కర్నూల్: మహిళా అభివృద్ది మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శుల శిక్షణా తరగతులు కర్నూల్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. దిన్నేదేవరపాడులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో రెండు వారాల పాటు (09.12.2019 నుండి 21.12.2019 వరకు) ఈ శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ శిక్షణ తరగతులను కర్నూలు రేంజ్ డిఐజి  వెంకటరామిరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళా సంరక్షణ కార్యదర్శులు గ్రామాల్లో, పట్టణాల్లో బాలికలు, మహిళలకు సంబంధించిన సమస్యలను గుర్తించి తమకు(పోలీసులకు) సమాచారం అందించాల్సి వుంటుందన్నారు. మహిళా సమస్యలను గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు.

మహిళలకు సంబంధించి చట్టంలోని పలు ఐపిసి సెక్షన్లతో పాటు మహిళా మిత్ర, మహిళల అభివృద్దికి చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. మొదటి విడతగా మహిళ సంరక్షణ కార్యదర్శులు మొత్తం 175 మందికి గాను 165 మంది హాజరయ్యారన్నారు.

read more ఉత్కంఠకు తెర... వైసిపి తీర్థం పుచ్చుకున్న గోకరాజు కుటుంబం
 

కర్నూలు జిల్లాకు మొత్తం 1181 పోస్టులు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఇందులో 1034  మంది అపాయింట్ మెంట్ ఆర్డర్స్ తీసుకున్నారన్నారు. వీరందరికి 7 దఫాలుగా డిటిసిలో ట్రైనింగ్ ఇస్తామన్నారు. ఒక వారం పాటు పోలీసుల శిక్షణ తరగతులు ఉంటాయన్నారు.  మరొక వారం పాటు ఐసిడిఎస్ వారి శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. 

ఐసిడిఎస్ ఉమెన్ &  చైల్డ్ వేల్పేర్ ప్రాజెక్టు డైరెక్టర్ లీలావతి మాట్లాడుతూ.... జిల్లాలో 16 ఐసిడిఎస్ ప్రాజెక్టులున్నాయన్నారు. ఆయా గ్రామాల్లో కలిపి మొత్తం 3,545 అంగన్ వాడి సెంటర్ లు ఉన్నాయన్నారు. వ్యవస్ధ బాగుకు అందరూ పాటు పడాలన్నారు.  గ్రామ, మండల, జిల్లా స్ధాయిలలో మహిళల, బాలికల సంరక్షణకు అందరూ బాగా కృషి చేయాలన్నారు. 

read more దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాలు గాంధీకి తరలించేందుకు ఏర్పాట్లు

ఈ కార్యక్రమంలో ఓఎస్డీ  ఆంజనేయులు, డిఎస్పీ డిటిసి వైస్ ప్రిన్సిపల్  పి.ఎన్ బాబు, ఐసిడిఎస్ ఉమెన్ &  చైల్డ్ వేల్పేర్ ప్రాజెక్టు డైరెక్టర్ లీలావతి  , అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ,  డిసిపిఓ శారద, ఐసిడిఎస్ అధికారులు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.