Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అధ్యక్షతన టిడిఎల్పి సమావేశం... చర్చించిన అంశాలివే

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గత ఆరు రోజులుగాచోటుచేసుకున్న పరిణామాలు, చివరిరోజు అనుసరించాల్సిన వ్యూహాలపై  చంద్రబాబు అధ్యక్షతన టిడిఎల్పీ సమావేశం జరిగింది.  

TDLP Meeting In NTR Bhavan at  mangalagiri
Author
Amaravathi, First Published Dec 16, 2019, 9:33 PM IST

అమరావతి: మంగళగిరిలో ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న టిడిపి కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ లో సోమవారం చంద్రబాబు అధ్యక్షతన టిడిఎల్పి సమావేశం జరిగింది. ఈ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఆరు రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలతో పాటు రేపు(మంగళవారం) చివరిరోజు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

ఈ సమావేశంలో చర్చించిన అంశాలివే

''1. శాసన సభ సమావేశాలకు రేపు(మంగళవారం) చివరిరోజు. గత 6రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని సభాసాక్షిగా నిలదీశాము. ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక వైసిపి నేతలతో తిట్టించి  ఆనందం పొందుతున్నారు. సభ సజావుగా నడపడం చేతగాక, అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చే సామర్ధ్యం లేక ఈ విధంగా దూషణల పర్వానికి తెరలేపారు. 
ఈ సమావేశాల్లో వైసిపి నేతల డొల్లతనం బైటపడింది. సమస్యలు పరిష్కరించలేక ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారు. మైక్ కట్ చేస్తున్నారు.సభ్యునిపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రివిలేజ్ ఇవ్వడం హాస్యాస్పదం. సభ్యునికి మైకు ఇవ్వవద్దని ముఖ్యమంత్రే స్పీకర్ ను ఆదేశించడం విడ్డూరంగా ఉంది. 

TDLP Meeting In NTR Bhavan at  mangalagiri

2. వైసిపి ప్రభుత్వం అసెంబ్లీ తెరపై వేసిన వీడియో క్లిప్పింగ్ లు బూమరాంగ్ అయ్యాయి. ఏదో వేయాలని చూసి మరేదో వేశారు. బీసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి మహిళలకు 45ఏళ్లకే పించన్ హామీ స్క్రోలింగ్ లు అసెంబ్లీ తెరపై పడటంతో వైసిపి మంత్రులకు దిమ్మ తిరిగింది.రైతు భరోసాపై ప్రశ్నను చర్చకు రాకుండా చేశారు. రైతులకు చేసిన ద్రోహం ఎక్కడ నిలదీస్తామో అనే భయంతోనే డీమ్డ్ టు బి ఆన్సర్డ్ గా పేర్కొని దాటేశారు. ఒక్కో రైతుకు రూ.5వేలు ఎగ్గొట్టడం, రుణమాఫీ 4,5 కిస్తీలు, రూ.8వేల కోట్లు ఎగ్గొట్టడంపై నిలదీస్తామనే భయంతోనే దాటేవేత వేశారు.

3. శాసన మండలిలో చర్చించిన అంశాలపై విశ్లేషించాం. ఆదరణ పథకంలో అవినీతి జరగలేదని శాసనమండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా వైసిపి ప్రభుత్వమే పేర్కొంది. కేంద్రం ఇచ్చిన జీవోలు మూడింటిని చూపి నరేగా నిధులు విడుదల చేయకపోవడంపై నిగ్గదీశాం. బిల్లులు ఇవ్వడానికి చేతులు రావడంలేదుగాని, ఢిల్లీ వెళ్లి నరేగా అవార్డులు ఏవిధంగా తెచ్చుకుంటున్నారని నిలదీశాం. 

read more  అమరావతి రాజధానిగా పనికిరాదని ఆ కమిటీయే చెబుతోంది: బొత్సా సంచలనం

టిటిడిలో సభ్యుల నియామకంపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిగ్గదీశాం. 75% రిజర్వేషన్లు స్థానికులకే అనేది, 50% రిజర్వేషన్లు బిసి,ఎస్సీ,ఎస్టీ మైనార్టీలకే అనేది టిటిడి సభ్యత్వ నియామకాల్లో ఎందుకు పాటించలేదని ప్రశ్నించాం. టిటిడిని భక్తిభావన లేకుండా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. 

సమ్మిట్స్  ద్వారా రూ.1,39,000కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 1,54,000మందికి ఉద్యోగాలు వచ్చాయని శాసన మండలిలో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిని బట్టే టిడిపి హయాంలో సమ్మిట్స్ విజయవంతం అయ్యాయని వైసిపి ప్రభుత్వమే ఒప్పుకుంది. దేశంలో 6సమ్మిట్స్ నిర్వహించి, సత్ఫలితాలను రాబట్టిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే. 

