కర్నూలు జిల్లా డోన్ లో విషాదం చోటుచేసుకుంది. నలుగురు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలకు విషం ఇచ్చి... తల్లికూడా విషం తీసుకుంది. కాగా ఈ ఘటనలో తల్లి మృత్యువాతపడగా.... చిన్నారులు మాత్రం కొనఊపిరితో  కొట్టుకుంటున్నారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తల్లి చనిపోయిందని.... చిన్నారుల ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే  ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.