Asianet News TeluguAsianet News Telugu

తెలుగు భాషకు అంత ముప్పు వచ్చిందా...

Telugu promotion movement is misguided campaign

 

 

విద్య, నేర్చుకోవలసిన భాషల గురించి ఒక విధానం ఇంతమటుకు లేదు.ఒక్కొక్క రాష్ట్రం వాళ్లు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు.

 

కొందరు కేవలం మాతృభాషలో చదివి తెలుగు పండితు లు కావాలని సిద్దాంతీకరిస్తున్నారు.

 

హిందీ కొంతమందికి రాజభాష . అది రాకపోతే పార్లమెంటు లో fail అవుతామని అది నేర్చుకుంటున్నారు. అందులో పుస్తకాలు రాసి అకాడమీ బహుమతులు కూడా పొందుతున్నారు. పీవీనరసింహారావుగారు అన్ని భాషలు ఇంగ్లీషు, హిందీ తోసహా, రావటం వలన ప్రధాన మంత్రిగా జేజేలందుకున్నారు.

 

భారత స్వాతంత్ర్య సమరంలో పోరాడిన మహానుభావులు ఇంగ్లీషు పండితులయి ఇంగ్లీష్ వాళ్ళ కే ఇంగ్లీషు నేర్పిన వాళ్ళున్నారు. రవీంద్రనాథ్ టాగోర్ భారతీయకవి తత్త్వవేత్త. ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇంగ్లీషు గీతాంజలికి. బెంగాలీ గీతాంజలికి కాదు.

 

గాంధీగారు Englishman,s English మాట్లాడేవాడట.మిగతావాళ్లందరూ Indian English మాట్లాడే వారట.గాంధీగారికంటే జాతీయవాదులమా మనము.? తెలుగుమాత్రమే నేర్చుకున్న పండితుడిని United Nations ప్రతినిధిగా పంపిస్తే ఎట్లాఉంటుందో మనం ఊహించలేము .

 

మనకి అంతర్జాతీయ సాంకేతిక అభివృద్ధి కావాలి. అంతర్జాతీయ భాష వద్దు అంటే ఎట్లా కుదురుతుంది.దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఇంగ్లీషు చాలాబాగా మాట్లాడే వారని .నాస్వానుభవం. "స్వస్థాన వేషభాషాభిమతాః సంతః బహుమన్యంతే వైకృత కావ్యానిచ అన్యదపహాయ.".అని అన్న నన్నయ్యే ఆంధ్రశబ్దచింతామణిని సంస్కృతం లో వ్రాశాడు. ఒక్కొక్కతరం లో ఒక్కొక్క భాష ఆధిక్యంలో ఉంటుంది. Commonsense ఏం చెబుతిన్నదంటే.
 

ప్రపంచాన్ని ఇంగ్లీషు ఏలుతున్నది.కనుక ఇంగ్లీషుని విస్మరించ గూడదు.పొట్టగడవటానికి ఇంజనీరింగు కి మెడిసన్  కి ఇంగ్లీషు తప్పదు.

 

 

తెలుగు భాషకు ఇంగ్లీష్ నుంచి ముప్పు ముంచుకొస్తున్నందని కొంతమంది పండితులు ఈ మధ్య తెలుగు వాదం తీసుకువచ్చారు. రాష్ట్రంలో తెలుగు తప్పమరొకభాష వినిపించకుండా ఉండేందుకు రకరకాల ప్రతిపాదనలు చేస్తున్నారు.  ఇంగ్లీష్ మీడియమ్ ను వ్యతిరేకిస్తున్నారు. తెలుగు మీడియం తప్పని సరి అంటున్నారు. ఈ ప్రచారానికి  స్పందిస్తూ ప్రముఖ నాటక రచయిత ఎసిపి శాస్త్రి గారి స్పందన ఇది. పాఠకులూ తమ అభిప్రాయాలు పంపవచ్చు.

 

అయితే తెలుగుని నిర్లక్ష్యం చేయటం ద్రోహం. మాకు S.S.L.C లో తెలుగేకాక Special తెలుగు ఉండేది.Graduation లో 2 year వరకు తెలుగు ఉండేది. కానీ ఉద్యోగం Competetive Exams ఇంగ్లీషులో నే వ్రాశాము..ఉద్యోగం ఇంగ్లీషులో నే చేశాము.

 

రాజకీయ నాయకుల ప్రసంగాలు విని ఓట్లేసే ప్రజలకు తెలుగు రాదని ఎందుకనుకోవాలి. తెలుగు వాడికి తెలుగు రాదనికోవటం తప్పు కాదా ..ఇంకాఏ తెలుగురావాలి తెలుగువాడికి?

 

తెలుగు మాత్రమే మాట్లాడాలీ చదవాలీ అని చెప్పేవారు ఎంతమంది తెలుగు పంచకావ్యాలు చదివారు .
ఎవరికోసం ఈ ఉద్యమం  !

 

గవర్నమెంటు కు ప్రజలకు ఉద్యోగం వచ్చే చదువును గూర్చి ఒక విధానం నిర్ణయించే బాధ్యత ఉంది.అందుకని వాళ్ళకు ఇంగ్లీషు ని కూడా ప్రోత్సహిస్తే అందులో తప్పేమీ లేదు.మన ఆదర్శం కోసం ఇతరుల ఉద్యోగావకాశాలను త్యాగం చేయమనటం న్యాయ్యం కాదు.

 

లోక జ్ఞానం ఏం చెబుతున్నదంటే ప్రపంచం లో ఇప్పుడు ఇంగ్లీషు రాజ్యం చేస్తున్నది.ఈ ప్రవాహానికి రాయల్లే కదలకుండా అడ్డుపడి ఆత్మ నాశనం చేసుకోవటమా లేక చెట్టల్లే వంగి ప్రవాహబలం తగ్గగానే మళ్లీ లేచి నిలబడటమా  ...ఎవడికి వాడే తేల్చుకోవాలి.


తల్లీ తండ్రీ ఇద్దరూ కావాలి ఒకళ్లకోసం ఇంకొకళ్ల ను త్యాగం చేయలేం కదా.

 

 

*రచయిత విశ్రాంత రిజర్వు బ్యాంకు అధికారి. పలునాటకాలు రాశారు. నటించారు. ఆయన నాటకాలనెన్నింటినో పలు రేడియో కేంద్రాలు ప్రసారం చేశాయి.