కోహ్లి కి పాకిస్తాన్ "ఫిదా"

కోహ్లి కి పాకిస్తాన్ "ఫిదా"

 

నాగ్ పూర్ టెస్ట్ మ్యాచ్ లో (26-11-2017) డబుల్ చెంచురీ చేసిన  కోహ్లి పై పాకిస్తాన్ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది!

మ్యాచ్ తర్వాత పాక్ మీడియా చర్చా వేదికల్లో కోహ్లి నే సెంటర్ పాయింట్ గా చర్చలు సాగుతున్నాయ్! ఇది కొన్ని వర్గాల్లో కొంత అసంతృప్తిని కూడా కలిగిస్తోందని సమా చారం. కొంతమంది క్రికెటర్లు భిన్నంగా స్పందిస్తున్నారు..

 

పాకిస్తాన్ లో ఒక టీ.వీ చానెల్ లో క్రికెట్ గురించి చర్చా వేదికలో పాల్గొన్న ఓ క్రికెటర్ విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలు ఇతరా నైపుణ్యాలను విమర్శించగా మధ్యలో యాంకర్ అతన్ని ఆపి, "అసలు మీకు విరాట్ స్టాండర్డ్ తెలుసా?" అని ప్రశ్నించగా బిత్తర్ పోయిన అ క్రికెటర్ తన అభిప్రాయం అది కాదని సర్దుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ మీదా పాక్ మీడియా, క్రికెటర్ల ప్రశంసల పరంపరకు,  ఒక్క ఉదాహరణ మాత్రమే!

విరాట్ కోహ్లిని పాకిస్తాన్ క్రికెటర్లు అభి నందిచటం, లేదా అకాశానికి ఎత్తేయటం కొత్తేం కాదు. గతం లో పాక్ ప్రముఖ ఆటగాడు(బౌలర్) వసీం అక్రం కొంత ముందుకెళ్ళి కోహ్లి పాకిస్తాన్ కు వస్తే "ట్రాఫిక్ జాం" అవుతుందని చెప్పి అందర్ని

విస్మయపరిచాడు. మరో మీడియా చర్చలో యాంకర్ కోహ్లి, ఉమర్ అక్మల్ మధ్య పోలిక తెచ్చినప్పుడు..చర్చలో పాల్గొన్న ఒక క్రికెటర్ "ఇద్దరి మధ్య పోలికా!" అంటూ ఆశ్చర్య పోయాడు. పైగా అక్మల్ కు కోహ్లి కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నాడు. భారత క్రికెటర్లను పాక్ క్రికెటర్లు, ప్రేక్షకులు ప్రశంసిటం గతంలో చాలా సార్లు జరిగింది. అయితే ఈ మధ్య కోహ్లిని భారీ స్థాయిలో మెచ్చుకోవటం, ముఖ్యంగా మీడియా కోహ్లి పట్ల పాజిటివ్ గా స్పందించటం గమనార్హం.  

 

ఆ మధ్య ఒక పాకిస్తాని బ్లాగర్ కోహ్లిని యువ పాక్ ఆటగాడు బాబర్ ఆజం తో పోల్చడాన్ని తప్పుబట్టాడు. బాబర్ ను కోహ్లి లాంటి ఆటగాడితో పోల్చటం సరికాదన్నాడు. అలా పోల్చటం వల్ల బాబర్ పై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. బాబర్ కోహ్లిని చేరటానికి చాలా సమయం పడుతుందన్నాడు. ఇంకా పాక్ మాజి కెప్టెన్ యూసుఫ్ కోహ్లీని ఎవ్వరితో పోల్చటానికి సాధ్యం కాదన్నాడు. 2012-13 తర్వాత భారత్-పాక్ సీరిస్ జరగలేదు. అయినా కోహ్లి కి పాక్ మీడియా అభిమానిగా మారటం విశేషం! ఇక అక్కడ కోహ్లికి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు.

 

అయితే పాక్ క్రికెట్ అధికారులకి, మియాందాద్ లాంటి క్రికెటర్లకి  ఇది ఎంతమాత్రం రుచించటం లేదు.గత చాంపియన్స్  ట్రోఫి సందర్భంగా భారత ప్రేక్షకులను మెచ్చుకున్న ఆఫ్రీది (ఇతనికి భారత క్రికెటర్లు కొంతమందితో స్నేహ సంబధాలున్నాయ్) పై వీళ్ళు  తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆఫ్రీదీ పై కోర్ట్ లో కేసు కూడా వేశారు.తమాషా ఏమిటంటే 1983 లో భారత్ ప్రపంచ కప్ గెల్చినప్పుడు పాక్ క్రికెటర్లు చాలా మంది సంబరాలు చేసుకున్నరు. ముఖ్యంగా మియందాద్!

 

ఏది ఏమైనా కోహ్లీ కు పాక్ మీడియాలో, క్రికెటర్లలో అభిమానులు బాగ పెరిగారన్నది స్పష్టం.

 

(* సయ్యద్ సలీం బాష , స్పోర్ట్స్ జర్నలిస్టు ఫోన్)

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos