హైదరాబాద్: 

తెలంగాణ రాష్ట్ర యువ పోలీస్ అధికారుల్లో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తికి ఇటీవల పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరిగే ఈ పెళ్లి వేడుక ప్రముఖుల రాకతో అంగరంగ వైభవంగా జరగబోతుందని సమాచారం. 

ఇందులో భాగంగా ఎస్పీ చందన దీప్తి ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.అక్టోబర్ లో జరిగే ఈ వివాహానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తప్పక హాజరవుతారని సమాచారం. 

అటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరవుతారని తెలుస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ ఐపీఎస్ అధికారిణి చందన దీప్తి వివాహానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైన కనిపించనున్నారన్న మాట!!

సంబంధిత వార్తలు

లవ్ చేసే పెళ్లి చేసుకుంటానంటున్న మెదక్ ఎస్పీ చందన దీప్తి

ఐపిఎస్ లు చాలా మందే ఉంటారు.. ఈమె చాలా మందికి భిన్నం