అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఇటీవలే రివర్స్ టెండరింగ్ నిర్వహించి గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనుల నిర్మాణాన్ని అప్పగించిన కాంట్రాక్ట్ సంస్థను పక్కకు తప్పించింది. ఈ స్థానంలో మెఘా సంస్థకు పనులు అప్పగించగా అన్ని అడ్డంకులను అధిగమించి తాజాగా తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. 

ఇలా పోలవరంలో నేడు(శనివారం) ఉత్సాహంగా పనులు ప్రారంభమయ్యాయి. శుక్రవారమే అధికారంకంగా మెఘా సంస్థ ప్రతినిధులు పూజా కార్యక్రమాలు నిర్వహించినా పనులను మాత్రం ఇవాళ్టి నుండి ప్రారంభించారు. 

రేయింబవళ్లు కష్టపడి పనులు నిర్వహించి అనుకున్న సమయానికి ప్రాజెక్టును సిద్దంచేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అత్యంత నాణ్యతతో నిర్మాణం చేపడతామని తెలిపారు. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయడానికి కంకణబద్ధమయ్యామని అన్నారు.

read more  polavaram bhoomi puja video : పోలవరం ప్రాజెక్టు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించిన మేఘా సంస్థ

ఇవాళ చేపట్టిన పనులను జలవనరుల శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా స్పిల్‌వే నిర్మాణ పనులకు చేపడుతున్నట్లు మేఘా ప్రతినిధులు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వానికి  హైకోర్టు  గురువారం  గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు గురువారం నాడు నిర్ణయం తీసుకొంది.

 కొత్త కాంట్రాక్టర్‌తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. గురువారం నాడు ఈ స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో ప్రాజెక్టు పనులను మరింత వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉంటాయని  ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

read more  పోలవరంపై హైకోర్టు తీర్పు... ఇరిగేషన్ మంత్రి ఏమన్నారంటే...
 
పోలవరం  ప్రధాన డ్యామ్‌, జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను మేఘా కంపెని దక్కించుకొన్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.3216 కోట్ల విలువైన జల విద్యుత్ ప్రాజెక్టు, హెడ్ వర్క్స్‌కు  సంబంధించి ఈ ఏడాది ఆగష్టు 17వ తేదీన ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వ హాయంలో పోలవరం హెడ్‌వర్క్, విద్యుత్ ప్రాజెక్టు కు సంబంధించి నవయుగ కంపెనీ కాంట్రాక్టును దక్కించుకొంది.

 అయితే ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ వైఎస్ జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌కు ఆగష్టు  17వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్‌పై హైకోర్టును ఆశ్రయించింది నవయుగ కంపెనీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను  ఆశ్రయించింది.నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్టేను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు మేఘా కంపెనీకి ఆటంకాలు లేకుండాపోయాయి.