తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ కొత్త ట్రెండ్ సెట్టర్
తెలంగాణలో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ కు పోయిన వారు ఉన్నారు.. టీడీపీ నుండి టిఆర్ఎస్ కు పోయిన వారు ఉన్నారు.. కమ్యూనిస్ట్ పార్టీ ( సిపిఐ) నుండి తెరాస కి పోయిన వారు ఉన్నారు.. బిఎస్పీ నుండి టిఆర్ఎస్ కు పోయిన వారు ఉన్నారు.. అలాగే రేవంత్ మాత్రం టీడీపీ నుండి టిఆర్ఎస్ కు కాకుండా కాంగ్రెస్ పార్టీ కి పోవడం అనూహ్య నిర్ణయంగా చెప్పవచ్చు. అంతే తేడా ఎవ్వరి సక్కదనము మాత్రం ఏమి అంత మంచిగా ఉంది అని అయనను అనడానికి... ఇదే టీడీపీ ఆంధ్రాలో వైసిపి వారిని తన పార్టీ లోకి మార్చుకున్నపుడు ఎట్టు పోయింది నైతికత ! తెలంగాణలో చాల మంది వివిద పార్టీ ల నుండి తెరాస లోకి వెళ్ళినారు .. ఓట్లు వేసిన. జనాలు ఏమైనా పిచ్చి వారా!
ఇప్పుడు అసలు విషయము చూద్దాము గ్రామాలూ దేశానికి పట్టుకొమ్మలు అంటారు కదా మరి అటువంటి గ్రామాల కోసం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఉంటె ...గొర్రెల మంద కింద కట్ట కట్టుకొని తెరాస లోకి వెళితే జనాలను పిచ్చివాళ్లను చేయడము కాదా ! మరి మీరు చేసిన పని ఇది. దీనికి ప్రజలకు మీరు ఏమి సమాధానము చెప్తారు ...!! ఇంత మంది పార్టీ మారినారు మంచిదే కానీ మరి ఇంతవరకు తిరిగి ఎలక్షన్స్ ఎoదుకు పెట్టలేదు ...! ఈ ప్రశ్నకు ఎవరైనా జవాబు చెప్పగలరా? ప్రజాసౌమ్యము ను ఏమి చేద్దాము అని అనుకుంటున్నారు? ఒక స్పీకర్ పదవీ కి న్యాయము చేయని ఒక మనిషి.... ఆ స్థానం లో ఉంటూ పార్టీ మారిన అభ్యర్థుల ఫై ఇంత వరకు చర్యలు తీసుకోకపోవువడము ప్రజాసౌమ్యాన్ని అపహాస్యము చేసిన్నటు కాదా మరి !
అసలు ట్విస్టు ఏంటి అంటే అందరు అధికారము కోసం పార్టీ మారితే ...అదే రేవంత్ విషయంలో కొంచెం ఉల్టా జరిగింది... అధికారము కోసం ....అధికార పక్షం లోకి పోకుండా ప్రతిపక్షం లోకి వెళ్ళిండు... బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాసౌమ్యము ఉంటుంది అనే ప్రాథమిక సూత్రం ను పాటించిన రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కారణాలేమైనా రేవంత్ రెడ్డిని ఎవ్వరైనా అభినoదించాల్సిందే. ఇప్పుడే కాదు గతంలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా గెలిచిన నాడు కూడా రేవంత్ రెడ్డి ఇట్లనే అధికార పక్షంలోకి పోకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపిలకు పోయిండు. మీరు మీరు పార్టీ లు మారితే అప్పుడు ఎన్నికలు ఎందుకు , దానికి మేము ఓటు వేయడము ఎందుకు ! అదే జరిగితే మనకు ఎందుకు ఈ రాజ్యాంగం ? మనందరం ఆలోచన చేయాల్సిన సమయమిది.
రచయిత - సామ్రాట్ చంద్రశేఖర్
సోషల్ వర్కర్, మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా.