ట్రైలర్లు, టీజర్లకే కేసిఆర్ సర్కారు పరిమితం : బిజెపి
ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం కేవలం ట్రైలర్లకు, టీజర్లకే పరిమితం అవుతుంది. ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ట్రైలర్ల మీద ట్రైలర్ల రిలీజ్ చేస్తుంది తప్ప సినిమా రిలీజ్ చెయ్యడం లేదు. సినిమా ప్రొడక్షన్ కు ఛాలా సమయం తీసుకుంది అని అనుకున్న బాహుబలి సినిమా సైతం మూడేళ్ళలో పూర్తి అయింది కానీ మీరు వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తయినా ఉద్యాగాల ట్రైలర్లకు, టీజర్ లకే పరిమితమైంది తప్ప ఉద్యోగాల హామీ నెరవేర్చడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లో, విభాగాల్లో మొత్తం 2.5 లక్షల ఖాళీలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వాటిలో కనీసం పది శాతం కూడా భర్తీ చేయకపోవడం రాష్ట్రంలోని నిరుద్యోగులను వంచించడమే.
ప్రగతి భవన్, సెక్రటేరియట్ మీద ఉన్న శ్రద్ధ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం పైన ఎందుకు లేదు? ఉద్యాగాలు ఇవ్వకపోతే ప్రపంచం మునిగిపోతుందా అని ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు. ప్రపంచం ఏమీ మునిగిపోవడం లేదు కానీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నారాయణఖేడ్ లో రామకృష్ణ, ఆదిలాబాద్ లో మహేందర్ లాంటి నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
ఇప్పటివరకు వచ్చిన నోటిఫికేషన్లన్నీ పాత జిల్లాల ప్రాతిపదికన వస్తే ఇప్పుడు డి ఎస్సి ఎందుకు కొత్త జిల్లాల పేరు మీద ఎందుకు చేయాలనుకుంటున్నారు? కొత్త జిల్లాల పేరు మీద వచ్చే న్యాయ పరమైన చిక్కులను చూపెట్టి భర్తీ ప్రక్రియ ఆపాలని చూస్తున్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కొత్త జిల్లాల వారిగా జోనల్ పద్ధతి తీసుకురావడానికి కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. జిల్లాలు ఏర్పడి సంవత్సరం తర్వాత జోనల్ పద్ధతి ఇప్పుడు గుర్తు వచ్చిందా? ఇన్ని రోజులు ఎం చేశారు? గుడ్డి గుర్రాల పళ్ళు తోమారా?
ఏనుగుల రాకేష్ రెడ్డి,
భారతీయ జనతా పార్టీ,
తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి.
హైదరాబాద్.
సెల్ నెం. 9000522400.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి