తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న అనుమానంతో ఓ మహిళా డాక్టర్ నర్సులను కత్తులతో, సూదులతో హింసించింది. వివరాల్లోకి వెళితే... డాక్టర్ విజయలక్ష్మీ, ఆమె భర్త రామకృష్ణ సూర్యాపేటలో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతిని నిర్వహిస్తున్నారు.

అయితే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న పలువురు నర్సులతో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని విజయలక్ష్మీకి అనుమానం మొదలైంది. ఈ క్రమంలో వైద్యురాలికి, నర్సులకు మధ్య దీనిపై పలుమార్లు గొడవలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.

Also Read:దిశను చేసినట్లే చేద్దామని... మృగాడి నుంచి తెలివిగా ఇలా...

ఈ అనుమానం తారాస్థాయికి వెళ్లడంతో కొన్ని రోజుల క్రితం ఓ మహిళా నర్సును విజయలక్ష్మీ విధుల నుంచి తొలగించారు. ఈ నెల 6న భర్త లేని సమయంలో విజయలక్ష్మీ నర్సులుగా పనిచేస్తున్న సునీత, ప్రమీలను పిలిచి చైర్లో కూర్చొబెట్టి బంధించింది.

అనంతరం యాసిడ్, పినాయిల్‌తో బెదిరించి సూదులతో గుచ్చడంతో పాటు సర్జరీలు చేసే కత్తులతో హింసించింది. తన భర్తతో అక్రమ సంబంధం ఉందా..? లేదా..? అని ప్రశ్నిస్తూ వారిని గాయపరిచింది. ఒకవేళ లైంగిక సంబంధం ఉంటే మానుకోవాలని వైద్యురాలు హెచ్చరించింది.

Also read:ఫోన్ మాట్లాడొద్దన్న భర్త.... ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య

అర్థగంట పాటు ఆమె పైశాచికాన్ని భరించిన నర్సులు ఆ తర్వాత తోటి నర్సుల సాయంతో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.