Asianet News TeluguAsianet News Telugu

‘ఆవు ఆవు’రుమనేవాళ్లకి ఆవు గురించేం తెలుసు?

cow lived as a member of the family in Rayalaseema villages

పురాణాల ప్రకారం రంతిదేవుడనే రాజు ఒక యాగం చేసి ఎన్నో జంతువులను వధిస్తే వాటి చర్మాల గుట్టల నుంది కారిన రక్తం నది అయిందని..ఆ నదిని చర్మావతి అయి ఆ తర్వాత చంబల్ గా మారిందని కథ...చరిత్ర ప్రకారం ఆర్యులు లేత దూడల మాంసాన్ని నేతిలో వేయించుకుతిన్నారని ఉంది...ఆ తర్వాత జైన,బౌద్ధ ధర్మాలను ఎదుర్కోవడానికి గోమాంస భక్షణ నిషేదించారని చెబుతారు.. గోమాత,గోవుమాలక్ష్మి అనడమే తప్ప ఇందరు దేవుళ్లున్న మనదేశంలో ఒక్క ఆలయమైనా గోమాతకు కట్టించామా?

 

ప్రాచీన నాగరికతల్లో గోమాత ఆలయం కనిపించేది ఈజిప్ట్ లోనే..ఎవరా గోమాత?

cow lived as a member of the family in Rayalaseema villages

అప్పుడు భూమిమీదున్న మానవులు ధర్మాన్ని మరచి స్వార్ధంతో పశుప్రాయులుగా జీవించసాగారు.అది చూసిన సూర్యుడికి ఆగ్రహం వచ్చింది.వారిని శిక్షించి పద్దతిగా ఉండేట్లు చూడమని తన కూతురు గోమాతను ఆదేశించాడు.ఆ గోమాత జనాలను సంహరించడం మొదలుపెట్టింది...నెత్తురు నదుల్లా ప్రవహించింది...అది చూసి..ఇక భూమ్మీద మానవాళే ఉండదని గ్రహించిన సూర్యుడు గోమాతను శాంతింపచెయ్యాలనుకున్నాడు...మధువును తయారు చేసి అందులో మానవరక్తాన్ని,వనమూలికలను కలిపి ఆమెతో తాగించాడు...మత్తిలిన గోమాత శాంతించింది.

ఇదీ ఆ గోమాత కథ...ఆ సూర్యుడి పేరు "ర"...ఆ గోమాత పేరు "హథొర్"....

cow lived as a member of the family in Rayalaseema villages

 

ఈ హథొర్ ను మూడు రూపాలుగా కొలిచేవారు....గోవు రూపం...స్త్రీ రూపము,గోవు చెవులు,కొమ్ములతో...కొమ్ముల మధ్య సూర్య బింబాన్ని మోస్తూ.....

ప్రేమ,ఆనందం,అందానికి అధిదేవతైన హథొర్ ఆలయం డెందెర లో ఉంది...ఆ రోజుల్లో ఈ ఆలయంలో వ్యాధులు నయమవుతాయని సుదూరప్రాంతాలనుంచి జనం వచ్చేవారు...అంతేకాక ఇక్కడ విశ్రమించి ఆలయ నిద్ర చేసేవారు...ఇక్కడి కోనేరులో స్నానాలు చేసేవారు...

ఈ ఆలయ పైకప్పుపై రాశిచక్రాన్ని చెక్కారు...గోడలపై కానుకలర్పించిన క్లియోపాత్రా రూపాన్ని చెక్కారు....

ఇంతకీ ఈ గోమాత కు పెళ్లైందా?భర్త ఉన్నాడా?

ఈ గోమాత భర్త హాథోర్..డేగ తల దేవుడు...అసలు మన గోమాత హథొర్ అన్నదానికి అర్ధం..."హొరుస్ నిలయ"....మన విష్ణుప్రియ,శివప్రియ,శ్రీనిలయ ల్లా లేదూ...

 

ఒకసారి రాయలసీమ గ్రామాల్లోకి వెళదామా....

 

cow lived as a member of the family in Rayalaseema villages

మా రాయలసీమ బావిలో ఉన్నంతవరకూ మాకేం చిత్రమనిపించేది కాదుగానీ..పక్క బావులు,చెరువులు చూసాక మా పెద్దలను అడుగుతాము..."ఎందుకు మన సీమలో మనుషులు,పశువులూ కలిసి జీవిస్తున్నా"మని...

"మిమ్మల్ని సాకలేదా? మీకన్నా కొన్నాళ్లకు మాటలొస్తాయి...అవి మూగజీవాలు ఎదురుగా ఉంచుకుని వేళకింత మేతవేసి సాకి చంటిపాపల్లా చూసుకోకుంటే ఎట్లా" అని జవాబిచ్చేవారు ఆ పెద్దలు...

సరిగ్గా ఇలాంటి తండ్రీ కొడుకుల సంవాదమే రామకృష్ణారెడ్డి గారి కథ "మనిషి-పశువు"...

ఇంట్లో ఒక పక్క పశువులు..మరో పక్క చిన్న అరుగులాంటి నిర్మాణం...దీన్ని జగితి అంటారు...దానిమీద రెండుమూడు గదులు..ఒకటి వంటిల్లు,మరొకటి ధాన్యం దాచుకునేది...మరొకటి వస్తువుల కోసం....ఇక ప్రైవసీ వగైరాలంటూ ఉండవు...ఆ జగితి మీదే పడుకోవడాలు(వేసవిలో ఆరుబయట,మెత్తు మిద్దెలపైన)....

మరి మనకైతే దోమతెరలు..మరి పశువులకో? పొగ వచ్చేలా పొట్టు,కాస్త గడ్డీ....

అలాంటి ఒక రాత్రి....ఇల్లంతా పొగచూరింది...పగలు భర్త అవసరాలు తీర్చిన ఆ ఇల్లాలు...ఆ రేయి మంచం వైపు సాగింది...."ఎవరూ?" అంటూ దోమతెరలోంచి బావగారి కంఠం...ఆ తర్వాతెప్పుడూ వారు కన్నెత్తి కూడా చూసుకోలేదన్న హృదయాన్ని కదిలించే సన్నివేశం ఆ మనిషి-పశువు కథ లో ఉంటుంది...(ఇలాంటి కథలు నిజంగానూ జరిగిండొచ్చు)

cow lived as a member of the family in Rayalaseema villages

 

అంతేనా..1800-50 ల మధ్యకాలం నాటి కాశీయాత్ర చరిత్రలో ఏనుగుల వీరాస్వామి గారు రాయలసీమలో మనుషులు,పశువులు కలిసి జీవించే దురాచారం ఉందని రాసారు...

కర్నూల్ జిల్లాలోని బండి ఆత్మకూరు చేరి ఇంకా ఈవిధంగా రాసారు... పశువులకు తాము కాపురముండే ఇండ్లకన్నా చక్కగా కొట్టములు కట్టి బాగా కాపాడుతున్నారు...ఆవుల పాలు పితుకుట లేదు..ఎనుపపాడి సహజముగా ఉన్నది..

ఈ ఆచారం ఎందుకొచ్చుంటుంది?ఏ ఆచారమైనా కొన్నాళ్లకు దురాచారమేగా అయ్యేది!

చిన్న ఉదాహరణగా చెప్పాలంటే కొన్ని దశాబ్దాల క్రితం పారే నీళ్లు పరిశుద్ధమంటూ తాగేవాళ్లం,పంట కాల్వల్లోవి కూదా...ఇప్పుడు తాగగలమా?ఏ పెస్టిసైడ్స్ కలిసాయో,నదుల్లో ఏ రసాయనాలు కలిసి తాగి రోగాలబారిన పడతామో అని చేతులతో తాకని రోజులొచ్చాయి....

మరి మా సీమ ఆచారం/దురాచారం కు కారణం.....ఆ పక్క నుంచి ఈ పక్కనుంచీ వచ్చే శత్రురాజుల బెడద,పంటలు కోసి ఎత్తుకు పోవడాలో లేక పశువులనూ అపహరించి తీసుకుపోవడమో చేసుంటారు...ఈ బాధలు అనేక సంవత్సరాలు చూసి ఎందుకొచ్చిన గొడవని ఇంట్లో ఉంచుకునే అలవాటు చేసుకుని ఉండొచ్చు...జాగ్రత్త కోసం ఊరి గవిని తలుపులేస్తే సరిపోతుందనుకుని ఉండొచ్చు ..లేదా...విజయనగర సామ్రాజ్య పతనానంతరం సమర్ధపాలకులు లేక మరాఠా దండ్లు,పిండారీలు..పగటిదొంగలు,దివిటీ దొంగలు.... తాకిడికైనా భయపడి ఈ ఆచారం మొదలుపెట్టి ఉండవచ్చు...అది అలాగే సాగిపోతూ ఉంది...

 

మరి పశువులనూ పిల్లల్లా సాకిన రైతులు,గ్రామాల నేటి పరిస్థితి. ఇంట్లో ఉన్న గాడిపాల్లు మాయమయ్యాయి...ఆ రొచ్చు/గంజు గుంతలను(పశువుల మూత్రానికోసం మోచేతి లోతున్న గుంతలుండి వాటిపై గుండ్రని రాళ్లను మూసేవారు...కుండల్లోకి తోడి పేడతో పాటూ దిబ్బల్లో వేసేవారు) కాంక్రీటు పలకతో  మూసేసారు...గాడిపాల్లున్నప్రదేశాన్ని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు...పట్నాలకు సమీప గ్రామల్లో తప్ప మిగిలిన చోట్ల పాడి పశువులు కనిపించడం లేదు...(యాంత్రకీకరణ మొదలయ్యాక ఎద్దులు మాయమై చాలా రోజులైంది)...వారానికోసారి పేడ,ఎర్రమన్ను కలిపి అలికి ముగ్గులేసి,బొట్లుపెట్టిన పొయ్యిగడ్డల స్థానంలో గ్యాస్ స్ట వ్, మైక్రోవేవ్ ఆవెన్  వచ్చాయి...ఉట్లు పోయి ఫ్రిజ్లొచ్చాయి...సంగటి..పశువుల మడ్డికూడు కలియబెట్టే తెడ్లు మాయమయ్యాయి...రోళ్లూ,రోకల్లూ మూలనపడ్డాయి...జంగిలికిపోయే పశువులు..గోధూళి వేళ ఎక్కడా కనిపించవు....2000 జనాబా ఉన్న ఊర్లలో 3 బెల్ట్ షాపులు,6 చికెన్ సెంటర్లు వచ్చేసాయి.

 

దేశవిదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు పొలాలు కౌలుకిచ్చి పట్నాలబాట పట్టారు...ఒకప్పుడు కళకళ లాడిన ఇండ్ల దూలాలు,దంతెలు నేడు పెళపెళ విరిగేట్లున్నాయి..హమ్మయ్యా..కూలితే ఈ పెద్ద మెత్తుమిద్దె బదులు 2 గదుల ఇల్లుకట్టుకుందామని ఉన్నారు.

 

కౌలుకు తీసుకున్న రైతుల పరిస్థితి వర్ణనాతీతం....వ్యవసాయాన్ని మించిన జూదముందా?పైన కురియవు...కింద పారవు.ఇక రైతుకూలీలు..ఇతరత్రా జనం ఈ దిక్కుమాలిన పనులు చేసేబదులు ఒక ఆటో నడుపుకున్నా చాలని పట్నాల బాట.మార్పు సహజం...వారి జీవన విధానాలను,ఆధునికతను తప్పుపట్టలేము...కూడదు.ఒక వేళ విమర్శిస్తే అది ఎలా ఉంటుందంటే....సంక్రాంతి పండుగరోజు పేడ బదులు రసాయనాలు కలిపిన కళ్లాపి చల్లి గోసంరక్షణ గురించి చెప్పినంత చోద్యంగా..

