కర్నూల్: జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్లో ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై వేడివేడి సాంబారు పడి తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడ్డాడు. ఈ హృదయవిధానక ఘటన స్కూల్ హాస్టల్లోనే జరిగింది. 

ఓర్వకల్లు మండలం తిప్పాయపల్లె గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు పురుషోత్తం రెడ్డి పాణ్యంలోని విజయ నికేతన్ స్కూల్ లో యూకేజీ చదువుతున్నాడు. అయితే అతడు గురువారం మద్యాహ్నం బోజన సమయంలో బాలుడుస్కూల్ హాస్టల్ కు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడిపై ప్రమాదవశాత్తు వేడివేడి సాంబారు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. 

దీంతో స్కూల్ యాజమాన్యం వెంటనే బాలున్ని స్థానికి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఒళ్లంతా పూర్తిగా కాలిపోవడంతో బాలుడు ప్రాణాలను డాక్టర్లు కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ అతడు మృత్యువాతపడ్డాడు. 

read more  బోటు ప్రమాద బాధితులకు అండగా... నంద్యాల ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ

ఈ విషయం బయటికి రాకుండా స్కూల్ యాజమాన్యం విశ్వప్రయత్నం చేసింది. చిన్నారి తల్లిదండ్రులకు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని అప్పగింంచారు. అయినప్పటికి విషయం బయటకు పొక్కడంతో ప్రస్తుతం సదరు స్కూల్ యాజమాన్యం ఎవ్వరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలో వెళ్లిపోయారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని ఈ ఘటన ఎలా జరిగింది...కారకులు ఎవరన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

read more  కర్నూల్ ఇసుక సత్యాగ్రహం ర్యాలీలో ఉద్రిక్తత