విశాఖ భూకుంభకోణం...సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: గంటా

విశాఖ భూకుంభకోణంపై వైఎస్సార్‌సిపి ప్రభుత్వం కొత్తగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేయడంపై టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.  

tdp  mla Ganta  srinivas rao welcomes move to form new SIT to probe vizag land scam

విశాఖపట్నం:  మాజీ ఐఎఎస్ అధికారి విజయకుమార్ నేతృత్వంలో విశాఖ భూకుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్ ను స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రత్యేక బృందం నిష్పక్షపాత విచారణ చేస్తుందన్న సంపూర్ణ విశ్వాసం ఉందని గంటా పేర్కొన్నారు. ఈ నివేదిక రాష్ట్ర ప్రజల ముందే బహిర్గతం కావాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

 విశాఖపట్నం, చుట్టుపక్కల మండలాల్లో ఆరోపణలున్న భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) తాజాగా పునర్నియమించడం మంచి పరిణామమన్నారు.  ఈ బృందం తక్కువ సమయంలో అంటే దాదాపు మూడు నెలల్లోపు విచారణ పూర్తి చేస్తే బావుంటుందన్నారు. విచారణ నివేదికను ప్రజల ముందు బహిర్గతం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని గంటా అన్నారు.

వాస్తవానికి సిట్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలో సీనియర్ కేబినేట్ మినిస్టర్ హోదాలో తానే స్వయంగా దర్యాప్తు కోరుతూ చొరవ తీసుకున్నానని అన్నారు. ఇందుకోసం  అప్పటి ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం మరొక్కసారి గుర్తుచేశారు. అయితే కారణాలు ఏమైనప్పటికీ ఆ నివేదిక బహిర్గతం కాలేదని పేర్కొన్నారు. 

తాను కేబినెట్ మంత్రి హోదాలో కూడా ఆ నివేదికను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం కూడా రాజకీయ, అధికార వర్గాలందరికీ తెలుసన్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ నివేధిక బయటపడలేదని పేర్కొన్నారు.

విశాఖ భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు: గంటా శ్రీనివాసరావుకు చిక్కులు..? ...

వైస్సార్‌‌సిపి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఈ ఏడాది ఆగస్ట్ 29న మళ్లీ సిట్ ని పునర్నియమించాలని కోరానని అన్నారు. నిష్పక్షపాత విచారణా నివేదికను బహిర్గతం చేసి ప్రజలకు వివరించాలని విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులుగా కోరినట్లు గంటా గుర్తు చేశారు. 

రాష్ట్ర ఆర్థిక రాజధానిగా కొనసాగుతోన్న అద్భుత నగరం విశాఖలో ఇలాంటి వాటికి అవకాశం ఉండకూడదన్నారు. ప్రశాంత, పారిశుద్ధ నగరంగా విశాఖకు ఉన్నపేరును రాజకీయాలతో కలుషితం చేయకూడదని సూచించారు. అలా చేయరన్న అచంచల విశ్వాసం తనకు వుందన్నారు. 

నూతన సిట్ బృందానికి ఎప్పుడు ఎలాంటి సహకారం కావాల్సి వచ్చినా మేము ముందుంటామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా తన వినతులను స్వీకరిస్తుందని కోరుతున్నట్లు గంటా పేర్కొన్నారు. 

విశాఖ భూ కుంభకోణం...టిడిపి కార్యాలయ భవనం కూడా..: వైసిపి ఎమ్మెల్యే...

నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా భూముల  ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనలో హైదరాబాద్ వంటి మహానగరాన్ని కోల్పోవడంతో ఒక్కసారికి అక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీన్ని అదునుగా చేసుకుని విశాఖపట్నంలో భూకబ్జాదారులు చెలరేగిపోయారు. 

 నగర సమీపంలోని వేల ఎకరాలు  భూములు కబ్జాకు గురైనట్లు గతంలో ప్రతిపక్షంలో వునన వైఎస్సార్సిపి  ఆరోపించింది. ఇప్పుడు వారే అధికారంలోకి వచ్చారు కాబట్టి విశాఖ భేకుంభకోణంపై మరో సిట్ ను ఏర్పాటుచేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios