Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రెడ్డీలపై ఇదేమి ప్రేమ రావు గారు ?

kcrs respect for raja bahaddur venkatrama Reddy is not pure

రాజాబహూదూర్ వెంకటరామారెడ్డి సంక్షేమ ట్రస్టుకు 10 కోట్లు కేటాయించి, 10 ఎకరాల స్థలం ఇచ్చారు తెలంగాణ సిఎం కెసిఆర్. రెడ్డి హాస్టల్ శతాబ్ధి ఉత్సవాల పేరుతో నానా హడావిడి చేసింది సర్కారు. కోట్లాది రూపాయల ప్రజా ధనం మంచినీళ్లలా ఖర్చు చేశారు. పత్రికలన్నింటికీ కోట్ల కొద్ది ధనం వినియోగించి యాడ్స్ ఇచ్చారు. పబ్లిసిటీ జోరుగా చేశారు. కానీఎవరి పేరుమీద అయితే ఇంత హడావిడి చేశారో ఆ వ్యక్తి సమాధి మీద వంద రూపాయలు ఖర్చు చేసి దండ కొని వేయడానికి సర్కారు పెద్దలకు మనసు రాలేదు. శతాబ్ధి ఉత్సవాల వేళ కోత్వాల్ రాజా బహుదూర్ వెంకటరామారెడ్డి సమాధి రంగులేయడానికి కూడా నోచుకోలేదు.  

సమాధి వద్ద రెండేళ్ల కిందటి ఫ్లెక్సీ మాసిపోయి, రంగులు ఎలిసిపోయి కనిపిస్తున్నది చూడండి.

kcrs respect for raja bahaddur venkatrama Reddy is not pure

అదేమంటే ఆయన సమాధితో ఏం పని అనుకున్నారేమో సర్కారు పెద్దలు. ‘మేము ఏది చెబితే జి హుజూర్ అంటూ రాసే పేపర్లలో ప్రకటనలు రావడం మాకు ముఖ్యం... రేపటినాడు నాలుగు ఓట్లు రావడం ముఖ్యం... గంతమటుకే మేం చేస్తం’ అన్నట్లుంది సర్కారు పెద్దల తీరు. సరే సర్కారులో ఉన్న మంచి రెడ్డీలకు (కోదండరాం లాంటి వాళ్లు దొంగ రెడ్డీలు అని విమర్శిస్తున్నారు కదా వాళ్లు) అయినా  వెంకటరామారెడ్డి సమాధి మీద పూల మాలలు వేసి నివాళ్లు అర్పిద్దామన్న సోయి లేకపోవడం అత్యంత బాధాకరం. కనీసం సమాధిని అలంకరించే సోయి కూడా లేకపాయే ఈ ప్రభూత్వానికి. 

పది కోట్ల ధనం, పదెకరాల స్థలం ఇచ్చినందుకు రెడ్డి జాతి సంతోష పడాలా? లేక ఈ పేరుతో సర్కారు చేస్తున్న వికృత క్రీడలో రెడ్డి జాతితో చెలగాటమాడుతున్నందుకు బాధపడాలో  తెలియని పరిస్థితి ఏర్పడింది. గచ్చిబౌలిలో హస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేసిఆర్ ప్రభుత్వం "చారాణ కోడికి బారాణ మాసాల అన్న చందంలా" ఈ కార్యక్రమం ప్రచారం కోసమే కోసం 5 కోట్లకు పైగా ఖర్చుచేంది. గూలాబీ బాస్ 2019 ఎన్నికల్లో రెడ్డి ఓట్ల కోసం కపట ప్రేమను ఒలకబోస్తున్నారు. అందులో భాగంగానే నిన్న రాజేంద్రనగర్ లో రెడ్డి సంక్షేమ హస్టల్ కు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన వెనుక ఇంకో రహస్యం కూడా దాగి ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న జేఎసి నేత కోదండరాం ను ప్రతిపక్షాలన్నీ ఏకమై  సియం గా ప్రకటిస్తే తన పుట్టి మునుగుడు ఖాయమన్న భయంతోనే కేసిఆర్ రెడ్డి హాస్టల్ హడావిడి చేసిండని తేలిపోయింది. ఎలాగైనా ఆ దిశగా ప్రతిపక్షాలు కోదండరాం కు మద్దతివ్వకుండా చేయడం, అలాగే రాజకీయంగా కోదండరాం ను అణగతోక్కే ప్రయత్నం చేయడమే అసలు రహస్య ఎజెండా అని జనాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కుల రాజకీయాలు చేస్తారనే కోదండరాం తన పేరులోంచి రెడ్డి అనే జమానాలోనే తీసేశారు. ఇంకో విషయమేమంటే ఆయన తన ఇద్దరు పిల్లలను రెడ్డీలకు కాకుండా వేరే కులాల వారికి ఇచ్చి పెళ్లిళ్లు చేశారు. అయినా ఆయన కోదండరాం కాదు కోదండరాం రెడ్డి అని దొంగ రెడ్డి అని యావత్ తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా కారు కూతలు కూస్తూ అధికార పార్టీ నేతలు వికృత ఆనందం పొందుతున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి, వెలమ దొరలకు కోదండరాం నిజమైన ప్రత్యర్థిగా వారికి కనిపిస్తే తప్పు లేదు కానీ ఆయన పేరు పక్కన ఉన్న రెడ్డి అనే పదాన్ని తొలగించుకున్న తర్వాత కూడా దొంగ రెడ్డి అని మంత్రివర్గంలో ఏమాత్రం పలుకుబడి లేని ఒక రెడ్డి మంత్రి చేత దూషింపజేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. అధికార పార్టీ భయాందోళనలో ఉందన్న అనుమానాలు ఇలాంటి కూతలను చూస్తే వ్యక్తమవుతున్నాయి.


