కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఆసక్తి కరమయిన చరిత్ర ఉంది.ఇక్కడ ఎపుడూ రెండు సామాజికవర్గాల మధ్యే పోటీ జరుగుతోంది. మొదటి నుండి రెడ్డికులస్థులొకవైపు, ముస్లిం మైనార్టీ వర్గీయులు మరొక వైపునిలబడేవారు ఈ వర్గాల వారే నంద్యాల ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. మరొక విశేషమేమిటంటే ఈ నియోజకవర్గం ఇంతవరకు ఎవరికీ హాట్రిక్ ఇవ్వలేదు. గెలుపు రెండుసార్లే స్వాతంత్య్రం అనంతరం 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యిర్థిగా పోటీ చేసిన మల్లు సుబ్బారెడ్డి నంద్యాల మొట్టమొదటి ఎమ్మెల్యే అయ్యారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 1955లో జి.రామిరెడ్డి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నంద్యాల నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. ఆయన మృతి చెందడంతో 1959లో నంద్యాలకు మొట్టమొదటి సారి ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికలో జివి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగాగెల్చారు. 1962లో మళ్లీ మల్లు సుబ్బారెడ్డి ఇండిపెండెంట్‌గా రెండోసారి గెలిచారు. 1967తో ఇక్కడ మైనారిటీ శకం మొదలయింది. అపుడు కాంగ్రెస్ అభ్యిర్థిగా ఎస్‌బి నబీసాహెబ్ గెల్చారు. 1972లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొజ్జా వెంకటరెడ్డి గెల్చారు.1978 ఆయనే జనతాపార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అయ్యారు.

 1983తో నంద్యాల కొత్త రాజకీయం మొదలయింది. ఆ ఏడాది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం రంగం మీదకు వచ్చింది. తెలుగుదేశం హవా ఇక్కడ సాగలేదు. కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి తెలుగుదేశం పార్టీపై గెలుపొందారు. అయితే, 1985లో టిడిపి ఈ నియోజకవర్గంలో పట్టు సాధించింది. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్‌బి నబీసాహెబ్ మేనల్లుడు ఎన్‌ఎండి ఫరూక్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. భారీ మెజార్టీతో గెలుపొందారు. దీనికి గుర్తింపుగా ఆయనకు ఎన్టీరామారావు మంత్రివర్గంలో చోటిచ్చారు. 1989లో ఈ సీటు ను టిడిపి నుంచి కాంగ్రెస్ లాగేసుకుంది. అపుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వి రామనాధరెడ్డి గెలిచారు. 1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎండి ఫరూక్ గెలిచాడు. ఈ సారి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎండి ఫరూక్ మళ్లీ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్పీవైరెడ్డిపై గెలుపొంది క్యాబినెట్‌లో స్థానం పొందారు. అంతే, ఫరూక్ మళ్లీ గెలువలేదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శిల్పా మోహన్‌రెడ్డి అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ తో గెలుపొందారు. రాష్ట్రంలో రెండవ అత్యధిక మెజార్టీ ఆయనదే. 2009 ఎన్నికల్లో రెండవసారి శిల్పామోహన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి గృహ నిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. శిల్పావి రెండుదఫాలయ్యాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో భూమానాగిరెడ్డి (వైకాపా) చేతిలో శిల్పా ఓడిపోయారు. తర్వాత భూమా మరణంతో ఇపుడు ఉప ఎన్నిక వచ్చింది.

 మొత్తం మీద నంద్యాల అసెంబ్లీకి 1952 నుండి జరిగిన ఎన్నికల్లో రెడ్డి, ముస్లిం సామాజిక వర్గాల వారే అభ్యర్థులుగా పోటీపడ్డారు. గెలిచారు. మరొక కులం ఇక్కడ నిలదొక్కుకోలేదు. నంద్యాల ఓటర్లెపుడు తీర్పు విలక్షణంగా ఇచ్చారు. నిజానికి టిడిపి మైనారిటీ క్యాండిడేట్ నిలబెట్టాలి. అయితే, భూమా నాగిరెడ్డి కావడం, రెడ్డు ఒకే వర్గంగా ఉండి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ల కుండా చూడటం, భూమా హఠన్మరణ సానుభూతేమయినా పనికొస్తుందేమో అనుకోవడంతోటిడిపి భూమా అనే పేరు కోసం బ్రహ్మానందరెడ్డిని నిలబెట్టింది.

నంద్యాల ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తారన్నది ప్రాచుర్యంలో ఉంది. ఏ అభ్యర్థినీ వరుసగా ఇంతవరకు మూడుసార్లు గెలిపించలేదు. అభివృద్ధిని కాంక్షిస్తున్న నంద్యాల ప్రజలు ఫ్యాక్షన్ మూలాలు ఉన్న అభ్యర్థులను ఏనాడు గెలిపించలేదు. ప్రతి ఎన్నికలో తమ విలక్షణమైన తీర్పుతో గెలుస్తాడనుకున్న అభ్యర్థిని అనూహ్యంగా ఓడించడం, ఓటమి అంచుల్లో నిలిచిన వారికి పట్టం కట్టిన ఘనచరిత్ర నంద్యాల ఓటర్లకు ఉంది. త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో నంద్యాల ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

మరిన్న తాజా వార్త కోసం క్లిక్ చేయండి

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్