నిజామాబాద్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదానికి కారణమయ్యింది. అయితే ప్రమాదం నుండి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి బాన్సువాడ వైపు వెళుతున్న ఆర్టిసి  బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ సమయంలో కాస్సేపు ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  అయితే బస్సు రోడ్డుపైనుండి  కిందకు దిగినా ఎలాంటి ప్రమాదానికి గురవకుండానే ఆగిపోయింది.

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఆఫర్: దరఖాస్తు పెట్టుకుని విధుల్లో చేరాలని ఆదేశం...

ఓ పక్కకు ఒరిగిపోయినసప్పటికి బోల్తా మాత్రం పడలేదు. ఇదే జరిగివుంటే ప్రమాదతీవ్రత ఎక్కువగా వుండేదన ప్రత్యక్ష సాక్షులు చెడబుతున్నారు. ప్రమాద సమయంలో చాలామంది ప్రయాణికులు బస్సులో వున్నా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. 

తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వెళుతూ బస్సును కంట్రోల్ చేయలేకే రోడ్డుపక్కకు దూసుకెళ్లి ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. 

ఆర్టిసి కార్మికులు గత రెండు వారాలుగా సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో  సమ్మెను కొనసాగిస్తూనే వున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక డ్రైవర్లతో నడుస్తున్న బస్సులు చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి.ఈ క్రమంలోనే మరో ప్రమాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.