పోలవరంలో కూడా ఏవిధమైన అక్రమాలు జరగలేదని సాక్షాత్తూ కేంద్రమంత్రే పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన సొంత ఇంటికి రూ.17కోట్లు ప్రజాధనం ఖర్చుపెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి అది బైటపడేసరికి ఇచ్చిన జీవోలను రద్దు చేశారు. తన కంపెనీకి జరిమానా విధించారనే అక్కసుతోనే కృష్ణకిషోర్ పై కేసు బనాయించారు.

read more  తప్పని తిప్పలు... క్యూలో నిల్చుని ఉల్లిపాయలు కొన్న మాజీ ఎమ్మెల్యే

4. దిశ చట్టం చేశారేగాని, మహిళలపై అఘాయిత్యాలను నియంత్రించలేక పోయారు. గుంటూరులో ఎస్సీ బాలికపై అత్యాచారం, త్రిపురాంతకంలో బిసి బాలికపై అత్యాచారం..రెండుచోట్ల అఘాయిత్యాలకు పాల్పడింది అగ్రవర్ణాలవారే. గుంటూరులో 4ఏళ్ల బాలికను ముఖ్యమంత్రిగాని, హోంమంత్రిగాని, కనీసం వైసిపి ఎంపిగాని పరామర్శించక పోవడం గర్హనీయం. చిత్తశుద్ది లేని ప్రభుత్వం ఇది. చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టే నేరగాళ్లంతా బరితెగించారు.

TDLP Meeting In NTR Bhavan at  mangalagiri

5. వాన్ పిక్ , లేపాక్షిలో కేవలం రూ.50వేలే పరిహారంగా ఇచ్చి ఎస్సీల భూములను వైఎస్ హయాంలో ఏవిధంగా తీసుకున్నారు..? ఇడుపుల పాయలో 600ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించి కొన్ని తరాలుగా అనుభవించిన కుటుంబం ఈ రోజు నీతులు వల్లెవేస్తోంది.  తిరుపతి ఎయిర్ పోర్టు వద్ద రూపాయి పరిహారం ఇవ్వకుండా ఎస్సీల భూములు  తీసేసుకున్నారు. నెల్లూరు లో అసైన్డ్ భూములను అలాగే లాగేసుకున్నారు.

6. మద్యం నియంత్రణపై చర్చలో టిడిపి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే.  టిడిపి హయాంలో ‘‘నవోదయం’’ పేరుతో అక్రమ మద్యం తయారీపై కఠిన చర్యలు తీసుకున్నాం. అక్రమ మద్యం తయారీని నిర్మూలించే ఉద్దేశంతో 2016 ఫిబ్రవరిలో ‘‘నవోదయం’’ పేరుతో చేపట్టిన కొత్త కార్యక్రమం చేపట్టాం. ఇలా 9 జిల్లాలను అక్రమ మద్యం తయారీ రహిత జిల్లాలుగా చేశాం. మొత్తం రాష్ట్రాన్నే అక్రమ మద్య తయారీ రహిత రాష్ట్రంగా రూపొందించాలని టార్గెట్ పెట్టుకున్నాం. 

మద్యం, బీరు పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించడానికి హెచ్ పిఎఫ్ ఎస్, ఐటి ఆధారిత ‘‘ట్రాక్ అండ్ ట్రేస్’’ సిస్టమ్ అమలు చేశాం. టిడిపి 5ఏళ్ల పాలనలో బెల్టుషాపులపై 18,170 కేసులు పెట్టాం. 18,630మందిని అరెస్ట్ చేశాం. నవోదయం పథకం కింద 9జిల్లాలను సారా రహితం చేశాం. అలాంటిది ఇప్పుడు మళ్లీ వైసిపి అధికారంలోకి వచ్చాక సారా జిల్లాలుగా చేస్తున్నారు. 

షాపుల సంఖ్యపై నిలదీసినందుకు అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ మోషన్ తేవడం ముఖ్యమంత్రి నిరంకుశ పోకడలకు పరాకాష్ట. ప్రశ్నించే గొంతు నొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అది మీడియా అయినా, ప్రతిపక్షం అయినా గొంతు నొక్కడమే.. టిడిపి హయాంలో 43వేల బెల్ట్ షాపులు ఉన్నట్లు, టిడిపి కార్యకర్తలకు వాటిలో ఉపాధి కల్పించినట్లు పచ్చి అబద్దాలు చెప్పారని’’ టిడిపి నేతలు ధ్వజమెత్తారు.

ఈ సమావేశంలో టిడిఎల్పి ఉపనేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, గౌరివాని శ్రీనివాసులు, డొక్కా మాణిక్య వర ప్రసాద్  ఇతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు  పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios