హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో వినాయక నిమజ్జనంలో గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ వద్ద గణనాధుడి విగ్రహాన్ని క్రేన్ తో లారీలో పెట్టే సమయంలో ప్రమాదవశాత్తు ఓ పోలీస్ కానిస్టేబుల్ క్రేన్ పై నుంచి కిందకు పడిపోయాడు.

తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు హుటాహుటిన నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆయన బహదూర్‌పుర పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవీందర్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.