ష్... గప్ చుప్ గా చదవండి

This is not exactly gossip of Telugu politicians

నగరం లో ఉన్న రాజకీయ నాయకులు అందరూ , మరీ ముఖ్యం గా, నల్ల ధనం అంటే అది నల్లగా ఉంటుందా అని అమాయకం గా అడిగే శ్రీ మాన్ నిప్పు నాయుడు కూడా పెద్ద నోట్లు రద్దు మంచిదే అని పొగుడుతూ ఉంటె, ఇదేదో తేడా లా ఉందే అని,పరిశోధిస్తే, అనేక ఆశ్చర్య కరమయిన సంగతులు తెలిసాయి. 


 

ఈ నోట్ల రద్దు అనే ‘సీక్రెట్’ చాలా మందికి ముందే తెలుసు. మద్రాస్ ఎయిర్ పోర్ట్ లో నవంబర్ ఒకటి నుంచి ఎనిమిది లోపు సింగపూర్ వెళ్ళిన వాళ్ళ లిస్టు చూస్తే ముప్పాతిక మంది సినిమా, పోలిటీషియన్,బిజినెస్ వాళ్ళే. వాళ్ళ కాష్ చాలా వరకూ మార్చేసుకున్నారు. 



రెండు తెలుగు రాష్ట్రాల్లో సిత్రాలు మరీ విసిత్రం. ఇక్కడ భారీ ఎత్తున ఇరిగేషన్, పైప్ లైన్ ప్రాజెక్ట్ లు జరుగుతూ ఉండడం తో, ఈజీ అయ్యింది. వర్కర్స్ అందరినీ పిలిచి సంవత్సరం జీతాలు ముందే ఇచ్చేసి, సంతకం పెట్టించుకున్నారు. పెట్రోల్ షాప్ లలో ముందే డబ్బులు ఇచ్చి, నా జేసిబి ఎప్పుడు వచ్చినా ఇది అయ్యే వరకూ ఫ్రీ గా పెట్రోల్, డీజిల్ పొయ్యాలి అని మాట్లాడుకున్నారు. జన ధన ఖాతాల్లో జమ అయ్యింది, దొంగ సొమ్ము కాదు, వాళ్ళ జీతమే https://ci5.googleusercontent.com/proxy/xdZoo_3eVWioBQ7AlqPpvELM9J5UEvIZVrTpDi-BJ5JSXBjguI0UHW8sHtm-CS-E_kobQNCLod1OXmXE99Y4G9lPiZDZEey6OlANnoQHSjctq-841Q=s0-d-e1-ft#https://www.facebook.com/images/emoji.php/v6/f4c/1/16/1f642.png🙂 వాటి జోలికి వెళితే మోడీ కి మంట పెట్టడం ఖాయం. పెట్రోల్ షాప్ లు స్టాక్ తో సంబంధం లేకుండా అమ్మకం ఎలా చేస్తాయో తెలీదు. అది ఆడిట్ చేస్తే తప్ప వాళ్ళు ఎలా లాండర్ చేసారో అర్ధం కాదు.(పెట్రోల్ పంపులలో వారి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యాన్ని ఉపయోగించుకుని అడ్వాన్స్ గా సరుకు కోసం చెల్లించవచ్చు.ఇలా 20,30 లక్షలు,బంకు అమ్మకాలను బట్టి పంపేవారున్నా అదే బంకుల నుంచి ఇప్పుడు కోట్ల రూపాయలు చమురు కంపెనీలకు చేరాయి.) మోడీ కి ఈ విషయం చెప్పాలి.

 

ఒక మాజీ ముఖ్యమంత్రి (హీయన గూడక టెల్గూ ఎంతో షుందరంగా మాట్లాడును.చివరి బంతి గుగ్లీ వేయును)సమీప బంధువు(మేనల్లుడు/అల్లుడు) పాపం బ్లాక్ మనీ రాజకీయులకి ఆశా జ్యోతి అయ్యాడట 


ఒక నవాబు గారి క్లబ్ లో(అభాగ్యనగరం నడిబొడ్డున) దిగాలు గా కూర్చుని ఉన్న అందరినీ పిలిచి, పిసి సర్కార్ పెద్దన్న లాగా బ్లాక్ ని ఎలా వైట్ చెయ్యొచ్చో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించాడు. 


జ్ఞానోదయం అయిన పెద్దలు వెంటనే చాలా వరకూ డబ్బుని కంపెనీ ల లోకి మళ్ళించారు. డాలరు నూట పదహారు రూపాయల కి కూడా కొనుక్కున్నారు. 


బస్సు టికెట్ ల మీద ఒక్కో టికెట్ మీద కమిషన్  తీసుకునే ఒక అమాత్య శేఖరుడొకాయన("పట్నం" లో శాలిబండ), నాకు లంచం వద్దు మాస్టారు, ఇదిగో వీడు మా అల్లుడు, వాడి కంపెనీ తో మీరు అగ్రిమెంట్ చేసుకోండి, రోజుకి ఐదు లక్షలు సర్వీస్ చార్జి లు గా పే చెయ్యండి అని లంచం తీసుకోవడం లో కొత్త మార్గం సృష్టించారు. 

 

ఒక బ్యూరోక్రాట్ అయితే, నాకు లంచం వద్దు, మీ కంపెనీ పేరు మీద ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి, దానిలో డబ్బులు వేసి, నాకు చెక్కులు ఇవ్వండి, టైం ఉన్నప్పుడు నేను విత్ డ్రా చేసుకుంటా అని చెప్పాడు. ఇంకా విన్నవి ఏమిటి అంటే, డబ్బులు ఇప్పట్లో ఇవ్వకండి, ప్రస్తుతానికి అలా ఉండండి, మార్గం వెతుకుతున్నాం అని చెబుతున్నారు.

 

ఒక నేతాజీ (నిప్పు కు కూడా కాలని ఉక్కులాంటి మనిషి మరి) అయితే,తన బ్లాక్ మొత్తం వైట్ చేసుకోవడమే కాక, ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల లో కూడా ఇవ్వాల్సిన కమీషన్ లు ముందే తీసుకుని దాన్ని కూడా వైట్ చేయించాడు అట.

 

త్వరలో ఒక రాష్ట్రం లో కాష్ లెస్ పేరుతో బస్ కండక్టర్ లకి ఆంద్రాయిడ్ డివైస్ లు , డ్వాక్రా మహిళల కి ఫోన్ లు ఇచ్చే కార్య క్రమం జరుగుతున్నది. వాటిలో బయో మెట్రిక్ ద్వారా అన్ని బిల్లులు పే చెయ్యడం, వాలెట్ లు అన్నీ ఉంటాయి.

 

గ్రామాల్లో చదువు లేని వాళ్ళ కోసం, ఇవి యూజ్ చేస్తారు. ఇది అంతా రాత్రికి రాత్రి ఆలోచించి, ఈ ప్రాజెక్ట్ మీకే, నాకు డివైస్ కి ఇంత ఇచ్చెయ్యండి అని పుచ్చేసుకుని,కో ఆపరేటివ్ బాంక్ ల ద్వారా, గుడి హుండీ ల ద్వారా(ఈ గుడి హుండీ లెక్కింపులు ఏరోజువి ఆరోజు లెక్కకట్టి డినామినేషన్ వేసి ఉంచుతారో,లేక మొత్తంగా లెక్కపెట్టి ఉంచి బ్యాంకుకు పంపుతారో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నీ శ్వేతపత్రం ప్రకటించాలి) చిన్న నోట్ లకి మార్చేసుకున్నారు.

 

ఇంకొందరు, ఆ డబ్బు ఏమి చేసుకుంటాం, ఈ నైట్ కి మంచి సినిమా స్టార్ ని ఏర్పాటు చెయ్యండి అని బాధలు మరిచిపోయారు అని వినికిడి.

 

ఇక చిన్నదొర వారు కేంద్ర మంత్రి,పక్కడేశాల బ్యాంకులు ముంచిన శీలవంతుడి ఆస్థి కొన్నాడని వినికిడి. అసలు దొరవారి తోటబంగళాల నుంచి కంటెయినర్లలో రిజర్వ్ బ్యాంకుకే తరలిపోయి మార్పిడి జరిగిందని భోగట్ట.మరి రిజర్వ్ బ్యాం అన్నిప్రాంతాలకు పంపిన డబ్బెంత?అక్కడ పంపిణీ జరిగిందెంతో చెప్పే ప్రకటన ఎందుకు చెయ్యడం లేదు? 

 

ఇలాంటి సిత్రాలు ఎన్నో జరిగాయి. అందుకే అన్నేసి లక్షల కోట్లు సిస్టం లోకి వచ్చి పడింది. చాలా హై లెవెల్ పెద్దోల్ల కి సమస్య లేదు, వాళ్లకి ముందే తెలుసు. 

 


వెయ్యి కోట్ల కంటే తక్కువ ఉన్నోల్లకే తెలీదు. వాళ్ళు హడావిడి పడి, గోల్డ్, డాలర్ లూ కొనేసారు. నెక్స్ట్ వేట గోల్డ్ మీద ఉంటుంది అనేది మాత్రం నిజం. నవంబర్ ఎనిమిది తరువాత అర కిలో కంటే ఎక్కువ గోల్డ్ కొన్న వాళ్ళ అందరి వివరాలు ఇప్పటికే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాయి అట. త్వరలో వాటి మీద చర్యలు ఉండొచ్చు. అది తెలిసిన తరువాతే గోల్డ్ మీద సామాన్య ప్రజలను రెచ్చ గొట్టే ప్రోగ్రాం లు మొదలు అయ్యాయి అట.

 

ఇంకో విషయం, రియల్ ఎస్టేట్ లో ఇప్పటికీ పాత నోట్ లు తీసుకుంటున్నారు. ఇరవై శాతం మార్జిన్ లో నడుస్తున్నది. వైట్ లో కొనే వాళ్ళు కొనడం లేదు కాని, బ్లాక్ లో కొనే వాళ్ళు పుష్కలం గా కొంటున్నారు. రిజిస్టర్ అవుతున్నాయి.

 

ఇదీ సంగతి.