మహానటుడు రావు గోపాల్ రావు భార్య గురించి తెలుసా?

Rao Gopalraos wife kamalakuri was equally gifted artiste

 

Rao Gopalraos wife kamalakuri was equally gifted artiste

(మహానటుడు  రావు గోపాల్ రావు  గురించి మనకు బాగా తెలుసు. అయితే, ఆయన భార్య కుమలకుమారి కూడా అంతే ప్రతిభావంతురాలు. ఆమె గురించి చాలా మందికి తెలియదు. ఆమెను పరిచయం చేసేందుకు ఒక చిన్న ప్రయత్నం.)

 

శ్రీమతి రావు కమలకుమారి హరికథ కళాకారిణి, ప్రముఖ రంగస్థల మరియు సినీనటులైన రావు గోపాలరావు సతీమణి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో 5వేలకుపైగా హరికథలు చెప్పారు.

జననం
కమలకుమారి 1944, ఏప్రిల్ 21న మండా సూర్యనారాయణ, రాజరాజేశ్వరి దంపతులకు విజయనగరం లో జన్మించారు. సూర్యనారయణ స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా భాగ్ రథీ పురం. కమలకుమారి తాత కలవరాయుని లక్ష్మీనారాయణ శాస్త్రీ విజయనగర సంస్థాన విద్వాంసులు.

కళారంగం
కమలకుమారి తండ్రి సూర్యనానాయణ శాస్త్రి విజయనగరం సంగీత కళాశాలలో కర్నాటక సంగీతంలోనూ, పూనాలోని హిందూస్థానీ సంగీతంలోనూ డిప్లొమాలు పొందిన విద్వాంసులు. వీణ, గాత్రం, భరతనాట్యం, హరికథా కళలను అభ్యసించిన కమలకుమారి ఎనమిదేళ్ళ వయసులో తండ్రి హరికథ మధ్యలో భరతనాట్యం చేసేది.

స్వరజతి, వర్ణం, తిల్లాన, స్వరం, శబ్ధం, సాహిత్యం అభ్యసించింది. తన పాటలు తానే పాడుకుంటూ జానపద నృత్యాలు చేసేది. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, అన్నవరం, యాదగిరిగుట్ట మొదలైన పుణ్యక్షేత్రాల్లో హరికథా గానం చేసారు.

వివాహం - పిల్లలు
వీరిది ప్రేమ వివాహం. ప్రముఖ రంగస్థల, సినీనటులైన రావు గోపాలరావు తో 1966, జనవరి 16న కమలకుమారి వివాహం జరిగింది. పురాణ కథలను, పౌరాణిక కళలలను ద్వేషించే రావు గోపాలరావు... కాకినాడ లో కమలకుమారి హరికథకు వచ్చి అల్లరిచేయాలనుకున్నారు. ఆరు గంటలపాటు హరికథ విని, ముగ్ధలై కమలకుమారితో ప్రేమలో పడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు రావు రమేష్ సినీనటుడు. రెండో కుమారుడు క్రాంతికుమార్ అమెరికాలో ఇంజనీర్, కుమార్తె సీతాదేవి.

బిరుదులు
సకల కళా విశారద - ప్రవాసాంధ్ర కళాసమితి, టాటా నగరం, మద్రాస్
నాట్యకుమారి, హరికథా శిరోమణి, కోకిల వాణి - కాకినాడ
మధుర గాన సుహాసిని - కలకత్తా
సకల జన రంజన హరికథా కళా ప్రపూర్ణ - ఖరగ్‌పూర్
అభినవ సరస్వతి - బెంగళూరు
శారదావతరిణి - విజయనగరం
ఆదర్శ హరి కథా సుధామతి - గుంటూరు

 

(రచయిత ‘ఎన్షియంట్ వైజాగ్ పట్నం’ నుంచి)