‘బంగారు తెలంగాణ’ బాధితుల గోడు

post Telangana poetry is striking roots in the new born state

దళితుడు మొదటి ముఖ్యమంత్రి అంటే"నమ్మినం"
ఉపముఖ్య మంత్రి ని చేస్తే "సర్దుకున్నాం"

ఓటు కి నోటు లో ఎవ్వరినీ వదలము అంటే "నమ్మినం"
ఎన్నికల వరకు కోర్టు పరిధి లొనే  కదా అని "సర్దుకున్నాం"

లక్ష నాగళ్లతో దున్నుతా అంటే "నమ్మినం"
సాక్షాలు ఏమి లేవు కదా అంటే "సర్దుకున్నాం"

అక్రమ కట్టడాలు కూల్చివేత అంటే "నమ్మినం"
అన్నమయ్య ,రామన్న మిత్రులే కదా అని "సర్దుకున్నాం"

ఆంధ్ర మీడియాని బొందపెడుతా అంటే "నమ్మినం"
బొంద ఎందుకు అని నాయిమ్ డైరీకి గోరి కడితే "సర్దుకున్నాం"

అవినితి జరిగితే కొడుకుని గూడ వదలను అంటే"నమ్మినం"
మియాపూర్ స్కామ్ లో బిడ్డ లేదు కదా అని "సర్దుకున్నాం"

తెలంగాణ తెచ్చుకుంది కడుక్క తాగటానికి కాదు అంటే "నమ్మినం"
విలాస భవనాలు, వాస్తు, యాగాలు విశ్వనగరం కొరకే అని "సర్దుకున్నాం"

రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడది అంటే "నమ్మినం"
మల్లన్న సాగర్ లో అందరూ రాజు లే అని "సర్దుకున్నాం"

కోదండ రామ్ సార్ ఎంత ముద్దుగున్నాడు అంటే "నమ్మినం"
రామోజీ కి ఉన్న విజన్ లేక కాళ్ళకు అడ్డుపడుతుండు అని "సర్దుకున్నాం"

ఉద్యమ పార్టీ, ఇంటి పార్టీ అంటే ఓట్లు వేసి"నమ్మినం"
ఫక్తు రాజకీయ పార్టీ అంటే బీటీ బ్యాచ్ తో "సర్దుకున్నాం"

రేపు ఏది చెప్పిన "నమ్ముతాము" "సర్దుకుపోతాము"
ఎందుకు అంటే ఎప్పటికి ఆయిన అందరం బంగారు తెలంగాణ "బాదితులమే"

 

(సోషల్  మీడియా నుంచి)

 

 

మరిన్ని తాజా వార్తల కోసం  ఇ క్క డ  క్లిక్ చేయండి