లక్కీ డ్రా ను అంబేద్కర్ తో ముడేస్తారా...
నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం వారు ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. అదేమిటంటే, "కాష్ లెస్ ట్రాంజాక్షన్స్" చేసేవాళ్ళకు ప్రోత్సాహకాలుగా బంపర్ డ్రా తీసి, రివార్డులు ఇవ్వడం.
ఇంకొన అవమానకరమయిన నిర్ణయం బంపర డ్రా అంబేద్కర్ జయంతి రోజున తీయాలనుకోవడం.
ఈ "బహుమతుల విలువ ఏకంగా 340 కోట్లు" - ఇదంతా ఎవడబ్బసొమ్ము ?నాకుతెలిసి ప్రపంచంలో ఏ దేశమూ ఇలాంటి దిక్కుమాలిన ప్రకటన చేసి ఉండదు.
ఈ స్కీమును రెండు భాగాలుగా విభజించారు ఒకటి "లక్కీ గ్రాహక్ యోజన" - ఇది వినియోగదారులకు.. రెండోది "డిజి ధన్ వ్యాపార్ యోజన" - ఇది వ్యాపారస్తులకు.
ఈ స్కీముల్లో భాగంగా, ఆన్లైన్ లావాదేవీలను చేసే వినియోగదారులకూ - వ్యాపారస్తులకూ, ప్రభుత్వం వారు, లక్కీ డ్రా తీసి, బహుమతులు అందజేస్తారన్నమాట.
నవంబర్08, 2016 నుండి 13-ఏప్రిల్-2017 మధ్యలో ఎవరైతే 50 రూపాయలనుండి 3 వేల మధ్యలో కాష్ లెస్ ట్రాంజాక్షన్స్ / డిజిటల్ పేమెంట్లు చేస్తారో, అదికూడా కేవలం "UPI, USSD, AEPS and RuPay Cards" ద్వారా మాత్రమే చేయాలన్నమాట. అంటే దేశం మొత్తం మీద అతి ఎక్కువ మంది ఉపయోగించే "VISA & Master Card" వాడకందార్లకు ఇవన్నీ వర్తించవు.
అసలు "డిజిటల్ పేమెంట్లు / కాష్ లెస్ ట్రాంజాక్షన్లు చేసేవాళ్ళకు లక్కీ డ్రా వేసి బహుమతులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడమే ఒక మతిలేని నిర్ణయం అనుకొంటే, అవికూడా దేశం మొత్తం మీద అతిఎక్కువ మంది ఉపయోగించే "VISA & Master Card" వాడకందార్లకు వర్తింపజేయకపోవడం ఇందులో కూడా నిజాయితీ లేకపోవడం మరీ విడ్డూరం.
అసలు ఒక ప్రభుత్వం, ప్రజలసొమ్ముతో ఇలా లక్కీ డ్రాలు పెట్టడం ఎంతవరకూ సమంజసం ? ఈ సోమ్మంతా ఎవరిది ? జనాలదే కదా ? ఇలా ఇష్టారీతిన దుర్వినియోగం చేయడం సహించరానిది.
ఈ స్కీమ్ ను "పేద, మధ్యతరగతి వారికోసమే" తెచ్చామని ఓవైపు చెబుతూ, మరోవైపు మాత్రం "నల్లధనాన్నీ - అవినీతినీ నిర్మూలించడానికి" ఈ "కాష్ లెస్ ట్రాంజాక్షన్స్" ను ప్రోత్సహిద్దా మంటూ చెబుతున్నారు . అంటే దీనర్థం పేద - మధ్యతరగతి ప్రజలు అవినీతిపరులూ - నల్లధనాన్ని ప్రోత్సహించేవాళ్లనేనా. అసలు వాళ్ళ ప్రకటనలకు అర్థం ఉందా ??
ప్రతి రోజూ 1000 రూపాయల వంతున 15 వేల వినియోగదారులకు 100 రోజులపాటు ఈ బహుమతులు ఇస్తారట.. వారం వారం 50 వేలు, 5 వేలు, 2.5 వేలు ఇస్తారట. మెగా డ్రా మాత్రం 14-ఏప్రిల్-2017న ఉంటుందట. ఆ మెగా డ్రాలో వినియోగదారులకు 1 కోటి, 50 లక్షలు, 25 లక్షలు లక్కీ డ్రా తీసి బహుమతులు అందజేస్తారట. అలాగే, వ్యాపారస్తులకు 50 లక్షలు, 25 లక్షలు, 12 లక్షలు అందజేస్తారట..
ఇంతకంటే మతిలేని ప్రకటన ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వామైనా చేస్తుందా ? ఇంతచేసీ, సంచలనమైన నోట్ల రద్దుపై పార్లమెంట్ లో నోరు కూడా మెదపని ఏకైక ప్రధాని మోడీ నే కాబోతున్నారు. పార్లమెంట్ సెషన్ లో ఒక్క మాట కూడా మాట్లాడలేని ప్రధాని కూడా మోడీనే.
ఇక చివరగా, ఈ మతిలేని నిర్ణయాన్ని "క్రిస్మస్ కానుక"గా సాక్ష్యాత్తూ ప్రధాని పేర్కొనడం ఆయన దివాలాకోరు తనానికి నిదర్శనం. పైగా "అంబేడ్కర్ జయంతి" 14-ఏప్రిల్-2017 ను "మెగా డ్రా కు ఎన్నుకోవడం. ఉత్తి ప్రచారం తప్ప, పనికొచ్చే పనులు చేయలేని చేతగాని ప్రభుత్వం ప్రజలపాలిట శాపంగా పరిణమించింది. ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి.. జైహింద్..