ఏపిలోనూ వాటర్ గ్రిడ్... మొదట ఈ జిల్లాల్లోనే...: కన్నబాబు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు స్వచ్చమైన త్రాగునీరు అందించేందుకు జగన్ ప్రభుత్వం ఇప్పటికే వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రకటించింది. దీని గురించి తాజాగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ మొదట దశలో భాగంగా పనులు చేపడుతున్న జిల్లాలో అతిత్వరలో దీన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.. 

minister kurasala kannababu comments on AP watergrid

కాకినాడ: ఆంధ్ర ప్రదేశ్ లోని కాపు సామాజికవర్గ ప్రజల కోసం ''కాపు నేస్తం'' ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయ మంత్రి కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన కేవలం ఏడు నెలల కాలంలోనే సాహసోపేతమైన సంక్షేమ పథకాలు అమలులోకి తీసుకువచ్చారని ప్రశంసించారు. 

పేద కాపు మహిళలకు సంవత్సరానికి రూ.15 వేలు అందించాలని నిర్ణయించడంపై కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు.చఉగాది నాడు అర్హులైన నిరాశ్రయులకు ఇచ్చే ఇళ్ల పట్టాలు మహిళల పేరుపై ఇవ్వనున్నట్లు తెలిపారు. నేరుగా వారి పేరు పైనే రిజిస్ట్రేషన్లు చేయించే ప్రక్రియను ప్రవేశపెతుడుతున్నట్లు వెల్లడించారు. 

read more  వివేకా హత్యపై హైకోర్టులో సునీత పిటిషన్: వైఎస్ జగన్ కు చిక్కులు

రూ.8500కోట్ల నిధులతో వాటర్ గ్రిడ్ ని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐఐఎఫ్టిని ఈ జిల్లాలో ప్రారంభించామన్నారు. ఇలా తాము అభివృద్ధి పనులను చేపడుతుంటే కొందరు  సైందవుడి లాగా అడ్డుకుంటున్నారని...వారి జన్మంత అభివృద్ధిని అడ్డుకోవడానికే సరిపోతోందంటూ పరోక్షంగా మాజీ సీఎం చంద్రబాబు, టిడిపి నాయకులను ఉద్దేశించి విమర్శించారు.

అయితే ప్రస్తుతం తాము చేపడుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ ను అడ్డుకుంటే రాష్ట్ర ప్రజలు మరోసారి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కృత్రిమ పోరాటాలను క్రియేట్ చేయడం... దానిని వారి అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. ఇప్పుడు కూడా అలాగే రాజధాని కోసమంటూ మరో కొత్త నాటకానికి తెరతీశారని కన్నబాబు ఆరోపించారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే మొదటి విడతలో  భాగంగా దాదాపు రూ.8,250 కోట్లతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పనులను చేపట్టాలని నిర్ణయించారు.  

ప్రస్తుత అవసరాలను తీర్చడంతో పాటు 2051 వరకు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 110 మండలాల్లోని 98 లక్షల ప్రజలకు స్వచ్ఛమైన నీటిని ఈ పథకం ద్వారా అందజేయనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios