బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కాకినాడకు చేరుకున్నారు. ఉదయం 8.20 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం కిషన్ రెడ్డి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఉదయం 9.30 గంటలకు కాకినాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌కి చేరుకున్నారు. జేఎన్‌టీయూకేలో నిర్వహించే సదస్సుతో పాటు మధ్యాహ్నం జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ అధికారులతో జరిగే సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు.

అనంతరం సాయంత్రం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.

"