజీనామా వల్ల...ఇక కోర్టులు అభిశంసించినప్పుడు..ఇది ఒకప్పటిమాట..ప్రస్తుతం దున్నపోతుమీద వాన కురిసినట్టే..మరొకారణం..నాయకుడు,అధిష్టానవర్గం తో అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడో..ఈ ఆత్మగౌరవం కూడా ప్రస్తుతం మచ్చుకైనా కనిపించడం లేదు....రాజీవ్ గాంధి ప్రధానిగా ఉన్నరోజుల్లో పార్టీ ఫిరాయింపుల కట్టడికి చట్టం తెచ్చినా దాన్ని ఆచరిస్తున్న దాఖలాలు లేవు...అచ్చంగా పల్లెల్లో ద్యావర దున్నపోతుకు కట్టడి లేని చందం అయిపోయింది.. 

మరోకారణం ప్రజాప్రతినిధి మరణం వల్ల....ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు కనిపెట్టారో కానీ సానుభూతి పని చేస్తుందని వారి కుటుంబీకులను నిలబెట్టడం మొదలైంది...రాచరికం లాంటి ఈ వ్యవహారం ప్రజాస్వామ్యంలోనూ బాగా గిట్టుబాటైంది..ఆ తర్వాత అనవసర ఖర్చు తప్ప సానుభూతి పవనాన్ని అడ్డుకోలేమని ఇతర పార్టీలు అభ్యర్థులనూ నిలబెట్టడం మానేసారు...అది ఇప్పుడు ఒక సాంప్రదాయం అయి కూర్చుంది...

This ruling party destroyed the peaceful nandyala town in the name of election campaign

ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికకు కారణం ఇక్కడి ప్రతినిధి భూమా.నాగిరెడ్డి మరణం అని తెలిసిందే..ప్రజలు ఎన్నిక చేసుకుంది వైసీపీ అభ్యర్థి అని..కానీ ఆయన చనిపోయేనాటికి తెదేపా....మాదే సీట్..వైసీపీ మాకు వదలిపెట్టాలని బుకాయిస్తుంది తెదేపా..ఇంతకూ మీ సభ్యుడా?అని ప్రశ్నిస్తే జవాబు ఉండదు.

మరి పార్టీ మారినందుకు స్పీకర్ చర్యలు తీసుకోకపోగా.. ఈయన మరణానంతరం అంతకుముందు తెలంగాణలో ఈ కప్పగంతుల నాయకులను మంత్రివర్గంలో తీసుకున్న విషయాన్ని వ్యభిచారంగా పోల్చిన తెదేపా ఇక్కడా నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు..వీరిలో ఒకరు నాగిరెడ్డి కూతురూ ఉన్నారు...

ఇక ప్రజాప్రతినిధి మరణానంతరం 6 నెలల్లో మరో ప్రతినిధిని ఎన్నుకోవాలి కాబట్టి గత 2 నెలలుగా ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అభ్యర్థులు ఖరారు అయ్యారు....

      ***    ***    ***

ఆ తర్వాత రంజాన్ మాసం మొదలైంది..ఇంకేముంది ముఖ్యమంత్రి కోటిరూపాయల ఇఫ్తార్ విందు అంటూ నంద్యాల్లో ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని దిగబడ్డాడు...25 రెసిడెన్షియల్ స్కూల్స్,అందులో 15 బాలికలకు అంటూ ఇంకా హజ్ హౌస్ వగైరాల ప్రకటనలు..యువతుల వివాహానికి 100 కోట్లు అంటూ యధేచ్చగా కానీపోనీ హామీలు గుప్పించాడు...

ఇక సెంటిమెంట్ కోసం..తన వత్తిడివల్ల భూమా చనిపోయాడన్న అపప్రధను తొలగించుకోవాలని భూమా అన్న శేఖర్ రెడ్డి కొడుకు బ్రహ్మానందరెడ్డిని నిలబెట్టినా అతను బలహీన అభ్యర్థి అని తెలిసిపోయింది...ముందు సెంటిమెంట్ పనిచేస్తుందనుకున్నారు..తల్లిదండ్రులు లేని పిల్లలు అన్నారు..నిజానికి అభ్యర్థి తల్లిగారు జీవించే ఉన్నారు..

ఇంకేముందీ!అభివృద్ది మంత్రం జపించడం మొదలుపెట్టాడు..అయినా ఏ ఫాక్షన్లో,అన్యాయంలో వాళ్లు పోయారని జనం జాలిచూపుతారు?ఈ సెంటిమెంట్ పండదని అర్ధమైంది... 

నిజానికి ఇటీవలి కాలంలో తరచుగా వినబడి విలువ పోగొట్టుకున్న పదం అభివృద్ది...ఉమ్మడిరాష్ట్రంలో 23 జిల్లాల్లు..అంతకుమించి హైదరాబాద్ నాయకుల చిలక్కొట్టుల్లకు,సంపాదనకు కల్పవృక్షం,కామధేనువులా కనిపించేది..ఇప్పుడో..ఓటుకు నోటులో పట్టుబడ్డ బాబు 10 ఏళ్ల ఉమ్మడిరాజధానిని వదలి ఏలాంటి సౌకర్యాలు లేని అమరావతి(?)కి వచ్చిపడ్డాడు...పాపం సంపాదనామార్గాలు మూసుకుపోయాయి...ఇక పార్టీ మారిన ప్రతి ప్రజాప్రతినిధీ అభివృద్ది కోసం అంటూ పార్టీ మారారు..నిజానికి ప్రతొక్కరూ ఎంతకు అమ్ముడుపోయారన్నది ఆ నియోజకవర్గాల్లో సామాన్యుడికీ తెలిసిన బహిరంగ రహస్యం..

ఈ అభివృద్ధి కాముకుల నియోజకవర్గాల్లో ఏలాంటి అభివృద్దీ లేదు..నంద్యాల్లో మాత్రం అదో తారకమంత్రమైంది...

This ruling party destroyed the peaceful nandyala town in the name of election campaign

 

 

ఇక్కడి ప్రత్యేకత ఏమంటే మునిసిపాలిటీగా 110 ఏళ్ల పైబడ్డ చరిత్ర ఉన్నా రోడ్లను మాత్రం జానెడు వెడల్పు చేయలేదు..నిజానికిక్కడి బైర్మల్ వీధి,మెయిన్ బజార్ల విస్తరణకు 1977 లో సంకల్పించినా ఆ తర్వాత 1990 ల్లో ప్రతిపాదించిన రోడ్ ను సుమారు 2 కి.మీ అడ్డగోలుగా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా కూల్చేసారు..ఒకరకంగా ప్రభుత్వ దాదాగిరి ఇది..

ఆ తర్వాత హెలికాప్టర్ లో 3 చక్కర్లు కొట్టి శిధిలాలను చూసి రెండురోజుల మకాం వేసి మంతనాలు జరిపాడు బాబు..

ఆ తర్వాత 2 రోజులకు ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది...

ఇంకేముంది మొత్తంగా నలుగురు మంత్రులు ఇక్కడే మకాం...వీరికి తోడు 25 మంది mlaలూ..మొత్తానికి గత నెలరోజులుగా అసలు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అవసరమే లేదన్న విషయం అర్ధమైంది..వర్షానికి కారే తాత్కాలిక సచివాలయం కన్నా ఇక్కడి లాడ్జ్ నయం అనుకుని పాలన(???) సాగించారు..

ఇక మరో పక్కన వీరికి పోటీగా వైసీపీ ఎమ్మెల్ల్యేలూ దిగారు...

ఒకప్పుడు 1977 పార్లమెంట్ ఎన్నికల్లో జనతాపార్టీ తరపున నీలం సంజీవరెడ్డి గెలిచినప్పుడు చాలామంది భారతదేశ పటాన్ని పెట్టుకుని నంద్యాలను వెదికారని విన్నాం...ఇక ఇప్పుడు చూడాలి..నానా చిల్లరదేవుళ్లూ,కుల,మత పెద్దలూ ఒకరి తర్వాత ఒకరు దిగబడిపోయారు...చివరకు అమెరికా కులసంఘాలవాళ్లు కూడా ...  