శంకుస్థాపన జరిపిన సభలో సియం కేసిఅర్ మహనీయుల పేర్లను, వారి చరిత్రలు ,స్థలాలు,అనవాళ్లు ఆంధ్రా పాలకుల పెత్తనంలో కనుమరుగు అయ్యాయని బాధపడ్డారు. మరి అలాంటప్పుడు తెలంగాణ పాలకుడై  కేసిఅర్ కి నిన్న  ఈ మాహనీయుడి సమాధి గుర్తుకు రాలేదా? అన్నది అంతుచిక్కడం లేదు. ప్రతి విషయంలో ఆంధ్ర పాలకులను కారణం చూపుతున్న కేసిఅర్ ఈ నిర్లక్షానికి భాద్యులు తెలంగాణ పాలకులా? లేక ఆంధ్రా పాలకులా?అన్నది కేసిఅర్ రే సమాధానం చేప్పాలి. జీవితాలకు విద్యావ్యాప్తి కోసం తపించి ఎన్నో కాలేజీ లు, స్కూళ్ళు,హాస్టళ్ళు కట్టించిన గొప్ప దాత మన రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి. కుల మతాలకు అతీతంగా విద్యార్థులకు రెడ్డి హాస్టళ్ళలో ఆశ్రయం కల్గించిన గొప్ప వ్యక్తి రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి.

రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి గొప్ప సంఘ సేవకులు మరియు విద్యాదాత. సమాజానికి చదువు చాల అవసరం అని నమ్మినవారు అందుకె ఎన్నో బడులకు,కళాశాలలకు మరియు వసతి గృహాల కు డబ్బును దానం చేసినారు. పల్లెటూర్ల నుండి హైదరాబాద్ రావడమే కష్టమైనటువంటి రోజుల్లొ ఆబిడ్స్ మరియు నారాయణగూడ లాంటి ప్రధానమైన ప్రాంతాల్లో విద్యా సంస్థలను మరియు వసతి గ్రుహాలను నిర్మించారు. కుల మతాలకు అతీతంగా విద్యార్థులకు రెడ్డి హాస్టళ్ళలో ఆశ్రయం కల్గించిన గొప్ప వ్యక్తి. ఇంతటి గోప్ప వ్యక్తికి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యపు నివాళులే అర్పించిందన్న బాధ గుండెల్లో గుచ్చుకుంటున్నది. 

లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న సమాధికి నివాలులు అర్పించడానికి వెళ్లిన రెడ్డి జాగృతి నాయకులు వందేళ్ల పండగనాడు అక్కడి సమాధి ధీన స్థితిని చూసి ఈ నిర్లక్షానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎప్పటికైనా వెలమల రాజ్యం పేరు గుర్తుండాలనే ఆలోచనతో అప్పట్లో తెలంగాణ ప్రాంతంలో వెలమల సామ్రాజ్యం  రాచకోండ పేరుతో ఒక కమిషనరేట్ ను ఏర్పాటు చేయడం చూస్తే తెలంగాణలో చరిత్ర పుణారావృతం కానుందా అనే సంకేతాలు మాత్రం బలంగా అందుతున్నాయి. అప్పట్లో కోండవీడు సామ్రాజ్యం రెడ్డి రాజులది,రాచకోండ సామ్రాజ్యం వెలమలది, ఎప్పుడూ ఆ రెండు రాజ్యాలకు పాము,ముంగిస లాంటి వైరం ఉండేది, మరి ఇప్పుడు ఏం జరుగుతదో చూడాలి.

మరోవైపు హాస్టల్ శంకుస్థాపన సభలో వరాల జల్లు కురిపిస్తున్నట్లు చెప్పిన కేసిఆర్ ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అప్పా పేరు మార్చిన విషయాన్ని తన హయాంలో చేసినట్లు గొప్పగా  చెప్పుకోవడం చూస్తే రెడ్డీలను నొసటితో ఎక్కరిస్తూ నోటితో పొగిడినట్లు ఉంది తప్ప మరొకటి కాదు. ఎవరిని మభ్య పెట్టడానికి ఊరించే మాటలు, కపట ప్రేమలు ఒలకబోస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాకపు జనాలు రెడ్డీలు కాదని సర్కారు పెద్దలు గుర్తు పెట్టుకుంటే మంచిది.

 

- జిల్లేల శ్రీకాంత్ రెడ్డి,

సెల్.8801713330,

తిర్మలాపురం గ్రామం,

ఉప్పునుంతల మండలం,

నాగర్ కర్నూల్ జిల్లా.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి