వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి... దారుణంగా హత్య చేశారు. కాగా... కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం బయటపడింది. ఈ దారుణ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన 10వ తేదీ రాత్రి చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళ(45) భర్తతో కలిసి 20ఏళ్ల క్రితం నగరానికి వచ్చింది. కూలిపనులు చేసుకొని జీవిస్తున్నారు. కాగా.... నెల రోజుల క్రితం భర్తతో గొడవపడి నగరంలోని ఓ ప్రాంతంలో ఉంటున్న చిన్న కుమార్తె ఇంట్లో ఉంటుంది. ఈ నెల 10వ తేదీన ఇంట్లో నుంచి బటయకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు.

శుక్రవారం ఉదయం సైదాబాద్‌ ప్రాంతంలో ఓ కాలనీలో ఖాళీ ప్లాట్స్‌లోని చెట్ల పొదల్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు వెళ్లి చూశారు. వివస్త్రగా ఉన్న ఓ మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే సైదాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలించింది. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది.

మహిళను ఆత్మహత్య చేసి... అనంతరం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలికి నిత్యం కల్లు, మద్యం తాగే అలవాటు ఉండడం వల్ల ఆ రోజు చంపాపేట కల్లు కాంపౌండ్‌ నుంచి తెలిసిన వ్యక్తులు తీసుకెళ్లి ఉంటారని భావిస్తున్నారు. డబ్బుల విషయంలో వారి మధ్య గొడవ జరిగి ఉండవచ్చని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.