weather report:ఆంధ్రాకు తప్పని వర్షం ముప్పు...ప్రజలకు హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ(గురువారం) కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండి ప్రకటించింది. పిడుగులతో  కూడిన వర్షాలు కురిసే అవకాశం వుండటంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది.  

weather report: IMD forecasts heavy to very heavy rainfall in Andhra Pradesh

ఈరోజు(గురువారం) కూడా ఆంధ్రా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇప్పటికే వర్షాలతో తడిసి ముద్దవుతున్న  ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి  జిల్లాల్లో ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే రాయలసీమ, దక్షిణ  కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.

భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదుల్లో భారీగా వర్షపు నీరువచ్చే అవకాశాలున్నాయి. ప్రజలు వాగులు,  నదులు దాటకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే లోతట్టు  ప్రాంతాల ప్రజలు  అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని జారీ చేశారు.

Read more Huzurnagar Election Result 2019:హుజూర్‌నగర్‌లో దూసుకుపోతున్న కారు...

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి,కృష్ణా నదులకు భారీగా వరదలు వస్తున్నాయి. తుంగభద్ర మొత్తం గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. ఈ సీజన్ లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. శ్రీశైలం 7గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతానికి అనుకోని తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా దానికి అనుబంధంగా 5.8 కిమీ ఎత్తులో ఆవర్తనం కూడా కొనసాగుతుంది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి కోస్తాంధ్ర తీరంవైపు పయనించనుందని దీనిప్రభావంతో రాష్ట్రంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. తీరంవెంబడి దీనిప్రభావంతో యాభై కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు.

Read more #HuzurNagar Result: 14,300 ఓట్ల మెజార్టీతో సైదిరెడ్డి...

ఈ కారణంగా ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. విశాఖలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో తుంగభద్ర మొత్తం గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. ఈ సీజన్ లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. శ్రీశైలం 7గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుకుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios