గండికోట డ్రామా: పాత ప్రాజక్టుకు కొత్త ప్రారంభోత్సవం

Naidus  farce of relaunching of old Gandikota project

బహుముఖ ప్రజ్ఞాశాలి ఆరుద్ర గారి అంత్యప్రాసల అభిమానులు ఎందరో ఉన్నారు.ఎప్పుడూ గడ్డంతో ఉండే వారిని ఎవరో కొంటెప్రశ్న అడిగారు..మీ గడ్డం గురించి రామలక్ష్మిగారు ఏమీ అనరా అని..దానికాయన "మోజుపడ్డ ఇల్లాలికి అవుతుందా గడ్డం అడ్డం " అని సమాధానమిచ్చారట.

 

అది కర్నూలు-కడప మార్గంలో ఉండే మండలకేంద్రం.ఎప్పుడో ఒకరాజు తన పాణి(మణికట్టు వరకున్న చేయి)ని శివుడికి అర్పించాడని,ఎప్పుడో చాళుక్యశైలిలో కట్టిన చిన్న ఆలయం.ఆ శివుడిని పాణికేశ్వరుడు అంటారు.ఆయన పేరుమీదుగా ఊరికి పాణ్యం అన్న పేరొచ్చింది.ఇక ఇప్పటి ప్రత్యేకత ఇక్కడి నర్సరీలు...ఇంకా....ఈ మండలంలోనే శ్రీశైలం కుడికాలువ,గాలేరు-నగరి లకు గుండెకాయలాంటి గోరుకల్లు రిజర్వాయర్ ఉంది.

 

ముందుగా శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగులపైనుంటే పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణాజలాలు పారించుకోవాలి..ఇవి 16కి.మీ ప్రయాణించి బనకచర్ల దగ్గర తెలుగుగంగ,శ్రీశైలం కుడికాలువలుగా విడిపోతాయి...ఇక శ్రీశైలం కుడికాలువ ముందుగా గోరుకల్లు రిజర్వాయర్ చేరుతుంది.అక్కడి నుంచి ఆ కాలువ ఔకు రిజర్వాయర్ చేరుతుంది.

 

రాజశేఖర్ రెడ్డి హయాంలో కృష్ణా వరదజలాల మీదుగా గాలేరు-నగరి కోసం పోతిరెడ్డిపాడుకు కొత్త గేట్లు 44,000 క్యూసెక్కులు తీసుకునేట్లు నిర్మించాడు.ఇక అక్కడి నుంచి ఆనీళ్లు ముందు బనకచర్ల చేరడానికి పాత కాలువ సరిపోదు కాబట్టి కొత్త కాలువ తవ్వుతున్నారు,ఆ పని ఇప్పటికీ పూర్తికాలేదు...ఇక బనకచర్ల నుంచి గోరుకల్లు కూ కొత్తకాలువ పనులు పూర్తికాలేదు.సరే ఈ గోరుకల్లు రిజర్వాయర్ చూస్తే..నిర్మాణదశలో ఇక్కడి భూమిపొరలపై ఎన్నో అనుమానాలొచ్చాయి..ఎన్నో సర్వేలు చేసి నిర్మించారు...మొత్తంగా శ్రీశైలం కుడికాలువ,గాలేరు-నగరిల కోసం 12.5tmc నిలువ చేయొచ్చు..కానీ 1.78tmc లు ఈ ఏడు నింపగా లీకేజీలు మొదలై సమీపగ్రామంలో నీటి బుగ్గలు వస్తున్నాయి.

 

ఈ గోరుకల్లు నుంచి శ్రీశైలం కుడికాలువకు సమాంతరంగా కొత్తగా గాలేరు-నగరి కాలువ 20,000 క్యూసెక్కుల నీళ్లు తీసుకువెళ్ళి ఔకు చేరాలి...ఔకు రిజర్వాయర్ కు ముందు టన్నెల్ నుంచి పోవాలి...ఆ టన్నెల్ పనులు కాదుగదా ఈ గోరుకల్లు రిజర్వాయర్ కు కూతవేటు దూరంలో ఉన్న పాణ్యం దగ్గర కూడా కాలువ పనులు పూర్తికాలేదు.

Naidus  farce of relaunching of old Gandikota project

గాలేరు-నగరి కాలువ ఔకు నుంచి మొదలై కడపజిల్లా గండికోట చేరుతుంది...ఆ జిల్లాలో కొన్ని రిజర్వాయర్లు నింపి చిత్తూరు జిల్లా చేరాలి...

 

ఇక్కడ మన ప్రయాణం గండికోట...రేపు ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్న పైడిపాలెం వరకు మాత్రమే....

 

గండికోట సామర్ధ్యం ముందుగా 16 tmcలు ఉంటే YSR దాన్ని 26.85tmc లకు పెంచారు...ఇక్కడి నుంచి దిగువకు నీళ్లు చిత్తూరు జిల్లా వైపువెళితే...రిజర్వాయర్ నుంచి 5,6 చోట్ల చిన్న లిఫ్టులు పెట్టి నీటిని పులివెందుల నియోజకవరగంలోని పైడిపాలెం,చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు చేర్చాలి...

 

పైడిపాలెం---కొండాకోనల మధ్య ఉండే ఈ ఊరిలో ఒక చిన్న చెరువుండేది.దీన్ని 6tmcలకు పెంచారు..ఇక్కడి నుంచి నీళ్లను ఇదివరకే ఉన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు పంపించి అనేక గ్రామాలకు,పులివెందులకు మంచినీటిని సరఫరా చేయాలని,మిగిలిన నీళ్లను..మహా అయితే 25,000 ఎకరాలకు సాగునీరు అందివ్వాలనే ఉడ్డేశంతో నిర్మించారు.

 

ఇక ఈ పులివెందుల బ్రాంచ్ కెనాల్ అన్నది చిత్రావతి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ నుంచి మొదలవుతుంది.

 

చిత్రావతి రిజర్వాయర్...తుంగభద్ర హై లెవెల్ కెనాల్(TBhlc) నుంచి నీళ్లు ఇక్కడికి చేరుతాయి...1973 నాటికే తయారైంది ఇది..కానీ కర్నాటక లో ఆ డామ్ దగ్గర పూడికో,అక్కడి కాలువలవెంట జలచౌర్యమో,శిధిలావస్థకు చేరిన కాలువల వల్లో..మొత్తానికి 3,4 ఏళ్లకొకసారి ఈ కాలువ కింద పంటలు పండుతాయి..దీని సామర్ధ్యం 4.4tmc..ఆ చుట్టుపక్కల కురిసిన వర్షాధారం 2 tmc....ఇక YSR హయాంలో ఆయకట్టు స్థిరీకరించి రైతులకు నీళ్లివ్వాలని దీని సామర్ధ్యాన్ని 10 tmc లకు పెంచారు..నిర్మాణం 2009 నాటికే పూర్తయింది...

ఈ వివరం మీరు ప్రభుత్వ వెబ్‌సైట్ irrigation.cgg.gov.in లో చూడవచ్చు...

 

Naidus  farce of relaunching of old Gandikota project

ప్రస్తుతం మేము తొలిసారిగా గండికోటకు నీళ్లిచ్చామని డంకా బజాయిస్తున్నారు నాయకులు...నిజానికి 2013 లోనే ఇచ్చారు..ప్రస్తుత ప్రభుత్వం గండికోట నిర్వాసితులకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చింది....

 

అసలు పూర్తేకానీ గాలేరు-నగరి కాలువలు,ఔకు టన్నెల్ ఉన్నాయి...(గండికోట టన్నెల్ ను శరవేగంతో పూర్తిచేసిన విషయం మరవొద్దు)...ఇక దొడ్డిదారిలో అంటే శ్రీశైలం కుడి కాలువ ద్వారా నీళ్లు ఔకు చేర్చి..ఇదివరకే అక్కడ పనులు పూర్తైన కాలువల ద్వారా గండికోట చేరుస్తున్నారు...

 

ప్రస్తుతం గండికోటలో 4 tmc నీళ్లున్నాయి...వాటిలో ఎన్ని నీళ్లు పైడిపాలెంకు ఎత్తిపోయబోతున్నారో?

 

ఇక పైడిపాలెం అంచనా విలువ 712.31 కోట్లు కాగా ప్రభుత్వ వెబ్‌సైట్ లో 31/05/2014 నాటికి 644.65 కోట్లుగా ఉంది...అంటే ఎప్పుడో పూర్తైంది..కాకుంటే నీళ్లు లేక,ఇలా దొడ్డిదారి తెలియక వినియోగంలోకి తీసుకురాలేకపోయారు..ఇక మిగిలిన డబ్బేమైంది?ఇంకా సుమారు 67 కోట్ల దాకా అంటారా?అవును అది కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ప్రభుత్వం కొంత శాతాన్ని operation and maintenance కింద ఉంచుకుంది..కాంట్రాక్టర్లు 15ఏళ్లపాటూ నిర్వహించాలి..ఆ ఉన్నమొత్తాన్ని విడతలవారీగా చెల్లిస్తారు...ఈ వివరాలు ఈ ఫోటోలో GKLI system పద్దుకింద చూడవచ్చు.

 

నిజానికి ప్రస్తుత ప్రభుత్వం ఈ గాలేరు-నగరి కింద పెట్టిన ఖర్చును,పనులపురోగతిని ప్రజలముందు ఉంచగలరా?అసలీ పైడిపాలెం కంటే ఆయకట్టుకు పూర్తిగా ఉపయోగపడే చిత్రావతి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ను నింపగలరా?

 

ఇంతా చేసి ఈ హడవుడికి కారణం ఏమంటారా?

 

రామలక్ష్మి ఆరుద్ర గారికి గడ్డం అడ్డం అనిపించలేదేమో కానీ అందరూ అలా ఉండరుగా!ఎవరికే ఇబ్బందొచ్చిందో?అడ్డమైందో??

 

స్థానిక నాయకుడి గడ్డం తీయించాలనే ఈ హడావుడిపనులు,ఆవెంటనే పంపులు అప్పేయడమేగా జరగబోయేదనుకుంటూ నవ్వుకుంటున్నారు పులివెందుల ప్రజలు.