Asianet News TeluguAsianet News Telugu

అమెరికా తరహా రికో చట్టం ఇండియాకు అవసరమా!

India too needs  a RICO ACT on the lines of US statute

1970 నాటికి అమెరికా ఎకానమీ పరవళ్లు తొక్కుతూ ఉంది.  

 

ప్రపంచం లోనే నంబర్ వన్ ఎకానమీ. దేశ విదేశాలు డాలర్ మీద నే వ్యాపారం చేసే వాళ్ళు. అలా ఉన్నప్పుడు కార్పోరేట్, ఇటాలియన్ మాఫియా పడగ లేపింది. గాడ్ ఫాదర్ సినిమా చూసారు కదా. అది దీని మీదే. మాఫియా అన్ని రంగాల్లో ప్రవేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకి లంచాలు ఇచ్చి అన్ని దందాలు చేసేది.

 

రియల్ ఎస్టేట్,డ్రగ్స్,నిర్మాణ రంగం హార్బర్ , ఆలివ్ ఆయిల్ ఇలా మాఫియా చెయ్యని దందా లేదు. తేడా వస్తే చంపెసుకునే వాళ్ళు. అప్పటి అమెరికన్ చట్టాల ప్రకారం ఎవరన్నా హత్య చేస్తే వాడే శిక్ష అనుభవించాలి, వాడికి అది చెయ్యమని ఆర్డర్ ఇచ్చిన వాడు, నేను చెప్పలేదు పో అని తప్పించుకోవచ్చు, లేదా అది ప్రూవ్ చెయ్యడం కష్టం. పైగా మాఫియా డాన్ వరకూ వెళ్ళడం చాలా కష్టం, మధ్యలో ఎన్నో లింక్ లు, పెద్ద ఆర్గనైజేషన్. అప్పుడు అమెరికా రీకో చట్టం ( Racketeer Influenced and Corrupt Organizations Act) అనే చట్టం తీసుకు వచ్చింది.

 

దాని ప్రకారం ముప్ఫై ఐదు నేరాలతో ఒక లిస్టు తయారు చేసారు. వాటిలో మినిమం రెండు నేరాలు లాస్ట్ పది సంవత్సరాలలో చేసి ఉండాలి. ఫలానా నేరం గొప్ప, ఇంకోటి తక్కువ అని లేదు. అమెరికా ఈక్వల్ ఆపర్త్యునిటీ సొసైటీ కదా. అన్ని నేరాలకి సమాన రేటింగ్. అలాంటి నేరం జరిగి దానిలో రాకెట్, లేదా ఆర్గనైజేషన్ ఉంటె, కేవలం అనుమానం మీదే ఆర్గనైజేషన్ మొత్తాన్ని బోనులో నిలబెట్టొచ్చు. ప్రూవ్ అయితే మొత్తానికి చాలా కటిన శిక్షలు ( పాతిక వేల డాలర్ ల ఫైన్, ఇరవై ఏళ్ళు జైలు శిక్ష) ఉండేవి.

 

 ఈ చట్టం గొప్ప తనం ఏమిటి అంటే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( అక్కడ డిస్ట్రిక్ట్ అటార్నీ అంటారు) కనుక ఎవరి మీద అయినా రీకో కేసు పెడితే వెంటనే వాడి ఆస్తులు, బాంక్ డిపాజిట్ లు అన్నీ సీజ్ అయిపోతాయి. అది కాక పెర్ఫార్మెన్స్ గ్యారంటీ బాండ్ కూడా తీసుకుంటారు. రుజువు అయితే మొత్తం ప్రభుత్వం లాగేసుకుని వేలం వేస్తుంది. ఇది రీకో చట్టం కదా, అవసరం అయితే వాడిది ఒక్కడిదే కాక, ఇంట్లో ఉన్న అందరి మీద ఇది పెద్ద రాకెట్ అని తెచ్చి పెట్టి, వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చెయ్యొచ్చు.

 

రూడి గిలియాని పేరు విన్నారు కదా. మాజీ న్యూయార్క్ మేయర్. ఈయన న్యూ యార్క్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నప్పుడు 1985 లో ఐదు మాఫియా ఫామిలీ ల మీద రీకో కేసు పెట్టాడు. అనేక అరెస్ట్ లు జరిగాయి. ఒక సంవత్సరం లోపు లో తీర్పు వచ్చింది. మాఫియా టాప్ బాస్ లు అందరూ జైలు కి పోయారు. వాళ్ళ ఆస్తులు ప్రభుత్వ పరం అయ్యాయి. దీన్ని మాఫియా కమీషన్ కేసు అంటారు. రిచర్డ్ నిక్సన్ అమెరికా ని సూపర్ పవర్ చేసే అనేక గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు. వాటిలో రీకో చట్టం కూడా ఒకటి. ఇండియా లో కూడా రీకో చట్టం అవసరం ఉంది కదా?