ష్... గప్ చుప్ గా దీన్నీ చదవండి (2)
రెండో భాగం (మొదటి భాగం ఇక్కడ)
జీతాలు ఇవ్వడం, పెట్రోల్ షాప్ లకి పంపడం ద్వారా ఒక లెవెల్ వరకూ బ్లాక్ మనీ వైట్అ యిపోయాక, మిగిలిన డబ్బు ని ఎలా వైట్ చేసుకుంటున్నారో చూద్దాం.
రియల్ ఎస్టేట్ లో ఇప్పటికే నిర్మాణం లో ఉన్న భవనాల బిల్డర్ లని పిలిచి, ఇదిగో ఈ వంద కోట్లు తీసుకో, పది ఫ్లాట్ లు నావి, లేకుంటే ఈ బిల్డింగ్ నాది అని అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ బిల్డర్ వెంటనే ఆ డబ్బు ని మెటీరియల్ సప్లయర్ లకి, కాంట్రాక్టర్ లకి ఇచ్చేసుకున్నాడు, వాళ్ళు వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్లకి, అలా చేతులు మారి మారి, చివరికి కూలీలకి, కంపెనీ ల లో కాష్ ఇన్ హాండ్ ఖాతా లోకి మారి, అచ్చం అయిన వైట్ లా బాంక్ లోకి చేరిపోయింది.
ఇక ఆ బిల్డింగ్ లు అమ్ముకున్నప్పుడు వైట్ లో అమ్ముతారు, ఎవడన్నాలోన్ తీసుకుని కొనే వాళ్ళ కోసం ఇవి కాక స్టీల్ , గ్లాస్, సిమెంట్ కంపెనీలకి డబ్బులు కాష్ లో ఇచ్చేసారు. వాళ్ళు వాటికి సప్లయ్ మెటీరియల్ కింద రాసుకుని, వాళ్ళ కమీషన్ తీసుకుని మెటీరియల్ ఇచ్చేస్తారు. ఫాక్టరీ లో ఎక్కువ అవుట్పుట్ వచ్చినట్టు రాసేసుకుంటారు. తక్కువ అమ్మి, ఎక్కువ అమ్మినట్టు చూపించుకుంటారు. వైన్ షాప్ లు, బార్ లలో చాలా చిల్లర వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ప్రతి రోజూ బార్ లో, వైన్ షాప్ లో వచ్చే డబ్బు అంతా తీసుకుని దానికి పాత నోట్ లు ఇవ్వడం.ఇది ఒక పద్ధతి.
ఆ డబ్బు వైట్ అవదు, మళ్ళీ పెట్టె లోకి చేరుతుంది. అలా కాష్ హోర్డింగ్ కూడా జరిగింది. ధార్మిక సంస్థలకి , చారిటీ లకి డబ్బులు ఇస్తే వాళ్ళు విరాలాలని బాంక్ లో వేసుకోవచ్చు. కాకుంటే తరువాత లెక్క చెప్పాల్సి వస్తుంది. ధార్మిక సంస్థల డిపాజిట్ ల మీద శ్వేత పత్రం ప్రకటిస్తే ఆ బండారం బయట పడుతుంది. రాత్రి కి రాత్రి కొన్న బంగారం లాకర్ లో కి చేరింది. ఆ డబ్బు గుజరాత్, రాజస్థాన్ లో వ్యవసాయ ఆదాయం కింద బాంక్ లకి పోయింది. ఈ మొత్తం ఎక్సర్సైజ్ చివరికి కొండ ని తవ్వి ఎలుక ని పట్టినట్టు అవుతుంది అనిపించేలా ఉంది. ఇండియన్స్ కి ఎలాంటి సిస్టం ని అయినా దెబ్బ కొట్టే తెలివి ఉంది.
అందరి కంటే ముందు టెక్నాలజీ ఉపయోగపడేది మోసగాళ్లకే. ఇపుడు మన పెద్దోళ్లంతా పోన్ కాల్స్ మానేసి, ట్రాన్సాక్షన్స్ అన్నీ వాట్స్ ప్ కాల్స్ లోకి మళ్లించినట్లు తెలసింది. పోన్ కాల్స్ ట్రేస్ చేయడం ఈజీ. అనుమానం ఉన్నవాళ్ల పోన్ ల మీద నిఘా కూడా పెట్ట వచ్చు. అందువల్ల వాట్స్ ప్ కాలింగ్ ఫెసిలిటీ దేవుడిలాగా నల్ల మహారాజులకు ఉపయోగపడుతూ ఉందట.
నిన్నటి "ష్.గప్ చుప్ గా చదవండి" వ్యాసంలో ఆలయహుండీల సొమ్ము,రోజువారి డినామినేషన్ల గురించి శ్వేతపత్రం విడుదల చెయ్యమన్న కొద్ది గంటలకే ప్రముఖ నటుడి భార్య 10 లక్షల పాతనోట్లతో తిరుపతి విమానాశ్రయంలో పట్టుబడటం కాకతాళీయమా?అసలు హైదరాబాద్ విమానాశ్రయ సిబ్బంది అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? బంగారం గురించి ఊరూవాడా స్త్రీల మొహాల మీద గొట్టాలు పెట్టిన మీడియా ఈ విషయంలో ఎందుకు నిర్లిప్తంగా ఉండిపోయారో!
ఏడొకొండల వాడికి డబ్బు నల్లదా తెల్లదా అనే వివక్ష లేదు.ఆయన హుండీ అన్నింటిని సమానంగా చూస్తుంది. అలాగే ఇపుడుగుంటూరు జిల్లాలోని కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు కూడా నోట్ల మార్పిడి కేంద్రాలయ్యాయి.
ఇపుడే అందిన వార్త
నల్లమహారాజులకు పేదరైతులిపుడు అప్తమిత్రులయిపోయారు. చాలా కాలంగా పంటలు లేక, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఉపయోగపడక, బ్యాంకు లోన్లు పేరుకుపోయినవాళ్లను పట్టుకుని ముందు లోన్ చెల్లించి రావయ్యా అని రైతులను బ్యాంకులకు తోలుతున్నారట. ‘ బ్యాంకు లోన్ కట్టేందుకు ఈ లోన్ తీసుకో. ఇదిఇంటరెస్టు ఫ్రీ లోన్ లే. ఎపుడో ఏడాదికో రెండేళ్లకో పంట చేతికొచ్చినపుడు తీరుస్తువులే అని బతిమాలి బక్కు రైతులకు నల్ల డబ్బులిస్తున్నార‘ ని తెలిసింది.