కడప: బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తాను బీజేపీలో చేరాలనుకోవడం లేదన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. దేశంలో జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రస్తుతం బీజేపీ ప్రభంజనం వీస్తుందని తెలిపారు. అందుకు చంద్రబాబు పాత్ర కూడా పరోక్షంగా ఉందన్నారు. 

జమిలి ఎన్నికలు వస్తే రాష్ట్రంలో బీజేపీ పుంచుకోవచ్చునన్నారు. బీజేపీ బలపడాలంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడే దిక్కన్నారు. చంద్రబాబుపై బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని కుండ బద్దలు కొట్టారు మాజీ ఎంపీ జేసీదివాకర్ రెడ్డి.