'చావు’తో నిజాలూ  వెలుగు చూడాలి

The unforgettable side of Amma


జయలలితపై ఆధారపడిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి.....కమల్ హసన్ ఇలా ట్వీటాడో లేదో జనం విరుచుకుపడ్డారు.పాపం ఆ ట్వీట్ తీసేయాల్సి వచ్చింది.

***

విలక్షణ నటుడు కమల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలనటుడుగా సినీ పరిశ్రమలోకి వచ్చి టీనేజ్ లో నృత్యదర్శకుల దగ్గర సహాయకుడిగా..ఆ తర్వాత ఎన్నో విలక్షణపాత్రలు ధరించడమే కాకుండా సినిమాలూ నిర్మించాడు.

 

తాను హీరోగా వచ్చిన కొత్తాల్లో అమావాస్య చంద్రుడు,బాండ్ మూవీ విక్రమ్,క్షత్రియపుత్రుడు,విచిత్రసోదరులు,ద్రోహి,భామనే సత్యభామనే,హే రామ్,విశ్వరూపం,ఉత్తమవిలన్ లాంటి అభిరుచిగల చిత్రాలు నిర్మించాడు.


తన వ్యక్తిగతజీవితసంబంధాలు ఎలాంటివైనా ఆయనకు సినీపరిశ్రమతో ఉన్న అనుబంధం,అంకితభావాం,నిబద్దతను ఎవరైనా హర్షించాల్సిందే.
ఇంతకూ జయలలిత తో గొడవెందుకు?

 


తాను నిర్మించిన విశ్వరూపం సినిమాను ముందుగా డి.టి.ఎచ్ లో విడుదల చేస్తానన్నాడు.సినిమాహాల్ యజమానులు అభ్యంతరం చెప్పారు.మొత్తం జనాభాలో డి.టి.ఎచ్ ఉన్నది 3% జనాభాకు,నా సినిమా సినిమాహాల్లలో ప్రదర్శించే దానికి కొన్ని గంటల ముందే కదా రిలీజ్ చేసేది?అందులో ఆ ప్రసారానికి 1000 రూపాయలు కట్టి చూసేదెందరు?అన్నాడు.సరే మొత్తానికి ఒక రాజీ ఫార్ములాకు వచ్చి సినిమా తమిళ్,తెలుగుల్లో విడుదల చేసిన వారానికి డి.టి.ఎచ్ లో వచ్చే అంగీకారం కుదిరింది.

 

ఈలోగా కొన్ని మత సంస్థలు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ గొడవ మొదలు పెట్టారు.ఆ మతపెద్దలకూ సినిమా చూపించాడు.వారు అందులో అభ్యంతరకరమైన విషయం ఏమీ లేదన్నారు.


అయినా శాతిభద్రతల సాకు చూపి జయలలిత ఆ సినిమాను విడుదల చెయ్యొడ్డు,మేము సెక్యూరిటీ ఇవ్వలేమంటూ చెప్పుకొచ్చింది.
దీని వేనక అసలు కారణం ముందు జయ కు చెందిన జయ టెవ్వె ప్రసార హక్కులు ఆశించారు.ఆ తరవాత విజయ్ టీవీ వాళ్లు కొనేసారు.
ఇదేకాదు అమ్మ ఆగ్రహానికి మరో పెద్ద కారణం ఉంది...అంతకుముందు జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో కరుణానిధి,చిదంబరం పాల్గొన్నారు.ఆ సభలో కమల్ ఏ రోజైనా పంచకట్టు వ్యక్తులు దేశాన్ని నడిపించాలన్నాడు......అంతే అమ్మగారికి ఎక్కడో కాలిపోయింది.


సినిమా లాభనష్టాలతో సంబంధంలేకుండా సంపాదనంతా సినిమాల మీద పెట్టే కమల్ మీడియా ముందు కన్నీటిపర్యంతం అయ్యాడు.....సరే ఆ తర్వాత అమ్మ కటాక్షించి సినిమా విడుదలైంది.

***

అసలు జయ అమ్మ కు కమల్ ఒక్కరితోనేనా గొడవలు?


1991 లో రాజీవ్ గాంధి హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో జయకు అఖండ విజయం దక్కింది.ఇంకేం చెలరేగిపోయింది...కలర్ టీవీ కుంభకోణం, తమిళనాడు స్మాల్ ఇండస్ట్సీస్ కార్పొరేషన్ భూముల కుంభకోణం 2001లో ఈ కుంభకోణంలో శిక్షపడినందున ఎన్నికల్లో నిలబడని జయ,ముఖ్యమంత్రి అయినా కోర్ట్ అభిశంసవల్ల రాజీనామా చేసి పన్నీర్ సెల్వం ను 6 నెలలలు ముఖ్యమంత్రిపీఠంపై కూర్చోబెట్టారు,అంతులేని సంపదను అసహ్యకరంగా ప్రదర్శించిన పెంపుడుకొడుకు సుధాకరన్ వివాహంలాంటివి జయ ప్రాభవాన్ని తగ్గించాయి. 

 

1991-96 ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో రజనీకాంత్ తో గొడవ ఉండేది.ఇద్దరూ ఉండేది పోయస్ గార్డెన్స్ లో.రజనీ ని చూడ్డానికి వచ్చే వారి వల్ల సెక్యూరిటీ సమస్యలొస్తున్నాయని రాకుండా ఆంక్షలు విధించారు.రజనీ చాలా ఇబ్బందులు పడ్డాడు.

 

ఈలోగా 1996 ఎన్నికలొచ్చాయి.తమిళనాడు లోని కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని పీ.వీ డి.యం.కే తో జతకడతారనుకున్నా జయతో కలిసే ఎన్నికలకు పోవాలనే నిర్ణయం తీసుకున్నాడు.ఈ నిరణయాన్ని విబేధించిన మూపనార్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి తమిళ మానిల కాంగ్రెస్ స్థాపించి,కరుణానిధితో పొత్తు పెట్టుకున్నారు.అప్పుడు విదేశీ యాత్రలో ఉన్న రజనీకాంత్ వచ్చి టీవీల్లో "మీరు అన్నా డీ.య.కె కు ఓటేస్తే దేవుడు కూడా కాపాడలేడ"ని ప్రచారం చేసాడు.ఈ ఎన్నికల్లో అన్నా డీ.యం.కే చీతుగా ఓడటమే కాదు స్వయాన జయలలిత 8000 పైచిలుకు మార్జింతో ఓడిపోయింది.

 

***

 

వీళ్లిద్దరే కాదు 2011 ఎన్నికల్లో మిత్రపక్షం నాయకుడు విజయకాంత్,హాస్యనటుడు వడివేలు ల మధ్య గొడవలై కోర్టుల దాకా చేరారు.మొత్తానికి ప్రేమికుడు సినిమా నుంచి చంద్రముఖి దాకా ఒక వెలుగు వెలిగిన వడివేలు కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది.

 

మొత్తానికి అమ్మ కరుణ లేకుంటే ఎవరైనా మాడి మసవ్వాల్సిందే.
అసలు అమ్మకు కోపాతాపాలు,కక్ష,కంటికి కన్ను పంటికి పన్ను ప్రతీకారం...ఇంత అహానికి కారణమేమో తెలుసుకోవాలంటే గతంలోకి చూడాలేమో!

(ఇంకా ఉంది)