కానూన్ కే హాథ్ బహుత్ లంబే హోతే హై...

kanoon ke haath lambe hote hai

కానూన్ కే హాథ్ బహుత్ లంబే హోతే హై...అప్పట్లో వినీవినీ విసుగొచ్చిన డైలాగ్.

నిజమే పెద్దగానో,పొడుగ్గానో ఉంటాయి కానీ అవి ఎవరికి అవసరమొస్తే అప్పుడే ఉపయోగపడేది.

ఈరోజు చూడండి తి.తి.దే పాలకవర్గ సభ్యుడి ఇంటిమీద ఆదాయపన్ను శాఖ దాడులు..ఒకరు నల్లధన శేఖరుడని రాస్తే,మరొకరు భోషాణం బద్దలు,ఇంకొకరు కొండంత అవినీతి అంటూ మొత్తానికి 90 కోట్ల నగదు.100 కిలోల బంగారం దొరికిందని రాసారు.నిజానికీ రాతలను అధికారులు ధృవీకరించారా???

 

సరే ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం.....

 

ప్రజారాజ్యం పార్టీ దుకాణాన్ని మూసి 2011 ఫిబ్రవరిలో కాంగ్రెస్ లో చేరాడు చిరంజీవి,తన తిరుపతి శాసన సభ్యత్వానికీ రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఇక, చిరంజీవి, బావ అల్లు అరవింద్ ఏదో విప్లవం తీసుకువస్తారని ఇల్లు గుల్ల చేసుకుని పార్టీ టికెట్లకు సమర్పించుకున్నామని ఘొల్లుమన్నారు చోటామోటా నాయకులు. 

 

ఈలోగా జూన్ 2012 లో నెల్లూరు పార్లమెంట్ స్థానానికి,18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి.

కాంగ్రెస్ కు,కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీని ఎలా బతికించుకోవాలో అర్ధం కాలేదు.

 

చూస్తే అంతోఇంతో ప్రజాకర్షణ ఉన్న వ్యక్తి చిరంజీవి మాత్రమే.ఆయనేమో బెల్లం కొట్టిన రాయులా..కాదు కాదు...రాతిదూలాన్ని లాగి సేద తీరిన ఎద్దులా కూర్చుండిపోయాడు.

రైతు చేసే పనే ఇక్కడ అధిష్టానం చేసింది....అదే..ముల్లుకర్ర తో పొడిచి లేపటం.

 

అంతే...సరిగ్గా ఎన్నికలకు నెల ముందు చెన్నైలో ఉన్న చిరంజీవి అల్లుడి ఇంటి మీద ఆదాయపన్ను శాఖ దాడులు.

 

మొత్తానికి మంచాల కిందున్న 35 కోట్లు పట్టుకున్నారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తయినా..డబ్బు విషయం ఏమైందో మనబోటోళ్లం ఎప్పుడూ చదవలేదు.

 

అదే పాత ముల్లుకర్ర ప్రయోగమే ఇప్పుడూ....

ముందు ఈ తి.తి.దే సభ్యుడి ఇంటిమీద దాడులు.

చెప్పకనే చెబుతున్నారు....మా చేతులు చాలా పొడువు...జాగ్రత్త...తోక జాడిస్తే తెగుతుందని....

ఇంతోసి పుణ్యానికి మా మోడీ మామయ్య భక్తులు ఆయన ఛాతీ కంటే ఎక్కువ బోరవిరుచుకుని భజనలు చేస్తున్నారు...

తర్వాత  ఏమౌతుందో చూడాలి కదా...

 

అందుకే వర్తమానాన్ని అర్ధం చేసుకోవాలంటే గతంలోకీ పోతుండాలి...ఇక్కడ కొత్తదేం లేదు...  

ఇంకా ఆ పాత సినిమా..రాజనాల విలనీ అంటే ఎలా???