ఆత్మీయ సమావేశం అంటూ ప్రతి కులంలోని ఉపకులం వారూ ఓట్ల దేబరింపు,తాయిలాలు... ప్రచారం చివరిరోజు వరకూ ఇవి సాగాయి...

 

This ruling party destroyed the peaceful nandyala town in the name of election campaign

 

కాకపోతే జాతీయపార్టీ అయినా భాజపా ను మాత్రం ముస్లిం ఓటర్ల కోసం దూరం పెట్టారు..ప్రచారం చేసినా జండా,కండువాలు లేకుండా చెయ్యమన్నారు...

ఇక బాబు తన తరపున కడప శాసనమండలి ఎన్నికల గెలుపుకు ముఖ్యకారకుడు భావించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయాణ రెడ్డిని పంపాడు...అపరిమితమైన ఆర్ధిక స్వేచ్చను ఇచ్చాడు...వీరవిహారం చేస్తూ ఈతిబాధల్లో,ఆర్ధిక సమస్యల్లో ఉన్న చోటామోటా నాయకులను పశువుల్లా కొన్నాడు...మనిషి సామాజిక జంతువు అని చదివాం కానీ అమ్ముడుపోయే పశువు అన్నది ఇక్కడ నిరూపణ అయింది...

ఇక జగన్ ఇక్కడ 13 రోజుల పాటూ ఉండి నష్టనివారణ చెయ్యగలిగాడు...ఎక్కడికి పోయినా తిరునాళ్లను తలపించిన జనసందోహం...  

ఇక బాబు అంటాడూ ప్రతిపక్షనేతకు పనిలేక ఇక్కడ ఇన్నాళ్లు తిష్ట వేసాడా అని...

కానీ అడగవలసింది  ప్రజలు..పాలనను గాలికొదిలి 4 గురు మంత్రులు..మధ్యలో వచ్చిపోయే మరికొందరు మంత్రులు...పాతికకు తక్కువ కాని శాసనసభ్యులు,కుల,మత పెద్దలను ఎందుకు మొహరించాడని?తాను చేసిన అభివృద్ది,సంక్షేమాల మీద అంత నమ్మకముంటే ఈ వేషాలెందుకని....

చివరి 2 రోజుల ప్రచారంతో కలిసి ముఖ్యమంత్రే ఏకంగా 6 రోజులు ఇక్కడ గడిపాడు...ఇక చివరి 2 రోజుల్లో తన స్థాయిని మరచి శిల్పా మోహన్‌రెడ్డి పై చేసిన చవకబారు విమర్శలను జనం అసహ్యించుకుంటున్నారు...

వైసీపీ వర్గాలు జగన్ ప్రచారాన్ని,ప్రభుత్వ వ్యతిరేకతలను తమ అనుకూలాంశాలుగా భావిస్తుంటే...

తెదేపా అభివృద్ధి మంత్రం జపిస్తూనే ఉంది..ఇది ఎంతవరకు వెళ్లిందంటే భూమా బావమరిది,కర్నూల్ శాసన సభ్యుడు మోహన్‌రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ జనం అభివృద్ధి జరగాలంటే తమ ప్రతినిధి చావాలని కోరుకుంటున్నారని అనడం పరిస్థితికి అద్దం పడుతోంది....

ఎక్కడ చూసినా శిధిల భవంతులు...ఓటెయ్యకుంటే ఈ పనులు ఆగిపోతాయనే భావోద్వేగపు బ్లాక్ మెయిల్ కు జనం గురవుతున్నారు....ఇక ప్రభుత్వ పథకాల లబ్దిదారుల డేటా సేకరించి వారిని ఒక కోడ్ ద్వారా మీరెవరికి ఓటేసిందీ తెలుసుకుని మాకు వ్యతిరేకంగా ఓటేస్తే మీకు ఇచ్చే పథకాలను ఆపేస్తాం అని బెదిరించిన సంఘటనలూ కోకొల్లలు....నేనెందుకో పోసా అంటే నేనెందుకో తాగా అని సామెత...ఈ ఆధార్ అనుసంధానం ఈ రకంగా దుర్వినియోగం అయ్యింది... 

రోడ్ల విస్తరణ సౌకర్యమే తప్ప జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైన విద్య,వైద్య,ఉపాధి కోసం కొత్త కళాశాలలు,పరిశ్రమలు,సాగునీటి సౌకర్యాలు ఏమి కల్పిస్తున్నారు?ఇదెక్కడి అభివృద్దని జనం విస్తుపోతూ చూస్తున్నారు...

ఏదేమైనా ఈ ఉప ఎన్నికల ప్రచార అంకం నేటికి ముగిసింది...ఏ వీధిలో చూసినా రాష్ట్రస్థాయి నాయకులు వంగివంగి సలాం చెయ్యడం...ఇక వారి సొంత నియోజకవర్గాల్లో ఎంత దర్పం చూపిస్తారో కానీ ఇక్కడ ప్రజల మనుషులం అనిపించుకోవాలని దారి పక్కన బజ్జీలు,కారం దోసలు తింటూ భలే నటించారు.. రోజుకు పదిసార్లు గుమ్మం ఎక్కిదిగే నాయకులు అంతా మాయం అయ్యారు...

మొత్తానికి ఎన్నికల ఫలితం వరకూ నంద్యాల జనానికి బాధలు తప్పేట్లు లేవు...పొద్దున లేచి,పడుకునేవరకూ వారి బంధుమిత్రులు..ఇంకా ఈ బంధుమిత్రుల పరిచయస్తుల ఫోన్లు...ఎలా ఉంది?ఎవరు గెలుస్తారు?ఫలానా కులం,మతం,వర్గం ఎటువైపు అంటూ...అక్కడికేదో ఆ కుల,మత,వర్గాల వాళ్లు గంపగుత్తగా ఒకరికే ఓటేస్తున్నట్టు!

ఒకప్పుడు కొన్ని కుల,మత సంఘాలవారు వారి ప్రార్ధనా స్థలాలకు కావలసిన మైక్ సెట్లో,వంటపాత్రలో అడిగేవారు...ఇప్పుడు ఆ కుల,మత,వర్గాల ప్రతినిధులమంటూ చిల్లర నాయకులు మంచి ధరకు అమ్ముడు పోయారు....అంతేనా.. చివరికి నటుల అభిమాన సంఘాలవారు,కళాకారుల సంఘాలు,చివరికి వికలాంగుల సంఘాల పరిరక్షకులమని చెప్పుకునేవారు సైతం టొకున వారిని అమ్మేసారు... 

ఈ విపరీత పోకడలకు కారణం ప్రధాన మీడియా ఇచ్చే చిల్లర లెక్కలు కారణం.. 

ఒకప్పుడు బ్యాలట్ పత్రాలున్నరోజుల్లో బూతులవారీగా లెక్కించేవారు..దీనివల్ల పలానా వారు ఓటెయ్యలేదని దాడులు జరిగేవి..ఆ తర్వాత శేషన్ ఎన్నికల ప్రధానాధికారిగా వచ్చాక అన్ని పత్రాలు కలగలిపి లెక్కించడం మొదలైంది...

పర్యావరణ హితం అంటూ పేపర్ల స్థానం లో evm లు వచ్చి పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది..పలాన పోలింగ్ బూత్‌లో ఇన్ని ఓట్లు..ఫలానా కులం,మతం వాళ్లు వేసిండొచ్చనే కాకిలెక్కలు...

రాష్ట్ర విభజన వల్ల సినిమాలనూ హీరోల కులం ప్రాతిపదికన చూసే కొన్నిజిల్లాల వారితో కలిసినందున ఇన్ని కులాల పెద్దలమంటూ ఎక్కడెక్కడి సన్నాసులూ ఇక్కడ దిగబడి మన సమాజాన్నీ భ్రష్టు పట్టిస్తున్నారు...వారిలాగే కులాల ప్రాతిపదికన సమాజం నిట్టనిలువున చీలడానికి ఎన్నోరోజులు పట్టదు అని చాలామంది వాపోతున్నారు...

ఈ విషయంగా ఎన్నికల సంఘం ఏదైనా చర్యలు తీసుకోవాలనీ కోరుకుంటున్నారు... 

 

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి