కేసిఆర్ సర్కారే తెలంగాణ ఇజ్జత్ తీసింది

కేసిఆర్ సర్కారే తెలంగాణ ఇజ్జత్ తీసింది

తమ ఘన కార్యం తో ఓయూ లో జరగాల్సిన ప్రతిష్టాత్మక ఇండియన్ సైన్సు కాంగ్రెస్ మణిపూర్ కి తరలేలా చేసిన ప్రభుత్వానికి అభినందనలు. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకోవడం అంటే ఏందో టిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ పెద్దలను చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు కేసీఆర్, జెఎసి  ఒక పిలుపు ఇస్తే ఓయూ వెన్నంటి ఉండేది. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా పరిస్థితి తయారయ్యింది పెద్దలే ఆలోచించుకోవాలి.

2014 లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ ఓయూ లో హెలికాప్టర్ కూడా ఎందుకు దిగనివ్వలేదు.?? మొన్నటికి మొన్న ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో కనీసం మాట కూడా మాట్లాడలేనంత పరిస్థితి ఎందుకు వచ్చింది. ?? నేడు ఓయూ కి వెళ్లి మొహం చూపెట్టుకోలేక ఏకంగా ఓయూ యంత్రాంగం తో సదస్సు నిర్వహించలేము అని ఎందుకు చెప్పించవలసి వచ్చింది. ??

ఎందుకంటే తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన యువత ఉమ్మడి రాష్ట్రంలో కన్నా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తాము కోట్లాడి కోరి గద్దెనెక్కిచిన ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది అనే కోపం, నిస్పృహల్లో ఉన్నారు. అదిగో ఇదిగో అని తీపి కబుర్లు విని అనందిచడమే తప్ప మొత్తం ఎన్ని ఉద్యోగాలు భర్తీ అయ్యాయి అని అడిగితే సమాధానం శూన్యం. పైగా ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే కాదు అని , అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామా అని సన్నాయి నొక్కులు. ఇవన్నీ యువతలో తీవ్ర అసహనం ను, అసంతృప్తి ని రాజేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఓయూ ఎప్పుడు ముందే ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా సైన్సు కాంగ్రెస్ వేదిక గా ఏమన్నా చేస్తారు అనే భయం తో చేతులు ఎత్తేశారు అంతే.

ఇవాంకా పర్యటన, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తో ఏమి సాదించారో తెలియదు కాని సైన్స్ కాంగ్రెస్ సదస్సు తరలింపు వల్ల దేశంలో తెలంగాణ పాలకుల ఇజ్జత్ మొత్తం పోయింది. వాటి విషయం లో చూపిన శ్రద్ధలో 5 శాతం దీనిపై పెట్టిన అద్భుతంగా సమావేశాలు జరుగుతుండే. అసలు తెలుగు మహా సభలతో ఏం సాధించారు అని అడగకండి. నాడు తెలంగాణ ని నరనరాన వ్యతిరేకించిన వాళ్ళు వచ్చి వాళ్ళ స్వప్రయోజనాల కోసం అహ ఓహో అని పొగడడం తప్ప 100 కోట్లు ఖర్చుపెట్టి ఎం సాధించారు.

ఇక్కడ సైన్సు కాంగ్రెస్ సభలు జరిగి ఉంటే ఓయూకి , విద్యార్థులకు చాలా లాభము అయితుండే. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి విజేతలు వస్తే ఎంత ప్రయోజనం ఉంటుండే. ఈ సమావేశం తరలింపు వల్ల దేశ వ్యాప్తంగా ఓయూ, తెలంగాణ పరువు పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఓయూ లో పరిస్థితి అలా తయారయ్యిందో వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేస్తే తప్ప మీకు వచ్చే ఎన్నికల్లో బొప్పి కొట్టడం ఖాయం.

 

రచయిత...

రవళి కూచన, వరంగల్ కాంగ్రెస్ నాయకురాలు

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos