Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ ఆలోచన ఇదే... సిపిఎస్ రద్దుపై మంత్రి బుగ్గన క్లారిటీ

సిపిఎస్ రద్దు అంశాన్ని రాజకీయ మైలేజీ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే వాడుకోవాలని ప్రతిపక్షాలు చూడటం సరికాదని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సూచించారు. తాము చిత్తశుద్దితో సిపిఎస్ రద్దు అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.  

 

minister buggana rajendranath reddy clarify  on CPS issue
Author
Amaravathi, First Published Dec 12, 2019, 6:42 PM IST

అమరావతి: సిపిఎస్ రద్దుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో వుందని ఆర్థిక శాఖామంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కూడా తమ  పార్టీ మేనిఫేస్టోలో కూడా సిసిఎస్ ను రద్దు చేస్తామని ప్రకటించామని మంత్రి గుర్తుచేశారు. కానీ దీనికి కాలపరిమితిని ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. 

ఇది లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించి విషయమని... ఖచ్చితంగా ఓపిఎస్ ను తీసుకువస్తామని స్పష్టం చేశారు. అయితే ఇది సాంకేతికంగా నిబద్దతతో చేయాల్సిన అంశమన్నారు. ఉద్యోగుల నుంచి అనేక విజ్ఞప్తులు వున్నాయని... వాటన్నింటినీ కమిటీ పరిశీలిస్తోందన్నారు. ఇప్పటికే సిపిఎస్ రద్దు ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం మంత్రులతో కమిటీని కూడా వేసిందన్నారు.  

''ఇప్పటికే మంత్రులతో కూడిన కమిటీ రెండుసార్లు సమావేశమయ్యింది. దీంతో పాటు ఇదే అంశంపై అధ్యయనం కోసం సిఎస్ తో సహా ఇతర సీనియర్ ఐఎఎస్ అధికారులతో కూడిన వర్కింగ్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ వర్కింగ్ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి మంత్రుల కమిటీకి సమర్పిస్తుంది.  ఈ నివేదికను పరిశీలించిన మంత్రుల కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుంది'' అని మంత్రి వెల్లడించారు. 

సిపిఎస్ రద్దు అంశాన్ని రాజకీయ మైలేజీ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే వాడుకోవాలని ప్రతిపక్షాలు చూడటం సరికాదన్నారు. బాధ్యతతో, సాంకేతిక పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా సిపిఎస్ రద్దు అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. 

read more డిగ్రీ చదివాను... అయినా నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు: మహిళా మంత్రి ఆవేదన

అనంతరం క్రిస్టియన్ ఆస్తుల సంరక్షణ అంశంపై డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్ బాష మాట్లాడారు. రాష్ట్రంలో క్రిస్టియన్ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో వుందన్నారు.  జిఓ నెం.2218 ద్వారా దీనిపై మంత్రులతో కమిటీని కూడా నియమించామని తెలిపారు. 

దేవాదాయ, ధర్మాదాయ చట్టం, వక్ఫ్ చట్టం మాదిరిగా క్రైస్తవ ఆస్తుల సంరక్షణకు ఇప్పటివరకు ఎటువంటి చట్టం లేదని గుర్తుచేశారు. క్రైస్తవ ఆస్తులన్నీ ఆయా సంఘాలు, ట్రస్ట్ ల పేరుమీద వున్నాయని... వీటి అజమాయిషీ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే  అవకాశం లేదన్నారు. అయినప్పటికీ క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. 

గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఇదే అంశంపై సభాకమిటీని నియమించారని గుర్తుచేశారు. ఈ కమిటీ అప్పటి ప్రభుత్వానికి అనేక సలహాలు, సూచనలతో నివేదిక ఇచ్చిందని...దురదృష్టవశాత్తు అదే సమయంలో ఆయన మృతి చెందడంతో ఈ నివేదికను తరువాత ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు.

read more  అసెంబ్లీ చీఫ్ మార్షల్ కు మండలి ఛైర్మన్ వార్నింగ్

టిడిపి ప్రభుత్వం కూడా ముగ్గురు మంత్రులతో ఇదే అంశంపై కమిటీ వేసిందని... కానీ దురదృష్టం కొద్ది కనీసం ఒక్క మైనార్టీ మంత్రికి కూడా ఈ కమిటీలో స్థానం కల్పించలేదన్నారు. ఈ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదంటేనే క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ పట్ల చంద్రబాబు సర్కార్ కు వున్న నిర్లక్ష్యం ఎంతలావుందో  అర్థమవుతోందన్నారు. 

ఇప్పుడు వైసిపి ప్రభుత్వం క్రైస్తవ ఆస్తుల సంరక్షణపై మంత్రులతో ఉన్నత స్థాయి కమిటీని వేసిందని... క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ విషయంలో సీఎం జగన్, ప్రభుత్వం  చిత్తశుద్దితో వున్నామని మంత్రి తెలిపారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios