గణేష్ నిమజ్జన సమయంలో జరిగిన ఓ సంఘటన స్థానికులు ఆశ్చర్యంలో ముంచెత్తింది.  రాచకొండ పోలీసుల ముందు ఓ మహిళ రెచ్చిపోయి డ్యాన్సులు వేసింది. పోలీసుల ముందే డ్యాన్సులు చేయడంతో పాటు వాటితో టిక్‌టాక్ వీడియోలను రూపొందించింది సదరు మహిళ. ఆమె ఉత్సాహం చూసి స్థానికులు కూడా కొందరు ఆమెతో కలిసి చిందులు వేశారు.

పోలీసుల ముందు ఆమె అంత ధైర్యంగా డ్యాన్స్ వేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలాంటి జంకు, బెరుకు లేకుండా ఆమె ఉత్సాహంగా చిందులు వేసింది. కాగా... ఆమె డ్యాన్స్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

  వాట్సాప్ గ్రూపుల్లో కూడా నెటిజన్లు విపరీతంగా ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు.  అయితే ఆమె ఎవరు.. ఏంటి అనేది ఇంకా తెలియరాలేదు. నిమజ్జనం సందర్భంగా.. ఆ ఉత్సాహంలో చేసిన డ్యాన్సుగానే తాము భావిస్తున్నామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.