Asianet News TeluguAsianet News Telugu

అలా ఎందుకు జరగదంటే...

Russian crisis may not appear in India

రెండో భాగం

 

 రెండు రోజుల కిందట రష్యా లో జరిగినట్లుగా ఇండియా లో జరిగే ప్రమాదం ఉందా అని చర్చించుకున్నాం కదా. ఇప్పుడు అలా ఎందుకు జరగదో చూద్దాం

 

ఒకటి మన దగ్గర రష్యా లాగా అస్థిరత లేదు. డబ్బులు విత్ డ్రా చేసుకోవడం మీద లిమిట్స్ ఉన్నాయి తప్ప ఖర్చు పెట్టడం మీద ఏ విధమైన ఆంక్షలు లేవు. డెబిట్ , క్రెడిట్ కార్డ్ లు, డిజిటల్ వాలెట్ లు రూపం లో ఖర్చు పెట్టడానికి అవకాశాలు బానే ఉన్నాయి. రష్యా లో మనకి ఉన్నట్టు ప్లాస్టిక్ మనీ ఉండేది కాదు.

 

తర్వాత మనకి యాభై రోజులు గడువు ఇచ్చారు. సామాన్య ప్రజలు అందరూ బాంక్ లో వేసుకుంటారు. వేసుకోలేని కుబేరుల డబ్బులు మురిగిపోతాయి. రెండు మూడు సంవత్సరాలకు సరిపడా మన దగ్గర తిండి నిల్వలు ఉన్నాయి. కాబట్టి ధరలు భరించలేని స్థాయికి వెళ్ళకపోవచ్చు.

 

కాక పోతే ఒక ప్రాబ్లం ఉంది. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు అందరూ చాలా రోజులు ఉంది కదా, నంద రాజో భవిష్యతి, ఏమో గుర్రం ఎగరవచ్చు అని తడి గుడ్డ వేసుకుని పడుకుని ఉన్నారు. డిసెంబర్ మూడో వారం వచ్చేసరికి పానిక్ మొదలు అవుతుంది. ఇక ఏమి చెయ్యాలి ఈ డబ్బు ని అని. డాలర్ ల లో మార్చడానికి ప్రయత్నాలు మొదలు అవుతాయి.

 

అది డాలర్ లకి ఊహించని డిమాండ్ తెప్పించి డాలర్ తో రూపాయి బలహీనపడేలా చేస్తుంది. దాని వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం కనుక డాలర్ ఎంత పెరిగినా పెట్రోల్, డీజిల్ కుషన్ కనుక ఇస్తే ఇక ఇబ్బంది ఉండదు. ఐటి కంపెనీలకి విండ్ ఫాల్ లాభాలు వస్తాయి. ఫారిన్ లో ఉంటున్న వాళ్ళు ఉన్న డబ్బు ఇండియా కి రేమిట్ చేసేస్తారు. ఆ డాలర్ లు రిజర్వ్ బాంక్ దగ్గరకి వచ్చేస్తాయి. కాని ఇక్కడ విత్ డ్రా లిమిట్స్ మాత్రం అనేక రోజులు ఉంటాయి.

 

తరువాత జన ధన ఖాతా ల విత్ డ్రా లిమిట్ నాలుగేళ్ల వరకూ పెంచే అవకాశం ఉంది అని చదివా.

 

కొంచెం ధరల పెయిన్ తాత్కాలికంగా ఉంటుంది. అది భరిస్తే చాలు.

 

ప్రభుత్వం వెంటనే నగరాల నుంచి ఎటిఎం మెషిన్ లని గ్రామాలకి పంపడం మంచిది. లేకుంటే ప్లాస్టిక్ మనీ, బాంక్ లేని గ్రామాలకి కష్టం అవుతుంది. ప్రజలు ఏదో యాభై రోజులు పర్వాలేదు కాని, నెలలు నెలలు కుదరదు కదా