 

ఇక్కడ మాత,మాత అనే వాళ్లను ఒకటి అడుగుతున్నా...మీ తాత,తండ్రులైనా...వాటిని ఇంట్లో ఉంచుకుని పిల్లల్లా సాకిన మా తాత తండ్రులైనా వట్టిపోయాకో,ముసలివయ్యాకో అమ్మేసారే కానీ సమాధులు కట్టించారా? కొనేవారు కాపాడుతారో,కబేళాలకే తోలుతారో తెలియకే ఆ పని చేసారా?

 

గుండెలు బాదుకునే మీరంతా కుక్కలను పక్కలో పడుకోబెట్టుకునే బదులు ఒక గోవును పెంచరే!

 

మన కొంపల్లో చచ్చిన పశువుల మాంసం తిని ఊరిశుభ్రతకు పాటుబడిన వారినీ పెద్ద మాంసం తింటారని అవహేళన చేస్తామే?

 

జంతువూ తల్లే...ఒక భూమీ తల్లే. ఆ తల్లిబిడ్డల్లో మా ప్రాంతం ప్రజలు నిస్సహాయులై ఒక్కో జిల్లా నుంచిపది శాతం జనాలు వలసవెళుతుంటే ఒక్క ముక్కా అనరే/రాయరే...అందరూ ఆ తల్లి పిల్లలైనప్పుడు బొంబాయి రెడ్ లైట్ ఏరియా చేరింది నీ చెల్లి కాదా?

 

మరో నగరం లో కాలువలు ఎత్తిపోస్తున్న రైతన్న నీ అన్న కాడా?గల్ఫ్ దేశాల్లో చావుదెబ్బలు తింటున్నావిడ నీ అక్క కాదా?మనుషులకు ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి చూపని,పశువులకు ఇంత మేత సరఫరా చెయ్యని వెధవ ప్రభుత్వాలను ఒక మాటంటూ రాయరు కానీ రాసేవారి గోడలు తొంగి చూసి అయ్యో,అయ్యో తెలుగు తల్లిని మరో ముక్క చేస్తారా అంటూ గుండెలు తెగ బాదుకుంటారే...ఈ కబేళాలకు తరలుతున్న గోమాతలను దత్తత తీసుకుని సాకరే?మేమూ దేశభక్తులమే..ప్రత్యేక దేశం అడగట్లేదు.....విడిపోతే అభివృద్ధి జరుగుతుందని గాఢంగా నమ్ముతున్నాము.

మరి భూభాగాలకు,జంతువులకు పవిత్రత,పూజనీయతలంటగట్టి మీరేంచేస్తున్నారు?

వ్యవసాయానికి అవసరమైన ఎద్దులనిచ్చిన ఆవు పూజనీయమే...ఆ వ్యవసాయాలే కట్టిపెట్టారు,పచ్చని పొలాలు ఆ పేరు,ఈ పేరు చెప్పి ఊరూరా లాగేస్తున్నారు...ఇక గోమాతకు విలువెక్కడ?గోమాత సంతతి నేడెక్కడ?

cow lived as a member of the family in Rayalaseema villages

 

గాడిపాల్లున్న ఇంటి ఫోటో కోసం వెదకటానికే చాలా సమయం పట్టింది(ఆ ఇల్లలోనూ దోమలకు పొగ పెట్టేబదులు ఫ్యాన్ లు పెట్టేస్తున్నారు)....

 

మనం నగరాల్లో ఆధునికతతో బతుకుతూ అన్ని ఎలెక్ట్రానిక్ పరికరాలు,ఇతర వస్తువులూ వాడుతూ ఇంకా ఆహార అలవాట్ల గురించే కొట్టుకుందామా?ఏ సన్నాసి వెధవలో ఓట్ల కోసం చేస్తున్న రాజకీయాల్లో పావులవుదామా?మనల్ను వాడుకుంటున్న ఆ సన్నాసులే పెద్ద బీఫ్ ఎగుమతి దారులే.

 

ఏ ప్రభుత్వమొచ్చినా ఏ ఊహలరాజ్యమో రాదు.అందరం కలిసే బతకాలి..తప్పదు.ఎవరిని ఎక్కడికీ పంపలేము.ఏదో ఒక  సమస్య తో వైషమ్యాలు పెరగడం తప్ప మరోటి కాదు.సరే ఎవరో సన్నాసులు తినొద్దంటే ఆందోళనలు చేసే మార్గాలనేకం ఉన్నాయి...అవి వదలి రెచ్చగొట్టే పండుగలవల్ల ఒరిగేదేం లేదు...విద్వేషాలు తప్ప.

 

నా దృష్టిలో స్వాతంత్రానంతరం రెండు ప్రధాన మార్పులను చూసాను...ప్రపంచీకరణ వల్ల ఆర్ధిక పరిస్థితుల్లో మార్పులు...మరొకటి రామ జన్మభూమి/బాబ్రీ మసీదు....మత పిచ్చి పెంచుకుని ఉన్మాదానికి చేరుకున్నాం...వాడు గడ్డి తిని పశువులా బతుకుతున్నాడు,నేనూ బతుకుతా...అనుమానాల బతుకులు.మళ్లీ ఈ రెంటినీ కలగలిపి... దైనందిన జీవితంలో ప్రతిక్షణం ఆధునిక సాంకేతిక పరిశోధనల ఫలాలను అనుభవిస్తూ(విద్యా,వైద్యాలు,వాహనాలు,ఫోన్లు వగైరావగైరా)ఒక పరుగు...మళ్లీ ఇటు మౌడ్యం వైపూ పరుగులే...ఇంట్లో మతాన్ని వదలలేమా?పిల్లలంతా మెడిసిన్, టెక్నికల్ కోర్సులను  చేసి ఉన్నతంగా ఉండాలి...మళ్లీ పాపం పెన్నులకు పూజలు,ప్రార్ధనలు చెయ్యాలి..ఆరేళ్ల పసిపిల్లలూ హిజబ్ ధరించే స్కూల్స్ కు పోవాలి...ప్రవచనాలు,,కూటములకు,ఇస్తెమాలకు లక్షలాదిగా తరలి వెళ్తున్నాం....అక్కడ బుర్రలకేం ఎక్కించుకుంటున్నారో కానీ పక్క మనిషిని మాత్రం ప్రేమించలేకున్నాం.

 

జంతువులు,పొరకలు,చాటలు,చెంబులు,దిక్కుమాలిన శాస్త్రాలు......ఎప్పుడు ముందుకు పోయేది....

.

వేల సంవత్సరాల నాగరికత...మనం మహా బతికేది వందేళ్లు...చరిత్రలో ఎన్నో నాగరికతలొచ్చాయి..ఎన్నో పరిణామాలు చెందాయి...వేల ఏండ్లు పూజలందుకున్న దేవుళ్ళూ మాయమయ్యారు.మనం నేడు గాఢంగా నమ్ముతున్న మతాలు,దేవుళ్లూ,ఆచారాలూ కొన్ని వందల, వేల ఏళ్లకు మాయమయ్యేది మాత్రం నిజమని చరిత్ర చెబుతోంది.... మార్పు తప్ప శాశ్వతమందేదీ లేదు.

 

ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి చీలికలు తెస్తున్నది మేము కాదు..మీరని తెలుసుకోండి.

 

ఒకప్పటికంటే అక్షరాస్యత రేటు పెరిగింది.... మనిషిని మనిషి ప్రేమించుకుందాం రండి.