కేసిఆర్ గారూ... అది చేస్తే మీవాళ్లే మీ పుట్టి ముంచుతారు
తెలంగాణ ప్రభుత్వానికి – సిఎం కేసిఆర్ గారికి నా యొక్క విన్నపం ఇదే. నేను ఒక రైతుగా - ఎన్నో భూ వివాదాలు చూసిన వానిగా చెప్పుతున్నాను. భూముల రికార్డుల పక్షాళన మంచి నిర్ణయమే కానీ.. మీరు అనుకున్నంత ఆశామాషి కాదు సుమా. మీరు పెద్ద కందిరీగల తుట్టేను కదుపు తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టు ముట్టు ప్రాంతంలో ఎన్నో భూవివాదాలు ఉన్నాయి. కింది కోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు వెయిల కొద్ది ఎకరాలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి వివాదాలను పరిష్కరించి రికార్డులను మార్చడం సాధ్యమేనా? అదీ అ ఆ లు కూడ తెలియని రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో కమిటీలు వేయడం అస్సల్ తగదు.
దీనివల్ల మీకు మీ పార్టీకి పెద్ద నష్టమే జరగబోతున్నది. డబ్బులు ఉన్న భూ భకాసురులకు మేలు జరగ వచ్చు కానీ మామూలు సన్నకారు చిన్నకారు మధ్య తరగతి రైతులకు తీరని నష్టం జరగ బోతున్నది. ఊర్లలో ఎన్నో వివాదాలకు తావు ఇవ్వబోతున్నది. రాజకీయ బెదరింపులు లాంటివి తెర మీదకొస్తాయి. ఏండ్ల నుండి భూమి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న వారికి నష్టం జరగ వచ్చు. అంతేకాకుండా మీరు చేసిన రికార్డు సవరణలు మల్లి కోర్టులలో కేసులు పడవచ్చు. మళ్లా మళ్లా వివాదాలు కావచ్చు. అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
మీరు ఈ కమిటీలతో మార్చిన రికార్డు భహల్ అవుతాది అనుకోవడం శుద్ద దండుగ. కాబట్టి వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకోని " భూముల రికార్డుల పక్షాళనలొ " రాజకీయ నాయకులను కాకుండా జుడీష్యరీ కి సంబంధించిన వారిని & రెవెన్యూకు సంబంధించిన వారిని కలిపి కమిటీ వేయాలి. ఆ కమిటీలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి పార్టీ నుండి ఒక్కరిని మాత్రమే సలహా సభ్యులుగా తీసుకోవాలి.
ముఖ్యంగా నైజాం నవాబు ఎనకట గుట్టల చుట్టు వాగుల చుట్టు గొలుసు పట్టి కొలవకుండా గుర్రాల అంగులతో కొలిసి నక్షాలను రూపొందించారు. ఒక ఊరి నక్షాకు ఒక ఊరి నక్షాకు పొంతన అసలే ఉండదు. ఓవర్ లాపింగ్ ప్రతి గ్రామానికి ఉంది కాబట్టి ముందుగా గ్రామాల హద్దులు నిర్ణయించి నక్షాలు తయారు చెయాలి. ప్రతి రైతుకు తన భూమిలోనికి పోవటానికి దారి ఏర్పరచాలి. అందుకు దారి ఇస్తున్న రైతులకు నష్ట పరిహారం ప్రభుత్వమే చెల్లించాలి. ఆ దారిని నక్షాలొ పొందు పర్చాలి. తరువాత రైతుల పొజీషన్ (భూమి హక్కు దారుడు పట్టా & కాస్తు) సర్వే చెసి మ్యాపులు తయారు చెయాలి సర్వే నెంబర్లు కెటాయించాలి. దానికి జుడీషరీ అధికారీ ఆమొదం పొందాలి. అభ్యంతరాలను జుడీష్యరీ వారికే అప్పీలు చేసుకునే స్వేచ్చ ఇవ్వాలి. అప్పుడే మీ చేతులకు ఎలాంటి మురికి అంటదు. లేక పోతే మీకు మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది.
- కరుణాకర్ దేశాయి కేతిరెడ్డి,
సోషల్ యాక్టివిస్ట్, హైదరరాబాద్.
మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి